16
April, 2026

A News 365Times Venture

16
Thursday
April, 2026

A News 365Times Venture

Ponnam Prabhakar: త్వరలోనే ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్..

Date:

Ponnam Prabhakar: తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండడంతో హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని త్వరలోనే నోటిఫికేషన్ వేసి సాధ్యమైనంత త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుంది.. దీని ద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని వారు 5500 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే మహా లక్ష్మి పథకం కింద కొత్త బస్సులు కొనుగోలు చేశామని ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ సన్నద్ధం అయిందని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

Read Also: Shahrukh Khan : అలాంటి ఒత్తిడి మాత్రం ఉండకూడదు..

కాగా, పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే ప్రజా పాలన ప్రభుత్వంలో నిరుద్యోగులకు పెద్ద పీఠ వేస్తూ దాదాపు 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ఇప్పుడు మరోసారి భారీస్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లను.. జాబ్ క్యాలండర్ ప్రకారం విడుదల చేయనుంది.. ప్రతి ఒక్క నిరుద్యోగి దీన్ని సద్వినియోగం చేసుకొని బాగా ప్రిపేర్ కావాలని సూచించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండడంతో సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.

Read Also: Sobhita Dhulipala : అందం.. అభినయం కలగలిపిన ‘శోభిత’ లేటెస్ట్ ఫొటోస్

మొత్తం ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలు..

* డ్రైవర్ -2000
* శ్రామిక్ -743
* డిప్యూటీ సూపరిండెంట్ (ట్రాఫిక్) – 84
* డిప్యూటీ సూపరిండెంట్ (మెకానికల్) – 114
* డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25
* అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ – 18
* అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23
* సెక్షన్ ఆఫీసర్ ( సివిల్) -11
* అకౌంట్ ఆఫీసర్స్ – 6
* మెడికల్ ఆఫీసర్స్ జనరల్ – 7
* మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ – 7

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അവർ തന്ത്രങ്ങൾ മെനയുകയാണ്; മണ്ഡല പുനർ നിർണയത്തെ ഇന്ത്യാ മുന്നണി എതിർക്കും: ഖാർഗെ

ന്യൂദൽഹി: ഇന്ത്യാ മുന്നണി മണ്ഡല പുനർ നിർണയ ബില്ലിനെ പാർലമെന്റിൽ എതിർക്കുമെന്ന്...

Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

బ్యాంకులో ఎంత డబ్బు దాచుకుంటే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు...

ಚನ್ನಪಟ್ಟಣ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಚುನಾವಣಾ ಜ್ವರ ಕ್ರಿಯೇಟ್ ಮಾಢುವುದು ಬೇಡ-ಹೆಚ್ ಡಿಕೆಗೆ ಯೋಗೇಶ್ವರ್ ಟಾಂಗ್

ರಾಮನಗರ,ಏಪ್ರಿಲ್,15,2026(www.justkannada.in): ಮುಂದಿನ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಚನ್ನಪಟ್ಟಣ ಕ್ಷೇತ್ರದಿಂದ ಮತ್ತೆ ಕೇಂದ್ರ...