26
June, 2026

A News 365Times Venture

26
Friday
June, 2026

A News 365Times Venture

Virender Sehwag: గత కెప్టెన్స్ కంటే.. సూర్య అతడిని బాగా వాడుతున్నాడు!

Date:

టీమిండియా ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె సేవల్ని గత కెప్టెన్ల కంటే టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బాగా ఉపయోగించుకుంటున్నాడని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. దూబెలోని బౌలర్‌ను సూర్య చక్కగా ఉపయోగించుకోవడం వల్లే దాయాది పాకిస్థాన్‌పై విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తిలు బాగా బౌలింగ్ చేస్తున్నారని వీరూ ప్రశంసించాడు. ఆసియా కప్‌ 2025 సూపర్‌ 4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. దూబె 4 ఓవర్లలో 33 రన్స్ ఇచ్చి రెండు వికెట్స్ పడగొట్టాడు.

Also Read: PAK vs SL: మెరిసిన షాహీన్ అఫ్రిది.. పాకిస్థాన్ ముందు స్వల్ప లక్ష్యం!

మ్యాచ్ అనంతరం వీరేంద్ర సెహ్వాగ్‌ మాట్లాడుతూ… ‘గత కెప్టెన్లు శివమ్‌ దూబె సేవల్ని సమర్థంగా వినియోగించుకోలేదు. సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రం అతడిని మంచి బౌలర్‌గా చూస్తున్నాడు. పిచ్‌ కూడా దూబెకు అనుకూలంగా ఉంది. పిచ్‌లో వేగం లేదు కాబట్టి కట్టర్స్‌, స్లో బాల్స్‌ వేస్తే బ్యాటర్లకు షాట్లు ఆడటం కష్టం. బంతి వేగంగా దూసుకురానప్పుడు బ్యాటర్లు గట్టిగా బాదాల్సి ఉంటుంది. పాక్ బ్యాటర్లు ఇక్కడే పొరపాట్లు చేశారు. దూబె రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. మరో ఎండ్‌ నుంచి వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లు అద్భుతంగా బౌలింగ్‌ వేశారు. 6 ఓవర్లలో పాకిస్థాన్‌ 30 పరుగులు మాత్రమే చేసింది. అప్పుడే మ్యాచ్ భారత్ వైపు తిరిగింది’ అని వీరేంద్ర సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

എസ്.ഐ.ആര്‍ ഒരുവര്‍ഷം പിന്നിട്ടപ്പോള്‍ വോട്ടര്‍ പട്ടികയില്‍ നിന്ന് പുറത്താക്കിയത് ആറ് കോടിയോളം വോട്ടര്‍മാരെ

ന്യൂദല്‍ഹി: രാജ്യത്തെ തീവ്ര വോട്ടര്‍ പട്ടിക പുനപരിശോധന (എസ്.ഐ.ആര്‍) ഒരു വര്‍ഷം...

`கர்நாடக அரசின் பிராக்ஸி அரசா இந்த அரசு?' – ஜனநாயகன் பட தயாரிப்பாளர் நியமனத்திற்கு அதிமுக எதிர்ப்பு

தமிழ்நாடு அரசின் டெல்லி சிறப்புப் பிரதிநிதியாக ஜனநாயகன் திரைப்படத்தின் தயாரிப்பாளரான கே.வெங்கட...

Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!

విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తును ప్రత్యేక...

ಟೌನ್ ಶಿಪ್ ಹೆಸರಿನಲ್ಲಿ ರೈತರಿಂದ ಭೂಮಿ ಕಸಿದುಕೊಳ್ಳುವುದು ತಪ್ಪು- ಪ್ರತಾಪ್ ಸಿಂಹ

ಹಾಸನ,ಜೂನ್,26,2026 (www.justkannada.in):  ಬಿಡದಿಯ ಟೌನ್ ಶಿಪ್ ನಿರ್ಮಾಣ ವಿಚಾರ ಜಟಾಪಟಿ...