18
May, 2026

A News 365Times Venture

18
Monday
May, 2026

A News 365Times Venture

Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..

Date:

Drumstick Curry Recipe: మునక్కాయ వీటినే మునగకాయ అని కూడా పిలుస్తారు.. మునగ చెట్టు నుండి వచ్చే పోషకాలు అధికంగా ఉండే కాయ ఇది.. విటమిన్ సీ, ఐరన్, కాల్షియం ఇలా ఎన్నో పుష్కలంగా ఈ కాయలో ఉంటాయి.. అంతేకాదు, మునగకాయతో చేసే వంటకాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా మునగకాయతో సాంబార్ లేదా సాధారణ కూర చేస్తుంటారు. అయితే శనగపిండి, పెరుగుతో చేసే ప్రత్యేకమైన మునగకాయ కూరను చాలా మంది రుచి చూసి ఉండరు. ఈ కూరలో శనగపిండి ఇచ్చే చిక్కదనం, పెరుగు ఇచ్చే తేలికపాటి పులుపు కలిసి అద్భుతమైన రుచిని అందిస్తాయి.

మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనానికి కొత్త రుచిని ఆస్వాదించాలని అనుకునేవారికి ఈ మునగకాయ కూర మంచి ఎంపిక.. ఇంట్లో ఉన్న పదార్థాలతో సులభంగా తయారయ్యే ఈ వంటకం అన్నం, రోటీ రెండింటికీ అద్భుతంగా సరిపోతుందనే చెప్పుకోవాలి.. అంతేకాదు.. మునగకాయతో రెగ్యులర్‌గా చేసే రొటీన్‌ కర్రీల కంటే ఇది ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది..

కావలసిన పదార్థాలు
* మునగకాయలు – 500 గ్రాములు
* శనగపిండి – 4 టీస్పూన్లు
* పెరుగు – 2 టీస్పూన్లు
* తురిమిన వెల్లుల్లి – 1 టీస్పూన్
* కారం పొడి – 1 టీస్పూన్
* పసుపు – 1/2 టీస్పూన్
* ధనియాల పొడి, జీలకర్ర పొడి – 2 టీస్పూన్లు
* గరం మసాలా – 1/2 టీస్పూన్
* నూనె – 4 టీస్పూన్లు
* టమాటాలు – 2
* ఆవాలు – 1 టీస్పూన్
* జీలకర్ర – 1 టీస్పూన్
* ఇంగువ – చిటికెడు
* కరివేపాకు – 5 నుంచి 7 ఆకులు
* ఉప్పు – తగినంత
* నీరు – అవసరమైనంత
* కొత్తిమీర – అలంకరణ కోసం

తయారీ విధానం
ముందుగా మునగకాయలను శుభ్రంగా కడిగి మధ్యస్థ పరిమాణంలో ముక్కలుగా కట్‌ చేయాలి.. తర్వాత చిన్న కుక్కర్‌లో మునగకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు, తగినంత నీరు వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ఆ తరువాత కుక్కర్ చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు వేసి కొద్దిగా నీరు కలిపి మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. మరో గిన్నెలో శనగపిండి తీసుకుని అందులో కొద్దిగా కారం, పసుపు వేసి నీటితో పల్చటి మిశ్రమంలా కలపాలి. ఉండలు లేకుండా బాగా కలపడం ముఖ్యం. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేయాలి. తర్వాత ఇంగువ, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తరువాత టమాటా ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసి నూనె వేరుపడే వరకు బాగా వేయించాలి. తరువాత ఉడికించిన మునగకాయ ముక్కలు వేసి మెల్లగా కలపాలి. కొద్దిగా వేడి నీరు పోసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు శనగపిండి మిశ్రమాన్ని మెల్లగా పోస్తూ కలపాలి. శనగపిండి వేసిన తరువాత ఎక్కువగా కలపకుండా మధ్యస్థ మంటపై 5 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి. చివరగా పెరుగు వేసి బాగా కలిపి కొత్తిమీరతో అలంకరించాలి. అంతే.. కారంగా, రుచిగా ఉండే శనగపిండి-పెరుగు మునగకాయ కూర సిద్ధం. వేడి అన్నం లేదా రోటీతో వడ్డిస్తే ఇంట్లో అందరూ మళ్లీ మళ్లీ అడిగి తింటారు.. ఓ సారి ట్రై చేసి చూడండి..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അമേരിക്കയും ഇസ്രഈലും മുസ്‌ലിം രാജ്യങ്ങളെ ശത്രുക്കളാക്കുന്നു; സയണിസ്റ്റ് ഭരണകൂടത്തിനെതിരെ ഒരുമിച്ച് നില്‍ക്കണമെന്ന് പെസസ്‌കിയാന്‍

ടെഹ്‌റാന്‍: അമേരിക്കയും ഇസ്രഈലും ഭിന്നിപ്പിക്കുന്ന പദ്ധതികളിലൂടെ മുസ്‌ലിം രാഷ്ട്രങ്ങളെ പരസ്പരം ശത്രുക്കളാക്കുകയാണെന്ന്...

`ஈரானின் 5 நிபந்தனைகளும் அமெரிக்காவின் 5 பதில் நிபந்தனைகளும்.!' – என்னவாகும் போர் நிறுத்தம்?

சீன பயணத்திற்குப் பிறகு, அமெரிக்க அதிபர் ட்ரம்ப் மீண்டும் 'ஈரான்' மீது...

വേദിയിൽ മുഖ്യമന്ത്രിയും മന്ത്രിമാരും മാത്രം മതി; സത്യപ്രതിജ്ഞയിൽ കടുത്ത നിയന്ത്രണങ്ങളേർപ്പെടുത്തി ലോക് ഭവൻ

തിരുവനന്തപുരം: നിയുക്ത മുഖ്യമന്ത്രി വി.ഡി. സതീശനും മന്ത്രിസഭയും നാളെ സത്യപ്രതിജ്ഞ ചെയ്യാനിരിക്കെ...