18
May, 2026

A News 365Times Venture

18
Monday
May, 2026

A News 365Times Venture

Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

Date:

పిల్లలే రేపటి పౌరులు, వారి ఆరోగ్యంపై పెట్టే శ్రద్ధ వారు ఆరోగ్యవంతమైన భవిష్యత్తు వైపు వేసే మొదటి అడుగు. సాధారణంగా పిల్లలకు జ్వరం లేదా దగ్గు వచ్చినప్పుడు మాత్రమే మనం ఆసుపత్రికి తీసుకెళ్తుంటాం. కానీ, ఆధునిక కాలంలో వస్తున్న రకరకాల అనారోగ్య సమస్యలు, పోషకాహార లోపాలు బయటకు కనిపించకుండానే పిల్లల ఎదుగుదలను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మారడం వల్ల చిన్న వయస్సులోనే హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత వంటి సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి.

GT vs KKR: విక్టరీ కోసం కోల్‌కతా పోరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?

ఈ నేపథ్యంలో పిల్లల వయస్సును బట్టి వారికి ఎటువంటి ఆరోగ్య పరీక్షలు అవసరం, ఏయే లక్షణాలు కనిపించినప్పుడు మనం అప్రమత్తమవ్వాలి అనే అంశాలపై అవగాహన పెంచుకోవడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల శారీరక , మానసిక వికాసం సక్రమంగా సాగాలంటే కేవలం మంచి ఆహారం మాత్రమే సరిపోదు, ఎప్పటికప్పుడు వైద్య నిపుణుల సలహాతో అవసరమైన పరీక్షలు చేయించడం కూడా అంతే ముఖ్యం. ఆ వివరాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్‌ఫ్లిక్స్‌లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం

తప్పనిసరిగా చేయించాల్సిన పరీక్షలు:
రక్తహీనత పరీక్ష (Anemia Test): పిల్లల్లో ఐరన్ లోపం వల్ల రక్తహీనత రావచ్చు. దీనివల్ల వారు త్వరగా అలసిపోవడం, చదువులో వెనుకబడటం జరుగుతుంది. అందుకే హిమోగ్లోబిన్ స్థాయిలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి.

థైరాయిడ్ పరీక్ష (Thyroid Function Test): పిల్లల ఎదుగుదల నిదానంగా ఉన్నా లేదా బరువులో అకస్మాత్తుగా మార్పులు వచ్చినా థైరాయిడ్ పరీక్ష చేయించడం ముఖ్యం. ఇది వారి శారీరక , మానసిక వికాసంపై ప్రభావం చూపుతుంది.

కాల్షియం , విటమిన్ డి: ఎముకల బలం , పళ్ల ఆరోగ్యం కోసం శరీరంలో కాల్షియం స్థాయిలు సరిగ్గా ఉన్నాయో లేదో చూడాలి.

గ్రోత్ హార్మొన్ పరీక్ష: ఒకవేళ మీ మగువ ఎత్తు , బరువు తోటి పిల్లల కంటే చాలా తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే, గ్రోత్ హార్మొన్ లోపం ఉందేమో పరీక్షించాల్సి ఉంటుంది.

షుగర్ , కొలెస్ట్రాల్: జంక్ ఫుడ్ సంస్కృతి పెరిగిన నేపథ్యంలో, ఊబకాయం (Obesity) ఉన్న పిల్లలకు ముందస్తుగా ఈ పరీక్షలు చేయించడం మంచిది.

ఎప్పుడు చేయించాలి?
పిల్లల ఎదుగుదలలో ఏవైనా అసహజ మార్పులు గమనించినప్పుడు లేదా సంవత్సరానికి ఒకసారి సాధారణ ‘వెల్నెస్ చెకప్’లో భాగంగా ఈ పరీక్షలు చేయించడం వల్ల భవిష్యత్తులో వచ్చే పెద్ద సమస్యలను ముందే నివారించవచ్చు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഒ.ബി.സി വിഭാഗങ്ങൾക്കുള്ള സംവരണം നിർത്തലാക്കി ബംഗാളിലെ ബി.ജെ.പി സർക്കാർ

കൊൽക്കത്ത: ഒ.ബി.സി വിഭാഗക്കാർക്കുള്ള സംവരണം നിർത്തലാക്കി ബംഗാളിൽ പുതുതായി അധികാരത്തിലേറിയ സുവേന്ദു...

ராகுல் காந்தி, பினராயி விஜயன் முன்னிலையில் வி.டி.சதீசன் கேரள முதல்வராக பதவியேற்பு Photo Album

ராகுல் காந்தி, பிரியங்கா காந்தி, பினராயி விஜயன் உள்ளிட்ட முக்கிய தலைவர்கள்...

Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!

ఆస్తుల కోసం రక్త సంబంధీకులే పగవాళ్లుగా మారుతున్నారు. సొంత వారిని హత్య...