22
September, 2026

A News 365Times Venture

22
Tuesday
September, 2026

A News 365Times Venture

AP Govt: ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు విడుదల.. వారికి తప్పనిసరిగా బదిలీ!

Date:

ఏపీలో గ్రామ/వార్డ్, సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. గ్రామ/వార్డ్, సచివాలయ ఉద్యోగుల రేషనలైజెషన్ తర్వాత ప్రభుత్వం బదిలీలు చేస్తోంది. ఒకే చోట ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేస్తే.. బదిలీ తప్పనిసరి అని ఉత్తర్వులు జారీ చేసింది. 5 సంవత్సరాలు కాలం పూర్తికాని వారు వ్యక్తిగత అభ్యర్థన మేరకు బదిలీకి అర్హులుగా పేర్కొంది. ఉద్యోగికి తన సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు, భార్యా భర్తలు ఒకే చోట పోస్టింగ్‌లకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వనుంది.

ఖాళీల వివరాలు హెచ్‌ఆర్‌ఎంఎస్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. బదిలీ ఉత్తర్వులు జిల్లా కలెక్టర్లు జారీ చేస్తారని పేర్కొంది. బదిలీ యూనిట్ పాత జిల్లాల ఆధారంగా ఉంటుందని పేర్కొంది. మొత్తం బదిలీ ప్రక్రియ ఈ నెల 30లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. 5 సంవత్సరాలు పూర్తికాని ఉద్యోగులకై ఆన్‌లైన్ ద్వారా బదిలీ అభ్యర్థన ఇచ్చే సదుపాయంను కల్పించింది. దృష్టిహీనులైన వారు స్వచ్చందంగా కోరితే మాత్రమే బదిలీ ఉంటుంది. మానసికంగా వెనుకబడి ఉన్న పిల్లల తల్లిదండ్రులు, గిరిజన ప్రాంతాల్లో రెండు ఏళ్లకు పైగా పనిచేసిన వారు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యంతో ఉన్నవారు, దీర్ఘకాలిక అనారోగ్య కారణాలతో బదిలీ కోరినవారు, కంటుబడిన ఉద్యోగినులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.

Also Read: Yogandhra 2025: ప్రధాన వేదిక ఆర్కే బీచ్.. మార్పు చేయాల్సి వస్తే?

భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకే ప్రాంతంలో పోస్టింగ్‌కి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. ఐటీడీఏ మరియు వెనుకబడిన ప్రాంతాల్లో ముందుగా ఖాళీలు పూర్తి చేయాలని ఆదేశించింది. ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీ అయిన వారిని ప్రత్యామ్నాయ ఉద్యోగి జాయిన్ చేసిన తరువాతే రిలీవ్ చేయాలన్న నిబంధన పెట్టింది. బదిలీ అయిన వారు సూచించిన స్థలానికి చేరుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. బకాయి చెల్లింపులు చెల్లించకుండా ఏ ఉద్యోగినీ ఉద్యోగినీ రిలీవ్ చేయకూడదు. హెచ్‌ఆర్‌ఎంఎస్‌ పోర్టల్‌లో అన్ని ఉద్యోగుల వివరాలను జులై 10లోపు అప్‌డేట్ చేయాలని పేర్కొంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗസ അനുകൂല പ്രതിഷേധം: പ്രോസിക്യൂഷന് തിരിച്ചടി; വിദ്യാര്‍ത്ഥികള്‍ക്കെതിരായ ക്രിമിനല്‍ കേസുകള്‍ ഒഴിവാക്കി

കാലിഫോര്‍ണിയ: ഗസയില്‍ ഇസ്രഈല്‍ നടത്തുന്ന ആക്രമണങ്ങളില്‍ സ്റ്റാന്‍ഫോര്‍ഡ് സര്‍വകലാശാലയില്‍ പ്രതിഷേധിച്ച അഞ്ച്...

தாராபுரம்: தவெக வேட்பாளருக்கு வலுக்கும் எதிர்ப்பு; போலீஸார் பாதுகாப்புடன் நடைபெறும் பிரசாரம்!

தமிழ்நாட்டில் மதுராந்தகம், தாராபுரம் ஆகிய இரண்டு தொகுதிகளுக்கான இடைத்தேர்தல் அக்டோபர் 6...

TGPSC Syllabus Changes: సిలబస్‌ మార్పులపై TGPSC కీలక ప్రకటన..

TGPSC Syllabus Changes: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) సిలబస్‌...

റോഡിന് വീതി കൂട്ടല്‍: അനധികൃത നിര്‍മാണമാരോപിച്ച്‌ കെട്ടിടങ്ങള്‍ പൊളിച്ചുനീക്കി ദല്‍ഹി പൊലീസ്

ന്യൂദല്‍ഹി: റോഡിന് വീതി കൂട്ടുന്നതിന്റെ ഭാഗമായി തെക്കന്‍ ദല്‍ഹിയിലെ ഛത്തര്‍പൂര് പ്രദേശത്തെ...