17
February, 2026

A News 365Times Venture

17
Tuesday
February, 2026

A News 365Times Venture

Tollywood : ఫేడవుటౌతున్న దర్శకులకు ఛాన్సులిస్తున్న హీరోలు

Date:

ఒక్క హిట్.. దర్శకుల్ని టాప్ ప్లేస్‌లో కూర్చొబెడుతుందో లేదో కానీ, ఫ్లాప్ మాత్రం వారికి నెక్ట్స్ సినిమా రాకుండా చేస్తుంది. సక్సెస్ లేని డైరెక్టర్స్‌కు ఆఫర్స్ ఇచ్చేందుకు వెనుకాడుతుంటారు హీరో అండ్ ప్రొడ్యూసర్స్. అలా ఫేడవుటౌతోన్న టాలీవుడ్ దర్శలకు మరో ఛాన్స్ ఇస్తున్నారు మన హీరోలు. వారిలో సీనియర్ మోస్ట్ శ్రీను వైట్ల ఒకరు. దూకుడు తర్వాత ఆ రేంజ్ దూకుడు ప్రదర్శించలేకపోయిన శ్రీను వైట్లతో నెక్ట్స్ మూవీని షురూ చేశాడు శర్వానంద్. 2027 సంక్రాంతికి ఈ మూవీ వస్తుందని నారీ నారీ నడుము మురారీ సక్సెస్ ఈవెంట్లో లీక్ చేశాడు శర్వా. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Also Read : OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన శివకార్తికేయన్ లేటెస్ట్ రిలీజ్ పరాశక్తి

2021లో వచ్చిన సీటీమార్ తర్వాత మెగాఫోన్‌కు దూరమైన సంపత్ నందికి ఛాన్స్ ఇచ్చాడు శర్వా. ఈ ఇద్దరి కాంబోలో భోగి అనే మూవీ తెరకెక్కుబోతుంది. శర్వా38గా వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ అండ్ డింపుల్ హయాతి హీరోయిన్స్. అఖిల్‌కు ఏజెంట్‌తో భారీ డిజాస్టర్ ఇచ్చిన సురేందర్ రెడ్డికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఫరిచ్చాడు. ఉగాదికి ఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ కాబోతుందన్నది లెటెస్ట్ బజ్. నాని, విజయ్ దేవరకొండతో సినిమా వర్కౌట్ కాకపోవడంతో చాలా గ్యాప్ తీసుకున్న శివ నిర్వాణకు రవితేజ ఆఫర్ చేయడం.. ప్రాజెక్ట్ పట్టాలెక్కడం చకా చకా జరిగిపోయాయి. ఈ ఇద్దరి కొలబరేషన్‌లో ఇరుముడి మూవీ రూపుదిద్దుకుంటోంది. ఇక నెక్ట్స్ ద ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తర్వాత పత్తా లేకుండా పోయిన పరుశురామ్ కూడా ఓ స్టోరీని ప్రిపేర్ చేశాడని సమాచారం. సూర్యకు కథ చెప్పాడట. ఆల్ గుడ్ అనుకుంటే.. దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కించే ఛాన్స్ ఉంది. మరీ పరుశురామ్‌కు కోలీవుడ్ స్టార్ హీరో ఓకే చెబుతాడో లేదో లెట్స్ వెయిట్..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಡೂಪ್ಲಿನ್ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ವರ್ತಕರನ್ನು ಖಾಲಿ ಮಾಡಿಸಿ ಆಸ್ತಿ ವಶಕ್ಕೆ ಪಡೆಯಿರಿ: MDA ಪರ ಹೈಕೋರ್ಟ್ ತೀರ್ಪು

ಮೈಸೂರು,ಫೆಬ್ರವರಿ,17,2026 (www.justkannda.in): ಮೈಸೂರಿನ ಹೃದಯಭಾಗದಲ್ಲಿರುವ “ಡೂಪ್ಲಿನ್ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್”  ನ ವರ್ತಕರಿಗೆ...

സര്‍ക്കാരിനേറ്റ വന്‍ തിരിച്ചടി; നവകേരള സര്‍വേ ഹൈക്കോടതി റദ്ദാക്കിയതില്‍ കെ.എസ്.യു

തിരുവനന്തപുരം: നവകേരള സര്‍വേ റദ്ദാക്കിയ ഹൈക്കോടതി വിധിയില്‍ പ്രതികരിച്ച് കോണ്‍ഗ്രസിന്റെ വിദ്യാര്‍ത്ഥി...

அரசு அலுவலர்கள் நலன் முதல் புதிய டைடல் பூங்காக்கள் வரை! – தமிழ்நாடு பட்ஜெட் முழுத் தொகுப்பு!

`அரசுப்பணி புரிபவர்கள் விபத்தில் இறந்தால் ரூ.1 கோடி' - தங்கம் தென்னரசு...

AR Rahman vs Anirudh : ఫిబ్రవరి నెలాఖరున రెహమాన్, అనిరుధ్ మధ్య మ్యూజికల్ వార్!

సంగీత ప్రపంచంలో ఇద్దరు ధృవతారలు ఒకే సమయంలో తమ పాటలతో పలకరించబోతుంటే,...