25
August, 2026

A News 365Times Venture

25
Tuesday
August, 2026

A News 365Times Venture

స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

Date:

OPPO F33: ఒప్పో ఇండియా నుండి కొత్త F33 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో ఏప్రిల్ 15న విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. గత ఏడాది వచ్చిన F31 సిరీస్‌ కు సక్సెసర్‌గా రాబోతున్న ఈ ఫోన్‌లో ముఖ్యంగా కెమెరా సామర్థ్యాలు, డిజైన్‌లో కీలక మార్పులు తీసుకువచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రత్యేకంగా వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా, కొత్త యూనీబాడీ తయారీ విధానం ఈ సిరీస్‌ కు ప్రత్యేకంగా నిలవనున్నాయి.

Ground Report: అభివృద్ధికి చిరునామాగా మారుతున్నా వరంగల్ జిల్లా కర్రెగుట్టలు

F33 సిరీస్‌లో ప్రధానంగా ఫ్రంట్ కెమెరాపైనే ఫోకస్ పెట్టారు. ఈ ఫోన్‌లో 50MP అల్ట్రా వైడ్ ఫ్రంట్ కెమెరా ఇవ్వబడింది. 100° ఫీల్డ్ ఆఫ్ వ్యూ (FOV) కలిగిన ఈ కెమెరా ఒక మీటర్ దూరంలో సాధారణ కెమెరాలతో పోలిస్తే సుమారు 30% ఎక్కువ ప్రాంతాన్ని క్యాప్చర్ చేయగలదు. దీంతో గ్రూప్ సెల్ఫీలలో ఎవ్వరూ ఫ్రేమ్ నుంచి బయట పడే అవకాశం తగ్గుతుంది. రియర్ సైడ్‌లో కూడా 50MP మెయిన్ కెమెరా (OV50D40 సెన్సార్) తో పాటు 2MP డెప్త్ సెన్సార్ ఇవ్వబడింది. ఇది పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీకి సహాయపడుతుంది.

ఈ ఫోన్‌లో పలు AI ఆధారిత ఫీచర్లు కూడా ఉన్నాయి. F33 సిరీస్‌లో పూర్తిగా కొత్త డిజైన్‌ను అందిస్తున్నారు. “Starry Sea Lens Module” అనే కొత్త కెమెరా మాడ్యూల్ డిజైన్‌లో రెండు కెమెరాలు వరుసగా అమర్చబడి, రింగ్ ఫ్లాష్ ఇవ్వబడింది. ఈ ఫోన్‌లో 6.57 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే ఉండి.. ప్రత్యేకంగా “One-Piece Cold Carving” టెక్నాలజీతో తయారు చేయబడిన బ్యాక్ ప్యానెల్ ఈ మొబైల్ హైలైట్.

HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

ఈ కొత్త మొబైల్ లో 1.5mm మందం ఉన్న పాలిమర్ షీట్ ఉపయోగించడం వల్ల డ్రాప్ రిజిస్టెన్స్ మెరుగుపడుతుంది. 40,000 RPM CNC మెషిన్‌తో కట్ చేసిన కెమెరా ప్లాట్‌ఫామ్ గ్లాసీ ఫినిష్ ఇస్తుంది. మిగితా భాగం మ్యాట్ టెక్స్చర్‌తో ప్రీమియం లుక్ ఇస్తుంది. F33 సిరీస్ మిస్ట్య్ ఫారెస్ట్, స్టార్రి బ్లూ, ప్యాషన్ రెడ్ అనే మూడు ప్రత్యేక రంగుల్లో అందుబాటులో ఉంటుంది. OPPO F33 సిరీస్‌లో కెమెరా ఇన్నోవేషన్, AI ఫీచర్లు, ప్రీమియం డిజైన్‌ను మిడ్ రేంజ్ సెగ్మెంట్లో తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అధికారిక లాంచ్ తర్వాత పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు తెలియనున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

KPSC ಹಗರಣ ತನಿಖೆ ಸಿಬಿಐಗೆ ವಹಿಸುವಂತೆ ಆಗ್ರಹ: ಸಿಎಂ ಗೃಹ ಕಚೇರಿ ಮುಂದೆ ABVP ಪ್ರತಿಭಟನೆ..

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,25,2026 (www.justkannada.in): ಕೆಪಿಎಸ್ ಸಿಯಲ್ಲಿ ನಡೆದಿದೆ ಎನ್ನಲಾದ ಪಶುವೈದ್ಯಾಧಿಕಾರಿ ನೇಮಕಾತಿ...

ബി.ജെ.പി വാഗ്ദാനം ലംഘിച്ചു; അന്നപൂർണ പദ്ധതിയിൽനിന്ന് സ്ത്രീകളെ ഒഴിവാക്കുന്നതായി മമത ബാനർജി

കൊൽക്കത്ത: പശ്ചിമ ബംഗാളിലെ എല്ലാ സ്ത്രീകൾക്കും അന്നപൂർണ യോജനയിലൂടെ സാമ്പത്തിക സഹായം...

தூத்துக்குடி: இடிக்கப்பட்ட ரயிலடி விநாயகர் கோயில் – பின்னணியில் கிறிஸ்தவ மதபோதகரா? | முழுப் பின்னணி

தூத்துக்குடி மாவட்டம் குரும்பூரில் ’இயேசு விடுவிக்கிறார் ஊழியங்கள் சபை’யை கிறிஸ்தவ மதபோதகர்...

AP High Court: విశాఖ డేటా సెంటర్‌పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు

AP High Court: విశాఖ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటు వ్యవహారంలో...