Shreyas Iyer: ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టును సక్సెస్‌పుల్‌గా నడిపిస్తున్న సారథిగా శ్రేయస్ అయ్యర్‌కు మంచి పేరు ఉంది. అయితే ఇటీవల కాలంలో ఆయనకు ఒక నిక్ నేమ్ తెగ హల్‌చల్ చేస్తుంది. ఇంతకీ ఆ పేరు ఏంటో తెలుసా.. ‘సర్పంచ్ సాబ్’. తాజాగా ఈ వెరైటీ నిక్ నేమ్ వెనుక ఉన్న కథను పంజాబ్ కెప్టెన్ రివీల్ చేశారు. పంజాబ్ జట్టులో చేరిన తర్వాత సహచర ఆటగాళ్లు తనను ‘సర్పంచ్ సాబ్’ అని పిలవడం ప్రారంభించారని, మొదట్లో తనకు దీని అర్థం తెలియక ఆశ్చర్యపోయానని శ్రేయస్ తెలిపారు.
READ ALSO: Jasprit Bumrah: పిచ్చినవ్వు.. భూమిని తన్నడం.. బుమ్రాను ఇలా ఎప్పుడూ చూడలేదు బ్రో..(వీడియో)
సర్పంచ్ అంటే ‘ఊరికి పెద్ద’
తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రేయస్ మాట్లాడుతూ.. “మొదట్లో నన్ను అందరూ సర్పంచ్ సాబ్ అని పిలుస్తుంటే ఎందుకు అలా పిలుస్తున్నారో అర్థం కాలేదు. వెంటనే నా సహచరులను అడిగి తెలుసుకున్నాను. ఒక కుటుంబానికి, ఒక సమూహానికి లేదా ఒక గ్రామానికి పెద్దగా ఉండి, అందరినీ ముందుండి నడిపించే వ్యక్తిని గౌరవంగా ‘సర్పంచ్’ అంటారని వారు నాకు వివరించారు. ఆ అర్థం తెలిశాక నాకు ఆ పేరు బాగా నచ్చేసింది. ఇప్పుడు ఆ ట్యాగ్ నా ప్రయాణంలో ఒక భాగమైపోయింది” అని చెప్పుకొచ్చారు.
సారథిగా సక్సెస్.. పాయింట్ల పట్టికలో టాప్!
గతేడాది పంజాబ్ కింగ్స్ పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్, జట్టును అద్భుత రీతిలో ఫైనల్ వరకు తీసుకెళ్లారు. కేవలం కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లోనూ దుమ్మురేపుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం. పంజాబీ సంప్రదాయంలో సర్పంచ్ అంటే గౌరవప్రదమైన హోదా కావడంతో, అభిమానులు కూడా శ్రేయస్‌ను సోషల్ మీడియాలో ‘సర్పంచ్ సాబ్’ అంటూ ట్రెండ్ చేస్తున్నారు.
READ ALSO: RCB vs DC: కోహ్లీ మెరుపులు కాసేపే.. భారీ స్కోరు మిస్సైన బెంగళూరు! ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?





