25
September, 2026

A News 365Times Venture

25
Friday
September, 2026

A News 365Times Venture

2025 Nobel Prize Literature: క్రాస్జ్నా హోర్కెకు సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్..

Date:

2025 Nobel Prize Literature: నోబెల్‌ పురస్కారాల విజేతల పేర్లను కమిటీ ప్రకటిస్తుంది. తాజాగా గురువారం సాహిత్యంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న విజేత పేరును నోబెల్ కమిటి వెల్లడించింది. హంగేరియన్‌ రచయిత క్రాస్జ్నా హోర్కెకి సాహిత్యంలో నోబెల్‌ అవార్డ్ వరించింది. క్రాస్జ్నా హోర్కె మధ్య యూరోపియన్ సంప్రదాయంలో ఒక గొప్ప ఇతిహాస రచయితగా ప్రత్యేకతను సంతరించుకున్నారు.

READ ALSO: Rinku Singh: రింకు సింగ్‌కు డి-కంపెనీ బెదిరింపులు.. 10 కోట్లు డిమాండ్!

1954లో ఆగ్నేయ హంగేరీలోని గ్యులా అనే చిన్న పట్టణంలో క్రాస్జ్నాహోర్కై జన్మించారు. ఆయన రొమేనియన్ సరిహద్దుకు సమీపంలో జన్మించారు. ఆయన మొట్టమొదటి నవల 1985లో ప్రచురించారు. దాని పేరు ‘సాటంటాంగో’. ఈ రచన హంగేరీలో సాహిత్య సంచలనం సృష్టించింది. తర్వాత ఆయన రాసిన ‘హెర్ష్ట్ 07769’ జర్మన్ దేశంలోని సామాజిక అశాంతిని చిత్రీకరించింది. ఈ రచనను గొప్ప సమకాలీన జర్మన్ నవలగా పాఠకులు అభివర్ణించారు. అపోకలిప్టిక్ భయానక పరిస్థితుల మధ్య, కళ శక్తిని పునరుద్ఘాటించే ఆయన దార్శనిక కృషికి తాజా నోబెల్ బహుమతి ఆయనను వరించింది. ఈ బహుమతిని స్వీడిష్ అకాడమీ ప్రదానం చేస్తుంది. దీని విలువ 11 మిలియన్ కిరీటాలు ($1.2 మిలియన్లు).

గత ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతిని దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ గెలుచుకున్నారు. 2025లో ఇప్పటి వరకు వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాలలో నోబెల్‌లు ప్రకటించారు. తాజాగా ప్రకటించిన సాహిత్యంలో నోబెల్ బహుమతితో ఈ వారంలో ప్రకటించిన నోబెల్ బహుమతులు నాలుగుకు చేరుకున్నాయి.

READ ALSO: Ratan Tata Dreams: రతన్ టాటా నెరవేరని కలల గురించి తెలుసా!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

2500 മുസ്‌ലിം വോട്ടര്‍മാരുടെ പേര് വെട്ടാന്‍ ബി.ജെ.പി എം.എല്‍.എ തെഞ്ഞെടുപ്പ് കമ്മീഷന് കത്തെഴുതിയതായി കോണ്‍ഗ്രസ്

ബെംഗളൂരു: കര്‍ണാടകയിലെ പ്രമുഖ ബി.ജെ.പി എം.എല്‍.എ അഭയ് പാട്ടീല്‍ വോട്ടര്‍പട്ടികയില്‍ നിന്ന്...

"எதற்கெடுத்தாலும் திமுக எங்கள் மீது குற்றம்சுமத்துகிறது!" – அமைச்சர் ரமேஷ் விமர்சனம்

தமிழக இந்து சமய அறநிலையத்துறை அமைச்சர் ரமேஷ், திருச்சியில் செய்தியாளர்களை சந்தித்து...

Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన

టర్కీ బుద్ధి మారలేదు. డీజిల్ కోసం భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. మళ్లీ...

ഗ്യാനേഷ് കുമാറിനെ മോദിയും അമിത് ഷായും സംരക്ഷിക്കുന്നു; ജനാധിപത്യം തകരുന്നത് നോക്കി നില്‍ക്കില്ല: രാഹുല്‍ ഗാന്ധി

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാര്‍ അടിയന്തരമായി രാജിവെക്കണമെന്ന് ലോക്‌സഭാ...