25
August, 2026

A News 365Times Venture

25
Tuesday
August, 2026

A News 365Times Venture

CM Chandrababu Kadapa Tour: నేడు కడప జిల్లాకు సీఎం చంద్రబాబు

Date:

CM Chandrababu Kadapa Tour: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు.. పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం.. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు.. ఇక, పలు అభివృద్ధి కార్యక్రమాల్లోని పాల్గొని తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఉదయం 11.45 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి కడప ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. అక్కడ నుండి హెలికాప్టర్ లో జమ్మలమడుగు చేరుకుంటారు.. మధ్యాహ్నం 12.25 గంటలకు గూడెం చెరువు గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.. మధ్యాహ్నం 12.50 నుండి 2 గంటల వరకు గూడెం చెరువులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని మాట్లాడతారు.. అనంతరం జమ్మలమడుగులో పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరుకానున్నారు టీడీపీ అధినేత.. ఇక, సాయంత్రం 4 గంటలకు గండికోటకు చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. గండికోట వ్యూ పాయింట్ సందర్శన.. గండికోట వ్యూ పాయింట్ వద్ద 78 కోట్లతో సాస్కీ పథకం కింద గండికోట ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేస్తారు.. అనంతరం అక్కడ వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములైన ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు.. సాయంత్రం 6 గంటలకు కడప ఎయిర్ పోర్టు నుండి విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕಾವೇರಿ ನೀರು ವಿವಾದ: ತಮಿಳುನಾಡು ಅರ್ಜಿ ವಿಚಾರಣೆ ಮುಂದೂಡಿದ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್

ನವದೆಹಲಿ, ಆಗಸ್ಟ್, 24,2026 (www.justkannada.in):  ಕಾವೇರಿ ನೀರು ಹರಿಸುವಂತೆ ಕಾವೇರಿ...

കേന്ദ്രസര്‍ക്കാര്‍ വാഗ്ദാനങ്ങള്‍ പാലിച്ചില്ല: സെപ്റ്റംബര്‍ അഞ്ചിന് പ്രതിഷേധ മാര്‍ച്ച് നടത്തുമെന്ന് സി.ജെ.പി

ന്യൂദല്‍ഹി: ജൂലൈ 25ന് പ്രതിഷേധം അവസാനിപ്പിക്കുന്നതിനായി കേന്ദ്രസര്‍ക്കാര്‍ തങ്ങള്‍ക്ക് നല്‍കിയ വാഗ്ദാനങ്ങള്‍...

“சினிமாவில் ஹீரோ; அரசியலில் வில்லன் ஆக்ட்..!" – முதல்வர் விஜய்யை விமர்சிக்கும் டி.டி.வி.தினகரன்

அமமுக-வின் தஞ்சாவூர் மாவட்டம், திருவோணம் தெற்கு ஒன்றியச் செயலாளர் கிருஷ்ணமூர்த்தியின் இல்லத்...

Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ కుటుంబంలోని నలుగురు దారుణహత్యకు గురయ్యారు. రంగ్‌పూర్‌లోని వారి...