26
June, 2026

A News 365Times Venture

26
Friday
June, 2026

A News 365Times Venture

Fide Women’s World Cup : కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ మధ్య రెండో క్లాసిక్‌ గేమ్‌ డ్రా

Date:

Fide Women’s World Cup : భారత్‌కు ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ టైటిల్ ఖాయం కావడంతో, తెలుగు స్టార్ ప్లేయర్ కోనేరు హంపి, యువ ప్రతిభ దివ్య దేశ్‌ముఖ్ మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. శనివారం జరిగిన తొలి గేమ్‌ను 41 ఎత్తుల తర్వాత డ్రాగా ముగించిన ఈ ఇద్దరు ఆటగాళ్లు, ఆదివారం జరిగిన రెండో గేమ్‌ను కూడా డ్రాతోనే ముగించారు. దీంతో టైటిల్ విజేతను తేల్చేందుకు సోమవారం టై-బ్రేకర్ రౌండ్‌లో రాపిడ్, బ్లిట్జ్ గేమ్‌లు నిర్వహించనున్నారు.

ఆదివారం రెండో గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హంపి, నల్ల పావులతో బరిలోకి దిగిన దివ్య దేశ్‌ముఖ్ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. 41 ఎత్తులపాటు ఉత్కంఠభరితంగా జరిగిన గేమ్‌లో విజయం సాధించే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ డ్రాకు ఒప్పుకున్నారు.

గేమ్ ఆరంభంలో దివ్య దేశ్‌ముఖ్ క్వీన్స్ గాంబిట్ ఓపెనింగ్‌తో దూకుడు ప్రదర్శించింది. 14వ ఎత్తులో బిషప్‌ను త్యాగం చేసి అడ్వాంటేజ్ సాధించింది. ఈ సమయంలో గెలిచే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆరంభంలో కొంత ఇబ్బంది పడ్డ హంపి, 16వ ఎత్తు నుంచి తన ఆటలో పుంజుకుంది.

37వ ఎత్తులో దివ్య దేశ్‌ముఖ్ హంపి రూక్‌ను గెలుచుకున్నా, హంపి పట్టుదలతో ఆడి 41వ ఎత్తులో పర్పెచువల్ చెక్స్‌తో గేమ్‌ను డ్రాగా ముగించింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ పోరాటంలో ఇద్దరు ఆటగాళ్లు ఒత్తిడిని చాకచక్యంగా ఎదుర్కొన్నారు.

ఇప్పటివరకు రెండు క్లాసికల్ గేమ్‌లు డ్రా కావడంతో, సోమవారం జరగనున్న టై-బ్రేకర్ మ్యాచ్‌ల్లో గెలిచే ఆటగాడికే ప్రతిష్ఠాత్మక ఫిడే మహిళల వరల్డ్ కప్ టైటిల్ దక్కనుంది.

Upcoming Smartphones: మెస్మరైజ్ చేసే ఫీచర్లతో.. ఆగస్టులో రిలీజ్ కు రెడీ అవుతున్న 5G స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..

Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్...

ಸರ್ಕಾರದ ಘನತೆ ಉಳಿಸುವ ವೃತ್ತಿಪರತೆ ಪ್ರದರ್ಶಿಸಿ. ಇಲ್ಲದಿದ್ರೆ ಕಠಿಣ ಕ್ರಮ ಅನಿವಾರ್ಯ-ಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು,ಜೂನ್,26,2026 (www.justkannada.in): ಸರ್ಕಾರದ ಘನತೆ ಉಳಿಸುವ ವೃತ್ತಿಪರತೆ ಪ್ರದರ್ಶಿಸಿ. ಇಲ್ಲದಿದ್ದರೆ...

എസ്.ഐ.ആര്‍ ഒരുവര്‍ഷം പിന്നിട്ടപ്പോള്‍ വോട്ടര്‍ പട്ടികയില്‍ നിന്ന് പുറത്താക്കിയത് ആറ് കോടിയോളം വോട്ടര്‍മാരെ

ന്യൂദല്‍ഹി: രാജ്യത്തെ തീവ്ര വോട്ടര്‍ പട്ടിക പുനപരിശോധന (എസ്.ഐ.ആര്‍) ഒരു വര്‍ഷം...

`கர்நாடக அரசின் பிராக்ஸி அரசா இந்த அரசு?' – ஜனநாயகன் பட தயாரிப்பாளர் நியமனத்திற்கு அதிமுக எதிர்ப்பு

தமிழ்நாடு அரசின் டெல்லி சிறப்புப் பிரதிநிதியாக ஜனநாயகன் திரைப்படத்தின் தயாரிப்பாளரான கே.வெங்கட...