14
May, 2026

A News 365Times Venture

14
Thursday
May, 2026

A News 365Times Venture

Iran-US Talks: చిత్తశుద్ధి లేదు.. అమెరికాతో చర్చలు ఉండబోవన్న ఇరాన్

Date:

ఇరాన్‌తో రెండో విడత చర్చల కోసం జేడీ వాన్స్ బృందం సోమవారం ఇస్లామాబాద్‌ చేరుకుంటుందని ట్రంప్ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా పాకిస్థాన్ కూడా ఇస్లామాబాద్‌లో తీవ్ర ఆంక్షలు విధించింది. రాజధానిలోకి ఎవరూ రాకుండా అన్ని రహదారులు మూసేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ నిరాకరించింది. అమెరికాకు చిత్తుశుద్ధి లేదని.. సముద్ర దొంగ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమెరికాతో చర్చలకు భవిష్యత్ ప్రణాళికలు ఏమీ లేవని తేల్చి చెప్పింది.

ఇది కూడా చదవండి: Flight: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు.. వీడియో వైరల్

ఇరాన్‌పై నిందలు వేసి ఆట ఆడుతోందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆరోపించారు. వివాదాన్ని పరిష్కరించడంలో అమెరికాకు చిత్తశుద్ధి లేదని నిందించారు. ‘‘వారు సానుకూల పాత్ర పోషించడానికి బదులుగా ఈ ఆట కొనసాగుతోంది. అమెరికన్లు నిజం చెబుతారని మనం ఆశించలేము. వారు ఎల్లప్పుడూ మమ్మల్ని నిందిస్తూనే ఉంటారు.’’ అని ప్రతినిధి అన్నారు.

యురేనియం శుద్ధి అప్పగించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని.. ఒప్పందం జరిగితే సంతకాలు చేసేందుకు వ్యక్తిగతంగా పాకిస్థాన్‌కు కూడా వెళ్తానని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ మంచి పని చేస్తోందంటూ ప్రశంసలు కురిపించారు. ఒకవేళ ఇరాన్ ఒప్పందం చేసుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. విద్యుత్ ప్లాంట్లు ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే గత రాత్రి చైనా నుంచి ఇరాన్‌కు వస్తున్న సరుకు రవాణా నౌకపై అమెరికా దళాలు దాడి చేశాయి. దీంతో మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమెరికా దాడికి ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికా నౌకలపై డ్రోన్ దాడులు చేసింది. దీంతో మధ్యప్రాచ్యంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొనేటట్టు కనిపిస్తోంది.

తాజా పరిణామాలను చూస్తుంటే రేపు ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన శాంతి చర్చలు లేనట్లుగానే కనిపిస్తోంది. అమెరికా బృందం ఇప్పటికే బయల్దేరగా.. ఇరాన్ బృందం మాత్రం ఇంకా బయల్దేరలేదు. దీంతో రెండు విడత చర్చలు లేనట్లుగా అర్థమవుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കേരളം കാത്തിരുന്നത് പത്ത് ദിവസം; ഒടുവില്‍ മുഖ്യമന്ത്രിയെ ഇന്ന് പ്രഖ്യാപിക്കാനൊരുങ്ങി കോണ്‍ഗ്രസ്

തിരുവനന്തപുരം: ദിവസങ്ങള്‍ നീണ്ട അനിശ്ചിതത്വങ്ങള്‍ക്കൊടുവില്‍ കേരളത്തിന്റെ പുതിയ മുഖ്യമന്ത്രി ആരെന്ന് ഇന്ന്...

ಕಾನೂನು ಸುವ್ಯವಸ್ಥೆ ಸಂಪೂರ್ಣ ಕುಸಿತ; ರಕ್ಷಕರೇ ಭಕ್ಷಕರಾದರೇ ಸಿದ್ದರಾಮಯ್ಯನವರೇ? ಆರ್.ಅಶೋಕ್ ಕಿಡಿ

ಬೆಂಗಳೂರು,ಮೇ,13,2026 (www.justkannada.in): ರಾಜ್ಯದಲ್ಲಿ ಕಾನೂನು ಸುವ್ಯವಸ್ಥೆ ಸಂಪೂರ್ಣ ಕುಸಿದಿದೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ...