11
May, 2026

A News 365Times Venture

11
Monday
May, 2026

A News 365Times Venture

Smriti Mandhana Wedding: చివరి నిమిషంలో స్మృతి మందాన-పలాష్ పెళ్లి క్యాన్సిల్.. కథలో కొత్త ట్విస్ట్.!

Date:

Smriti Mandhana Wedding: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె ఆటతీరు కారణంగా కాదు.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పరిణామాల వల్ల. గత ఏడాది సంగీత దర్శకుడు పలస్ ముచ్చల్ తో ఆమె పెళ్లి చివరి నిమిషంలో రద్దవడం పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. 2025 నవంబర్ 23న మహారాష్ట్రలోని సంగ్లీ పట్టణంలో వీరిద్దరి వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత కూడా పెళ్లిని రద్దు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొదటగా మందాన తండ్రి ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చిందని కారణం చెబుతూ పెళ్లి వాయిదా వేసినట్లు ప్రకటించారు.

Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

అయితే సోషల్ మీడియాలో మాత్రం పలు వదంతులు చక్కర్లు కొట్టాయి. పలాష్ ముచ్ఛల్ మందానను మోసం చేశాడనే ఆరోపణలు వినిపించాయి. ఈ కారణంగానే మందాన ఈ పెళ్లిని ధైర్యంగా రద్దు చేసుకుందని ప్రచారం జరిగింది. చివరికి ఇరు కుటుంబాలు తమ సంబంధం ముగిసిందని అధికారికంగా ప్రకటించడంతో ఈ కథకు ముగింపు పడింది. ఇక తాజాగా మరో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. మంధాన తండ్రి శ్రీనివాస్, పలాష్ సోదరి పలక్ ముచ్చల్ కుటుంబంతో కలిసి స్నేహపూర్వకంగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో పలక్, మందాన తండ్రి పాదాలకు నమస్కారం చేయడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. దీంతో మళ్లీ ఇరు కుటుంబాలు కలిసే అవకాశముందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

Israel Attacks: 10 నిమిషాల్లోనే అంతా బూడిద.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఇజ్రాయెల్..

కానీ తాజా సమాచారం ప్రకారం, మందాన-పలాష్ మళ్లీ కలిసే అవకాశం లేదని స్పష్టమైంది. ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు సాగిపోయారని, తిరిగి సంబంధం కొనసాగించే పరిస్థితి లేదని వెల్లడైంది. కుటుంబాల మధ్య ఈ కలయిక కేవలం పరస్పర గౌరవంతో జరిగిన సాధారణ సమావేశమేనని సమాచారం. పలాష్ ముచ్ఛల్ విషయానికి వస్తే.. అతను బాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందారు. ‘డిష్కియావూన్’, ‘భూత్‌నాథ్ రిటర్న్స్’ వంటి సినిమాలకు సంగీతం అందించారు. తర్వాత ‘అర్ధ్’ సినిమా ద్వారా దర్శకుడిగా కూడా మారారు. అలాగే ఆయన సోదరి పలక్ ముచ్ఛల్, బావ మిథూన్ కూడా ప్రముఖ గాయకులు.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഹിസ്ബുള്ളയുടെ ഫൈബർ-ഓപ്റ്റിക് ഡ്രോണുകൾ പ്രതിരോധിക്കാൻ കഴിയാതെ ഇസ്രഈൽ സൈന്യം വലയുന്നു; റിപ്പോർട്ട്

ബെയ്റൂട്ട്: തെക്കൻ ലെബനനിൽ ഹിസ്ബുള്ള ഉപയോഗിക്കുന്ന അത്യാധുനികമായ ഫൈബർ-ഓപ്റ്റിക് ഡ്രോണുകളെ പ്രതിരോധിക്കാൻ...

PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..

PM Modi: తొలిసారిగా పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, బెంగాల్‌లో...

ഇന്ധന ഉപയോഗം കുറയ്ക്കണം, വർക്ക് ഫ്രം ഹോമിന് മുൻഗണന നൽകണം; ആഗോള പ്രതിസന്ധിക്കിടയിൽ ജനങ്ങളോട് മോദി

ഹൈദരാബാദ്: പശ്ചിമേഷ്യൻ യുദ്ധത്തെത്തുടർന്നുണ്ടായ ആഗോള ഇന്ധന പ്രതിസന്ധിയുടെ പശ്ചാത്തലത്തിൽ, വിഭവങ്ങൾ മിതമായി...