5
July, 2026

A News 365Times Venture

5
Sunday
July, 2026

A News 365Times Venture

Tamil Nadu: ఈ రాత్రికి కేరళం వెళ్లిపోనున్న గవర్నర్.. విజయ్‌ ప్రమాణస్వీకారంపై సర్వత్రా ఉత్కంఠ!

Date:

తమిళనాడులో గత 6 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితులు తొలగిపోతున్నాయి. గవర్నర్ వర్సెస్ విజయ్ పార్టీల మధ్య సాగిన రాద్ధాంతం ఎట్టకేలకు ముగిసింది. తాజాగా విజయ్‌కు వీసీకే, ముస్లిం లీగ్ పార్టీలు మద్దతు తెల్పాయి. దీంతో టీవీకే బలం 120కు చేరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది.

ఇదిలా ఉంటే మరికాసేపట్లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను విజయ్ కలవబోతున్నారు. 120 ఎమ్మెల్యేల మద్దతు లేఖను విజయ్ అందజేయనున్నారు. మద్దతు లేఖను పరిశీలించిన తర్వాత విజయ్‌ను ప్రమాణస్వీకారానికి లోక్‌భవన్ ఆహ్వానించనుంది. ఇదిలా ఉంటే శనివారం రాత్రి గవర్నర్ అర్లేకర్ కేరళం వెళ్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అర్లేకర్ కేరళం గవర్నర్‌గా ఉన్నారు. తమిళనాడులో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ రాత్రికి కేరళం వెళ్తున్నట్లుగా సమాచారం. అయితే విజయ్ భేటీ తర్వాత ఏమైనా మార్పులు జరగొచ్చా? అన్నది తెలియాల్సి ఉంది.

అన్ని సంక్రమంగా ఉంటే వెంటనే విజయ్‌ను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉంది. అయితే ప్రమాణస్వీకారం ఎప్పుడు జరుగుతుందనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ రాత్రికే జరగవచ్చని వార్తలు వస్తున్నాయి. గవర్నర్‌తో భేటీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ജനസാഗരമായി ഗ്രാന്‍ഡ് മൊസല്ല; ഒരു കോടിയിലധികം പേര്‍ ഖാംനഇക്ക് അന്തിമോപചാരമര്‍പ്പിക്കാന്‍ ടെഹ്‌റാനിലെത്തിച്ചേരും

ടെഹ്‌റാന്‍: ഇറാന്‍ പരമോന്നത നേതാവായിരുന്ന ആയത്തുല്ല അലി ഖാംനഇക്ക് അന്തിമോപചാരമര്‍പ്പിക്കാന്‍ ടെഹ്‌റാനിലേക്ക്...

தமிழகத்தில் குதிரை பேரம், அதிகார துஷ்பிரயோகம்: ஆளுநரிடம் திமுக நேரில் புகார்!

தமிழகத்தில் தற்போதைய ஆட்சியில் குதிரை பேரமும், அதிகார துஷ்பிரயோகமும் உச்சக்கட்டத்தை எட்டியுள்ளதாக...

രാജ്യത്തിന്റെ വിദേശകാര്യ നയത്തില്‍ ഖാംനഇയുടെ പൈതൃകം ഉയര്‍ത്തിപ്പിടിക്കുമെന്ന് ഇറാന്‍

ടെഹ്‌റാന്‍: രാജ്യത്തിന്റെ വിദേശകാര്യ നയത്തില്‍ ആയത്തുല്ല അലി ഖാംനഇയുടെ പൈതൃകം ഉയര്‍ത്തിപ്പിടിക്കുമെന്ന്...