25
September, 2026

A News 365Times Venture

25
Friday
September, 2026

A News 365Times Venture

Trump-Modi: జూలై 8న భారత్-యూఎస్ మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే ఛాన్స్!

Date:

అమెరికా-భారతదేశం మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటన జూలై 8న వెలువడే అవకాశం ఉంది. త్వరలోనే భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం జరగబోతున్నట్లు ఇప్పటికే ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రకటన జూలై 8న వెలువడే ఛాన్సుంది.

ఇది కూడా చదవండి: TBJP Chief :తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు

రెండోసారి అధికారంలోకి వచ్చాక ట్రంప్.. ఆయా దేశాలపై భారీగా సుంకాలు విధించారు. దీంతో దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అనంతరం ఏప్రిల్ 2న సుంకాలను మూడు నెలల పాటు వాయిదా వేస్తు్న్నట్లు ప్రకటించారు. ఆ గడువు జూలై 9తో ముగుస్తోంది. ఈ గడువు పొడిగించే అవకాశం లేదని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తేల్చి చెప్పారు. ఇక భారత్-అమెరికా మధ్య వాణిజ్యంపై కీలక ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటనను జూలై 8న అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇది కూడా చదవండి: Samantha : మధ్యాహ్నం కూర్చుంటే.. సాయంత్రం అయిపోతుంది.. సమంత కామెంట్స్ వైరల్

అదనపు సుంకాల నుంచి భారత్ మినహాయింపు కోరుతోంది. వస్త్రాలు, రొయ్యలు, రత్నాలు, తోలుపై భారతదేశం ఉపశమనం కోరుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, వైన్, వ్యవసాయ వస్తువులపై కోతలు విధించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అయితే తాజాగా ఇరు దేశాల మధ్య చర్యలు సఫలీకృతం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వ్యవసాయం, ఆటోమొబైల్స్, పారిశ్రామిక వస్తువులు, శ్రమ-ఇంటెన్సివ్ ఉత్పత్తులు వంటి కీలక రంగాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. భారత్ నుంచి ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలో బృందం వాషింగ్టన్‌తో కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ബീഹാറില്‍ മാത്രമല്ല അമേരിക്കയിലും ജപ്പാനിലും നടക്കുന്നുണ്ട്; ലൈംഗികാതിക്രമങ്ങളെ ന്യായീകരിച്ച് ബീഹാര്‍ മന്ത്രി

പട്‌ന: ബീഹാറില്‍ നടന്ന പെണ്‍കുട്ടികള്‍ക്കെതിരായ ലൈംഗികാതിക്രമ സംഭവങ്ങളെ ന്യായീകരിച്ച് മന്ത്രി അശോക്...

ஜெம் வீரமணி பாலியல் வழக்கு: 4 பெண் அதிகாரிகளை கொண்ட சிறப்பு புலனாய்வுக் குழு! – யார் அவர்கள்?

ஜெம் கிரானைட்ஸ் வீரமணி பாலியல் வழக்கில் நாளுக்கு நாள் வருகின்ற செய்திகள்...

Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు

వర్షాకాలం ముగుస్తున్న తరుణంలో దేశంలో భారీ మేఘాలు కమ్ముకున్నాయి. ఎల్‌నినో కారణంగా...

പ്രസംഗം തുടങ്ങും മുന്‍പേ ഇറങ്ങിപ്പോയി പ്രതിനിധികള്‍; പരിഹസിച്ച് നെതന്യാഹു

ന്യൂയോര്‍ക്ക്: എതിരാളികളെയും സഖ്യകക്ഷികളെയും ഒരുപോലെ ആക്രമിച്ചുള്ള ഇസ്രഈല്‍ പ്രധാനമന്ത്രി ബെഞ്ചമിന്‍ നെതന്യാഹുവിന്റെ...