22
September, 2026

A News 365Times Venture

22
Tuesday
September, 2026

A News 365Times Venture

Ayesha Meera Murder Case: ఆయేషా మీరా కేసులో ముగిసిన సీబీఐ దర్యాప్తు.. హైకోర్టు కీలక ఆదేశాలు..

Date:

Ayesha Meera Murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసింది.. దీంతో, తుది నివేదికను సీల్డ్‌ కవర్‌లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు సమర్పించారు సీబీఐ అధికారులు.. ఇక, ఈ కేసు విచారణ సందర్భంగా.. సీబీఐ కోర్టులోనూ ఆయేషా మీరా కేసుకు సంబంధించిన నివేదిక కాపీని అందించాలని.. సీబీఐ అధికారులను ఆదేశించింది హైకోర్టు.. మరోవైపు, ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు హైకోర్టు న్యాయమూర్తి..

Read Also: Vishnupriya : వామ్మో.. రెచ్చిపోయి అందాలన్నీ చూపించిన విష్ణుప్రియ..

విజయవాడలోని ఓ హాస్టల్‌లో 17 ఏళ్ల ఆయేషా మీరా అనే ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటన.. అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది.. 2007 డిసెంబర్27వ తేదీన జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది.. హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో కత్తిపోట్లతో ఆయేషా మీరా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, 2018లో ఈ కేసును పునర్‌విచారణ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.. తొలుత సిట్‌కి ఆ బాధ్యతలు అప్పగించిన హైకోర్టు.. సిట్ దర్యాప్తులో పురోగతి లేదని, ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశించిది.. దీంతో, విచారణ పూర్తి నివేదికను సీల్డ్ కవర్‌లో ఈ రోజు హైకోర్టుకు అందజేశారు సీబీఐ అధికారులు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗസ അനുകൂല പ്രതിഷേധം: പ്രോസിക്യൂഷന് തിരിച്ചടി; വിദ്യാര്‍ത്ഥികള്‍ക്കെതിരായ ക്രിമിനല്‍ കേസുകള്‍ ഒഴിവാക്കി

കാലിഫോര്‍ണിയ: ഗസയില്‍ ഇസ്രഈല്‍ നടത്തുന്ന ആക്രമണങ്ങളില്‍ സ്റ്റാന്‍ഫോര്‍ഡ് സര്‍വകലാശാലയില്‍ പ്രതിഷേധിച്ച അഞ്ച്...

தாராபுரம்: தவெக வேட்பாளருக்கு வலுக்கும் எதிர்ப்பு; போலீஸார் பாதுகாப்புடன் நடைபெறும் பிரசாரம்!

தமிழ்நாட்டில் மதுராந்தகம், தாராபுரம் ஆகிய இரண்டு தொகுதிகளுக்கான இடைத்தேர்தல் அக்டோபர் 6...

TGPSC Syllabus Changes: సిలబస్‌ మార్పులపై TGPSC కీలక ప్రకటన..

TGPSC Syllabus Changes: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) సిలబస్‌...

റോഡിന് വീതി കൂട്ടല്‍: അനധികൃത നിര്‍മാണമാരോപിച്ച്‌ കെട്ടിടങ്ങള്‍ പൊളിച്ചുനീക്കി ദല്‍ഹി പൊലീസ്

ന്യൂദല്‍ഹി: റോഡിന് വീതി കൂട്ടുന്നതിന്റെ ഭാഗമായി തെക്കന്‍ ദല്‍ഹിയിലെ ഛത്തര്‍പൂര് പ്രദേശത്തെ...