24
June, 2026

A News 365Times Venture

24
Wednesday
June, 2026

A News 365Times Venture

MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..

Date:

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చి పాత రోజులను గుర్తుచేసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఏకంగా 99 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి, తమ ఓటముల పరంపరకు తెరదించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుండి పైకి ఎగబాకడమే కాకుండా, ఈ సీజన్‌లో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన జట్టుగా నిలిచింది. తిలక్ వర్మ అజేయ శతకానికి తోడు, అశ్విని కుమార్ పదునైన బౌలింగ్ ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాయి.

మొదట బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభం అంత ఆశాజనకంగా ఏమీ లేదు. స్టార్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ కేవలం 13 పరుగులకే నిష్క్రమించగా, సూర్యకుమార్ యాదవ్ కూడా 15 పరుగులకే పెవిలియన్ చేరారు. అయితే యువ సంచలనం తిలక్ వర్మ మైదానంలోకి అడుగుపెట్టాక ఆట స్వరూపమే మారిపోయింది. నమన్ ధీర్ (45)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన తిలక్, ఆ తర్వాత గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గాయమైనప్పటికీ పట్టుదల వదలకుండా కేవలం 45 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి శతకాన్ని పూర్తి చేశాడు. తిలక్ వీరవిహారంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరును సాధించింది.

200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ముంబై బౌలర్లు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ మొదటి బంతికే జస్‌ప్రీత్ బుమ్రా సాయి సుదర్శన్‌ను అవుట్ చేసి గుజరాత్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఆ వెంటనే కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రమాదకరమైన జోస్ బట్లర్‌ను అవుట్ చేసి ముంబైకి తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. ఈ క్రమంలో బౌలింగ్‌కు వచ్చిన అశ్విని కుమార్ అద్భుతమైన స్పెల్‌తో మెరిశాడు. కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి గుజరాత్ వెన్నువిరిచాడు. గుజరాత్ బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ (26) మినహా ఎవరూ కనీస పోరాటం చేయలేకపోయారు. చివరలో గజన్ ఫర్ వరుస బంతుల్లో వికెట్లు తీయడంతో గుజరాత్ ఇన్నింగ్స్ 15.5 ఓవర్లలో 100 పరుగుల వద్దే ముగిసింది. అటు తిలక్ వర్మ సెంచరీ, ఇటు బౌలర్ల సమిష్టి కృషితో ముంబై ఈ సీజన్‌లో అపురూపమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ബി.ജെ.പി വെട്ടില്‍; തിരുവനന്തപുരം കോര്‍പ്പറേഷനിലെ കൗണ്‍സിലസര്‍മാരുടെ സത്യപ്രതിജ്ഞ റദ്ദാക്കി ഹൈക്കോടതി

തിരുവനന്തപുരം: തിരുവനന്തപുരം നഗരസഭയിലെ ബി.ജെ.പി കൗണ്‍സിലര്‍മാര്‍ക്ക് തിരിച്ചടി. ബി.ജെ.പി കൗണ്‍സിലര്‍മാരുടെ സത്യപ്രതിജ്ഞ...

ಮೈಸೂರು: ‘ಮನೆ‌ ಮನೆ ಹನುಮ’ ಕಾರ್ಯಕ್ರಮ ಚಾಲನೆ

ಮೈಸೂರು,ಜೂನ್,24,2026 (www.justkannada.in): ಮೈಸೂರಿನ ಶ್ರೀರಾಂಪುರದ ಮೂಕಾಂಬಿಕಾ ಸಮೃದ್ಧಿ ಬಡಾವಣೆಯ ಸರಸ್ವತಿ...