21
September, 2026

A News 365Times Venture

21
Monday
September, 2026

A News 365Times Venture

1941, 2025 Calendar: 1941లో ఏం జరిగిందో, 2025 లో కూడా అదే జరుగుతుందా?.. వైరల్ అవుతోన్న 84 ఏళ్ల క్యాలెండర్

Date:

ఈ సంవత్సరం (2025) భారత్ లో ఊహించని సంఘటనలు చోటుచేసుకుని పెను విషాదాన్ని నింపాయి. కుంభమేళా తొక్కిసలాట, పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్, ఇప్పుడు అహ్మదాబాద్ విమాన ప్రమాదం. ఈ సంఘటనలన్నింటి మధ్య, 2025 సంవత్సరంతో పాటు 1941 సంవత్సరం గురించి కూడా చర్చ జరుగుతోంది. ఈ సంవత్సరం 1941 లాంటిదని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇటీవల భారతదేశం, పాకిస్తాన్ మధ్య దాడులు జరిగాయి. 1941 సంవత్సరంలో ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ఈ సంవత్సరం, జపాన్ అమెరికా పెర్ల్ హార్బర్‌పై దాడి చేసింది.

Also Read:Aamir Khan: ఇచ్చిన మాట ప్రకారం.. రూ.120 కోట్ల డీల్ వదులుకున్న బాలీవుడ్ హీరో..

అయితే, ఇది కేవలం సంఘటనల గురించి కాదు. తేదీలు, రోజుల గురించి. 2025 క్యాలెండర్ అచ్చం 1941 క్యాలెండర్ లాగానే ఉంటుంది. ఆ సంవత్సరం రోజు ఈ సంవత్సరం సరిగ్గా ఒకేలా ఉంది. రెండు సంవత్సరాలు బుధవారం ప్రారంభమయ్యాయి. రెండూ లీప్ ఇయర్స్ కాదు. రెండు సంవత్సరాలలో ప్రతి తేదీ వారంలో ఒకే రోజున వస్తుంది. కానీ ఇది మ్యాట్రిక్స్లో ఒకేసారి వచ్చే లోపం కాదు. ఎందుకంటే ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ ఆధారంగా ఉంటుంది.

Also Read:Hardoi: భార్య ముక్కు కొరికిన భర్త.. అందంగా ఉందని కాదండోయ్..

1941 లో ఏం జరిగింది?

మే 27, 1941న, ఫ్రాన్స్ సమీపంలోని ఉత్తర అట్లాంటిక్‌లో బ్రిటిష్ నావికాదళం జర్మన్ యుద్ధనౌక బిస్మార్క్‌ను ముంచివేసింది. ఈ సంఘటనలో జర్మన్ సైనికుల సంఖ్య రెండు వేలకు పైగా ఉంది. ఈ దాడిని అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో ముడిపెట్టారు. దీనితో పాటు, జూలై 26, 1941న, అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ ఫ్రెంచ్ ఇండో-చైనాను జపనీస్ ఆక్రమించినందుకు ప్రతీకారంగా అమెరికాలోని అన్ని జపనీస్ ఆస్తులను జప్తు చేశారు.

Also Read:Doomsday Aircraft: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య.. అమెరికా ‘డూమ్స్‌డే విమానం’ ప్రత్యక్షం.. దీని స్పెషాలిటీ ఏంటంటే?

1941లో, నాజీ జర్మనీ సోవియట్ యూనియన్‌పై దాడి చేస్తూ ఆపరేషన్ బార్బరోస్సాను ప్రారంభించింది. జపాన్ పెర్ల్ హార్బర్‌పై దాడి చేసి, అమెరికాను యుద్ధంలోకి లాగింది. యూరప్, ఆసియా, ఆఫ్రికాలో యుద్ధం తీవ్రమైంది. ఆ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యానికి గురయ్యాయి. సంవత్సరం చివరి నాటికి, ప్రపంచం పూర్తిగా యుద్ధంలో మునిగిపోయింది.

Also Read:Sundeep Kishan: హీరో సందీప్ కిషన్ ఇంట తీవ్ర విషాదం..

2025 సంవత్సరంలో ప్రపంచం రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణను చూసింది. దీనితో పాటు, భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం, పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల సైనిక ఘర్షన జరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, గాజా, దక్షిణ లెబనాన్‌లో పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఇంతలో, అనేక దాడుల తర్వాత ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ జరిగింది, కానీ ఈలోగా ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసింది.

Nara Lokesh: ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా మార్చడానికి సహకారం అందించండి.. కేంద్రమంత్రికి లోకేశ్‌ విజ్ఞప్తి!

2025 సంవత్సరంలో, మహా కుంభమేళా తొక్కిసలాట, ఢిల్లీ తొక్కిసలాట, గుజరాత్ బాణసంచా కర్మాగారంలో అగ్నిప్రమాదం, పహల్గామ్ ఉగ్రవాద దాడి, బెంగళూరులో ఆర్‌సిబి వేడుకల సందర్భంగా తొక్కిసలాట అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం వంటి విషాద సంఘటనలు జరిగాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಬಿಜೆಪಿಯವರು ಕಾಗದ, ಮೊಬೈಲ್‌ ನೋಡದೇ ವಂದೇ ಮಾತರಂ ಹಾಡಲಿ- ಗೃಹ ಸಚಿವ ಪ್ರಿಯಾಂಕ್‌ ಖರ್ಗೆ

ಬೆಂಗಳೂರು,ಸೆಪ್ಟಂಬರ್‌,21,2026 (www.justkannada.in): ಬಿಜೆಪಿಯವರು ಕಾಗದ, ಮೊಬೈಲ್‌ ನೋಡದೇ ವಂದೇ ಮಾತರಂ...

മണിപ്പൂരില്‍ വീണ്ടും വെടിവെപ്പ്: 15 വയസുള്ള കുട്ടി കൊല്ലപ്പെട്ടു

ഇംഫാല്‍: മണിപ്പൂരിലെ തമെങ്‌ലോങ് ജില്ലയിലെ തമേയ് മേഖലയില്‍ അജ്ഞാതരായ ആയുധധാരികള്‍ നടത്തിയ...

"மக்கள் தங்குவதற்கு கட்டடம் இருக்கு; ஆனால்…" – விகடன் செய்திக்கு எழும்பூர் மருத்துவமனை விளக்கம்

முதல்வர் விஜய் ஆய்வு நடத்திய எழும்பூர் மகப்பேறு மருத்துவமனையில் அனுமதிக்கப்படும் பெண்களுக்கு...

Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్ లావా విరాట్ కర్వ్...