25
April, 2026

A News 365Times Venture

25
Saturday
April, 2026

A News 365Times Venture

Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..

Date:

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళల చిరకాల నిరీక్షణకు తెరపడింది. ‘అభయహస్తం’ పథకం కింద తాము దాచుకున్న డబ్బులు తిరిగి వస్తాయో రావో అని ఆందోళన చెందుతున్న లక్షలాది మంది మహిళలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నిధులను వెనక్కి ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏమిటీ అభయహస్తం వివాదం..?

2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం ‘అభయహస్తం’ అనే సామాజిక భద్రతా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. మహిళలు రోజుకు ఒక రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే, ప్రభుత్వం తన వాటాగా మరో రూ.365 జమ చేస్తుంది. ఇలా 60 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.500 పెన్షన్ ఇవ్వడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది మహిళలు గత 12 ఏళ్లుగా ఈ పథకంలో సభ్యులుగా ఉండి, సుమారు రూ.1,194 కోట్లు పొదుపు చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ వాటా రూ.1,000 కోట్లు కలిపితే ఈ నిధి మొత్తం రూ.2,194 కోట్లకు చేరుకుంది. అయితే.. గత ప్రభుత్వం ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించడంతో మహిళలు ఆందోళనకు గురయ్యారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ మేరకు.. డ్వాక్రా మహిళల సొమ్మును వడ్డీతో సహా తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మళ్లించిన నిధులను తిరిగి సమీకరించి, మహిళల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నిర్ణయంతో 22 లక్షల మంది మహిళలకు ఆర్థికంగా వెసలుబాటు కలుగుతుంది.

ప్రస్తుతం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇతర పథకాలతో పోలిస్తే అభయహస్తం పెన్షన్ తక్కువగా ఉండటంతో, చాలామంది మహిళలు తమ అసలు సొమ్మును వెనక్కి తీసుకోవడానికే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిధులను సెటిల్ చేయడం ద్వారా మహిళా సాధికారతకు పెద్దపీట వేసినట్లయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇది పెద్ద ఊరట.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

‘അവര്‍ ഇപ്പോഴും സൂര്യനെ വരയ്ക്കുന്നു’; ദല്‍ഹിയില്‍ മിനാബ് പെണ്‍കുട്ടികളുടെ കലാസൃഷ്ടികളുടെ പ്രദര്‍ശനം

  ന്യൂദല്‍ഹി: അമേരിക്കയുടെയും ഇസ്രഈലിന്റെയും ആക്രമണത്തിന്റെ ഇരകളായ കുരുന്നുകളുടെ സ്വപ്‌നങ്ങളും കണ്ണീരും...

ಒಳಮೀಸಲಾತಿ ಕಗ್ಗಂಟು ಅಂತ್ಯ:  ಕ್ಯಾಬಿನೆಟ್ ಸಭೆಯಲ್ಲಿ ಮಹತ್ವದ ನಿರ್ಣಯ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,24,2026 (www.justkannada.in): ರಾಜ್ಯದಲ್ಲಿ ಒಳಮೀಸಲಾತಿ ಜಾರಿಯಲ್ಲಿ ಉಂಟಾಗಿದ್ದ ಗೊಂದಲವನ್ನು ನಿವಾರಿಸುವಲ್ಲಿ...

ഇറാനെതിരായ നാവിക ഉപരോധം ആഗോളതലത്തിലേക്ക് വ്യാപിപ്പിക്കാന്‍ അമേരിക്ക; ഹോര്‍മുസ് കടലിടുക്കില്‍ കര്‍ശന നിയന്ത്രണം

  വാഷിങ്ടണ്‍: ഇറാനെതിരെയുള്ള യുണൈറ്റഡ് സ്റ്റേറ്റ്‌സിന്റെ നാവിക ഉപരോധം ആഗോളതലത്തിലേക്ക് വ്യാപിപ്പിക്കുകയാണെന്ന്...