29
April, 2026

A News 365Times Venture

29
Wednesday
April, 2026

A News 365Times Venture

S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

Date:

S-400 air defence system: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరొకటి భారత్‌కు రాబోతోంది. రష్యా నుంచి ఇప్పటికే మూడు ఎస్-400 ట్రయంప్ సిస్టమ్స్ భారత్‌కు రాగా, నాలుగో సిస్టమ్‌ ఇప్పుడు భారత వైమానిక దళం అందుకోబోతోంది. మే నెలాఖరు నాటికి ఇది భారత్ చేరుకుంటుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ దాడుల్ని ఎస్-400 సమర్థవంతంగా అడ్డుకుంది. ఇప్పుడు వస్తున్న నాలుగో స్వ్కాడ్రన్‌ను పాకిస్తాన్ సరిహద్దు వద్ద మోహరించనున్నారు. దీంతో భారత గగనతల రక్షణ మరింత బలోపేతం అవుతుంది.

READ ALSO: PBKS vs RR: పంజాబ్ కింగ్స్‌కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్‌దే!

2018లో ఎస్-400 కొనుగోలుపై రష్యాతో భారత్ రూ. 35,000 కోట్ల విలువైన ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రష్యా నుంచి భారత్‌కు 5 ఎస్-400లు రావాలి. ఇప్పటికే, వచ్చిన మూడు ఎస్-400 సిస్టమ్‌లను భారత్ సరిహద్దుల్లో మోహరించింది. ఇప్పుడు నాలుగోది వచ్చే నెలాఖరు వరకు భారత్ చేరుకుంటుంది. ఐదోది 2026 చివరి నాటికి వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు అందిన మూడు సిస్టమ్స్‌లో ఒకటి భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను కలిపే సిలిగురి కారిడార్(చికెన్స్ నెక్) వద్ద మోహరించగా, రెండోది జమ్మూ కాశ్మీర్, పంజాబ్‌లకు రక్షణ కల్పించే పఠాన్ కోట్‌లో, మూడోది రాజస్థాన్, గుజరాత్ లోని కీలక ప్రాంతాల్లో మోహరించారు. ఇప్పుడు వచ్చే నాలుగవది పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ആര്‍.എസ്.എസ് നൂറാം വാര്‍ഷികാഘോഷ പരിപാടിക്കെതിരെ ജാമിയ മില്ലിയയില്‍ വിദ്യാര്‍ത്ഥി രോഷം; സംഘര്‍ഷം, നിരവധി പേര്‍ക്ക് പരിക്ക്

ന്യൂദല്‍ഹി: ജാമിയ മിലിയ ഇസ്‌ലാമിയ സര്‍വകലാശാലയില്‍ ആര്‍.എസ്.എസ് രൂപീകരണത്തിന്റെ നൂറാം വാര്‍ഷികത്തോടനുബന്ധിച്ച്...

அமெரிக்கா – ஈரான் போர் எதிரொலி: OPEC அமைப்பிலிருந்து அதிரடியாக வெளியேறிய ஐக்கிய அரபு அமீரகம்!

பெட்ரோலிய ஏற்றுமதி நாடுகளின் கூட்டமைப்பிலிருந்து (OPEC) வெளியேறுவதாக ஐக்கிய அரபு...

ವಿನಯ್ ಕುಲಕರ್ಣಿ ಶಾಸಕ ಸ್ಥಾನ ಅನರ್ಹಗೊಳಿಸುವಂತೆ ಆಗ್ರಹ: ಸ್ಪೀಕರ್ ಗೆ ಪತ್ರ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,28,2026 (www.justkannada.in):  ಧಾರವಾಡ ಜಿಲ್ಲಾ ಪಂಚಾಯತ್ ಸದಸ್ಯ ಯೋಗೀಶ್ ಗೌಡ...

വൈദ്യുതി പ്രതിസന്ധി; കുറഞ്ഞ നിരക്കിലെ കരാറുകള്‍ റദ്ദാക്കിയതില്‍ ഗൂഢാലോചന, യു.ഡി.എഫ് അധികാരത്തിലെത്തിയാല്‍ നടപടി: കെ.സി വേണുഗോപാല്‍

തിരുവനന്തപുരം: കേരളം നേരിടുന്ന കടുത്ത വൈദ്യുതി പ്രതിസന്ധി പിണറായി സര്‍ക്കാരിന്റെ അഴിമതിയും...