ENG vs IND: ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా గ్రాంఢ్ విక్టరీ సాధించింది. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ 336 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను గిల్ సేన 1-1తో సమం చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియాకు ఇది మొదటి టెస్టు విజయం నమోదు చేసుకుంది. 608 పరుగుల లక్ష్య ఛేదనలో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 72/3తో ఐదో రోజు ఆటను స్టార్ట్ చేసింది. 271 రన్స్ కి ఆలౌటైంది.
Read Also: Top Headlines @9PM : టాప్ న్యూస్!
అయితే, ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో జేమీ స్మిత్ (99 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 88 పరుగులు) ఒక్కడే పోరాడాడు. బ్రైడన్ కార్స్ (38), బెన్ స్టోక్స్ (33), ఓలీ పోప్ (24), హ్యారీ బ్రూక్ (23) పరుగులే చేశారు. ఇక, టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ (6/99) ఇంగ్లాండ్ జట్టు పతనాన్ని ఒంటి చేతితో శాసించాడు. మరోవైపు, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, జడేజా తలో వికెట్ తీసుకున్నారు. భారత్ తొలి ఇన్సింగ్స్ 587/10.. ఇంగ్లాంగ్ తొలి ఇన్సింగ్స్ 407/10.. టీమిండియా సెకండ్ ఇన్సింగ్స్ 427/6 డిక్లేర్డ్.. ఇంగ్లాండ్ రెండో ఇన్సింగ్స్ 271/10..
Read Also: MP: 12 ఏళ్లు ఇంట్లోనే కూర్చుని రూ. 28 లక్షల జీతం తీసుకున్న కానిస్టేబుల్
కాగా, ఇంగ్లాండ్పై విజయంతో టెస్ట్ మ్యాచుల్లో కెప్టెన్గా శుభ్మన్ గిల్కి తొలి గెలుపు లభించినట్లైంది. దీంతో పాటు బర్మింగ్‌హామ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. దాదాపు 58 సంవత్సరాల చరిత్రను గిల్ సేన చెరిపేసింది. 58 ఏళ్లలో భారత్ ఈ స్టేడియంలో 9 మ్యాచ్‌లు ఆడగా.. తొలిసారి విజయం నమోదు చేసింది. 7 మ్యాచుల్లో ఓడిపోగా.. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.