8
April, 2026

A News 365Times Venture

8
Wednesday
April, 2026

A News 365Times Venture

Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్‌ నిజం కాదు.. APSDMA క్లారిటీ..

Date:

Andhra Pradesh: 28 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్త మ్యాప్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) విడుదల చేసిందని.. ఇందులో అమరావతిని ఏపీ క్యాపిటల్‌గా పేర్కొంది అంటూ సోషల్‌ మీడియాలో ఓ మ్యాప్‌ వైరల్‌గా మారింది.. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 జిల్లాలతో కూడిన కొత్త మ్యాప్ విడుదలైనట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు 06-04-2026న విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో సోషల్ మీడియా మరియు కొన్ని మీడియా వేదికల్లో ప్రచారంలో ఉన్న సమాచారం అసత్యమని పేర్కొంది.

Read Also: Partner Choice: భర్తను వదిలి ఇష్టపడే వ్యక్తితో జీవించే హక్కు గెలిచింది.. 19 ఏళ్ల భార్యకు 40 ఏళ్ల భర్త కేసులో హైకోర్టు తీర్పు

APSDMA ప్రకారం, తమ సంస్థ తరఫున ఎటువంటి కొత్త మ్యాప్‌ను విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న 28 జిల్లాల మ్యాప్ పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని తెలిపింది. APSDMA పేరు, లోగోను ఉపయోగించి షేర్ చేస్తున్న ఆ మ్యాప్‌కు ఎలాంటి ప్రామాణికత లేదని పేర్కొంది. ఇలాంటి ధృవీకరించని సమాచారాన్ని ప్రజలు, మీడియా సంస్థలు నమ్మకూడదని, దానిని షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని APSDMA సూచించింది. అధికారికంగా సంస్థ విడుదల చేసే సమాచారం మరియు ప్రకటనలనే పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ఈ ఘటనతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಇರಾನ್‌ ಗೆ ಶಸ್ತ್ರಾಸ್ತ್ರ ಪೂರೈಸುವ ದೇಶಗಳಿಗೆ ಡೊನಾಲ್ಡ್ ಟ್ರಂಪ್ ಶಾಕ್

ವಾಷಿಂಗ್ಟನ್,ಏಪ್ರಿಲ್,8,2026 (www.justkannada.in):  ಇರಾನ್ ಮತ್ತು ಅಮೆರಿಕ ನಡುವೆ  ಎರಡು ವಾರಗಳ...

പാലക്കാട് വോട്ടിന് നോട്ട്: കര്‍ശന നടപടിയെടുക്കാന്‍ പൊലീസിന് നിര്‍ദേശം നല്‍കിയെന്ന് മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് ഓഫീസര്‍

പാലക്കാട്: പാലക്കാട് മണ്ഡലത്തില്‍ ബി.ജെ.പി സ്ഥാനാര്‍ത്ഥി ശാേഭ സുരേന്ദ്രന്‍ വോട്ടിന് പണം...

'நீ போ மோனே விஜயா' … 'டேஷ் மோனே ரேவந்தா' – பினராயி விஜயன் Vs ரேவந்த் ரெட்டி; முதல்வர்கள் மோதல்!

கேரள மாநிலம் ,திருவனந்தபுரம் மாவட்டம், நேமம் தொகுதியின் காங்கிரஸ் வேட்பாளர் கே.எஸ்.சபரிநாதனுக்கு...