26
April, 2026

A News 365Times Venture

26
Sunday
April, 2026

A News 365Times Venture

Man Climbs Electricity Tower: నీ ప్రేమ చల్లగుండా.. భార్య తనవెంట రాననడంతో ఏకంగా?

Date:

Man Climbs Electricity Tower: ఉత్తరప్రదేశ్ రాష్టంలోని సోనభద్ర జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. భార్యను తీసుకెళ్లేందుకు అత్తింటికి వెళ్లిన యువకుడు, అత్తమామలు పంపించేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురై విద్యుత్ టవర్‌పైకి ఎక్కి హంగామా సృష్టించాడు. దీనితో ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

Bill Gates Flight Delay: బిల్‌గేట్స్‌ ఫ్లైట్ ల్యాండింగ్‌లో ఇబ్బందులు.. విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతున్న విమానం!

ఈ ఘటన రాబర్ట్స్‌ గంజ్ కోత్వాలి పరిధిలోని ఛప్కా ప్రాంతంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. కర్మా థానా ప్రాంతానికి చెందిన విశ్రామ్ అనే యువకుడు తన భార్యను తీసుకెళ్లేందుకు అత్తింటికి వచ్చాడు. అయితే కుటుంబ విభేదాల కారణంగా భార్యను పంపించేందుకు అత్తింటి వారు నిరాకరించారు. దీంతో ఆగ్రహం చెందిన యువకుడు సంచలన నిర్ణయం తీసుకుని సమీపంలోని విద్యుత్ టవర్‌పైకి ఎక్కాడు.

Mega 158 : కృతికాదు అనశ్వర్ కాదు.. బాబీ సినిమాలో మెగా డాటర్ గా ఎవరంటే

యువకుడు టవర్‌పైకి ఎక్కిన విషయం తెలిసిన వెంటనే స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు గంటలపాటు ప్రయత్నించి యువకుడిని శాంతింపజేసి సురక్షితంగా కిందికి దించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అనంతరం యువకుడిని అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ചൂടിനിന്നും ശമനമില്ല; ആശ്വാസമായി നാളെ വേനല്‍ മഴ

തിരുവനന്തപുരം: സംസ്ഥാനത്ത് ഇന്നും അത്യുഷ്ണ മുന്നറിയിപ്പ്. ഇടുക്കി, വയനാട് ഒഴികെയുളള ജില്ലകളില്‍...

Ranveer Singh: ‘కాంతార’ వివాదం.. రణవీర్ సింగ్‌కు కర్ణాటక హైకోర్టు షాక్..

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ ఎదుర్కొంటున్న ‘కాంతార’ మిమిక్రీ వివాదంలో...

ಅಲ್ಪಸಂಖ್ಯಾತರ ಓಲೈಕೆ, ಮತ ಬ್ಯಾಂಕ್ ಗಾಗಿ ಕಾಂಗ್ರೆಸ್ ನಿಂದ ಹಿಂದೂಗಳಿಗೆ ಅಪಮಾನ- ಕೇಂದ್ರ ಸಚಿವೆ ಶೋಭಾ ಕರಂಧ್ಲಾಜೆ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,25,2026 (www.justkannada.in): ಸಿಇಟಿ ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ಜನಿವಾರ ತೆಗೆಸಿದ ವಿಚಾರಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ...