22
September, 2026

A News 365Times Venture

22
Tuesday
September, 2026

A News 365Times Venture

Nothing Phone 3: జూలై 1న లాంచ్ కాబోతున్న నథింగ్ ఫోన్ 3.. స్పెసిఫికేషన్స్ ఇవే..!

Date:

Nothing Phone 3: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Phone 3 ను జూలై 1న భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేయనుందని ప్రకటించింది. అలాగే ఈ ఈవెంట్‌లో కంపెనీ తన తొలి ఓవర్-ఇయర్ ఆడియో ప్రోడక్ట్ Nothing Headphone 1 ను కూడా లాంచ్ చేయనుంది. ఈ ప్రకటన ఇటీవల లీకైన డిజైన్ లీకులు, హార్డ్‌వేర్ రూమర్లను నమ్మేలా చేస్తుంది.

Read Also: Rahul Gandhi: 19న రాహుల్ గాంధీ బర్త్‌డే.. యూత్ కాంగ్రెస్ కీలక నిర్ణయం..!

నథింగ్ ఫోన్ 3 లో కొత్త Snapdragon 8s Gen 4 చిప్‌సెట్‌ను వాడుతున్నట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది. నథింగ్ సీఈఓ కార్ల్ పే తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త ప్రాసెసర్ గతంలో ఉపయోగించిన Snapdragon 8+ Gen 1 తో పోలిస్తే CPUలో 36%, GPUలో 88% పెరుగుదల చూపుతుందని తెలిపారు. ఫలితంగా ఈ ఫోన్ మరింత వేగంగా, మృదువుగా పనిచేస్తుందని తెలిపారు.

లీకైన సమాచారం ప్రకారం, నథింగ్ ఫోన్ 3లో 6.77-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉండే అవకాశముంది. ఫోన్ రియర్ సైడ్‌లో మూడు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 50MP ప్రాథమిక సెన్సార్ (OIS) అలాగే మిగతా కెమెరాలు అల్ట్రా వైడ్, పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌లుగా ఉండే అవకాశముంది. ఫోన్ బ్యాటరీ పరంగా కూడా భారీగా ఉంటుందని, 5000mAh కన్నా ఎక్కువ సామర్థ్యంతో వస్తుందని అంచనా.
Read Also: KA Paul: ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి.. లేదంటే నేను రంగంలోకి దిగుతా..!

లీకైన చిత్రాల ప్రకారం, నథింగ్ ఫోన్ 3 గత మోడళ్ల మాదిరిగానే స్పష్టమైన ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ డిజైన్ తో వస్తుంది. అయితే, ఈసారి నథింగ్ మొబైల్ ప్రత్యేక లక్షణమైన Glyph ఇంటర్ఫేస్ ఉండకపోవచ్చని సమాచారం. ఇది బ్రాండ్ డిజైన్‌లో ముఖ్యమైన మార్పుగా భావించవచ్చు. ఇక నథింగ్ ఫోన్ 3 రెండు వేరియంట్లలో విడుదల కానుంది. అందులో 12GB RAM + 256GB స్టోరేజ్ ధర USD 799 (సుమారు 68,000), 16GB RAM + 512GB స్టోరేజ్ ధర USD 899 (సుమారు 77,000) గా ఉండనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ భారత్‌లో ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయించబడుతుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗസ അനുകൂല പ്രതിഷേധം: പ്രോസിക്യൂഷന് തിരിച്ചടി; വിദ്യാര്‍ത്ഥികള്‍ക്കെതിരായ ക്രിമിനല്‍ കേസുകള്‍ ഒഴിവാക്കി

കാലിഫോര്‍ണിയ: ഗസയില്‍ ഇസ്രഈല്‍ നടത്തുന്ന ആക്രമണങ്ങളില്‍ സ്റ്റാന്‍ഫോര്‍ഡ് സര്‍വകലാശാലയില്‍ പ്രതിഷേധിച്ച അഞ്ച്...

தாராபுரம்: தவெக வேட்பாளருக்கு வலுக்கும் எதிர்ப்பு; போலீஸார் பாதுகாப்புடன் நடைபெறும் பிரசாரம்!

தமிழ்நாட்டில் மதுராந்தகம், தாராபுரம் ஆகிய இரண்டு தொகுதிகளுக்கான இடைத்தேர்தல் அக்டோபர் 6...

TGPSC Syllabus Changes: సిలబస్‌ మార్పులపై TGPSC కీలక ప్రకటన..

TGPSC Syllabus Changes: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) సిలబస్‌...

റോഡിന് വീതി കൂട്ടല്‍: അനധികൃത നിര്‍മാണമാരോപിച്ച്‌ കെട്ടിടങ്ങള്‍ പൊളിച്ചുനീക്കി ദല്‍ഹി പൊലീസ്

ന്യൂദല്‍ഹി: റോഡിന് വീതി കൂട്ടുന്നതിന്റെ ഭാഗമായി തെക്കന്‍ ദല്‍ഹിയിലെ ഛത്തര്‍പൂര് പ്രദേശത്തെ...