7
November, 2026

A News 365Times Venture

7
Saturday
November, 2026

A News 365Times Venture

CSK vs KKR : వరసగా ఐదోసారి ఓడిన చెన్నై సూపర్‌కింగ్స్‌

Date:

CSK vs KKR : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గురువారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఘన విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు బ్యాటింగ్ విఫలమవడంతో, కోల్‌కతా‌కు తక్కువ స్కోరు చేధించడంలో ఎలాంటి కష్టాలూ ఎదురుకాలేదు.

మ్యాచ్ ప్రారంభంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీఎస్కే జట్టులోని ప్రధాన బ్యాట్స్‌మెన్లు ఒక్కరూ ఆకట్టుకోలేకపోయారు. కేకేఆర్ బౌలర్లు ప్రతిఘటించకుండా రాణించారు.

అనంతరం 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు ఆరంభం నుంచే విజయం వైపు నడిచింది. కేవలం 10.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ సునీల్ నరైన్ 44 పరుగులతో ఆడిన విధానం అభిమానులను ఆకట్టుకుంది. అతనితో పాటు డికాక్ 23, రహానే 20 పరుగులతో సహకరించారు.

సునీల్ నరైన్ ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షో ప్రదర్శించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో కీలక వికెట్లు పడగొట్టిన నరైన్, బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడుతూ చెన్నైపై విజయం సాధించడంలో ప్రధానంగా నిలిచాడు. ఈ విజయం ద్వారా కోల్‌కతా నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

Krishna District: అలర్ట్.. 40 మందికి పైగా క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അമിത് ഷാ മോദിയെ കണ്‍ഫ്യൂഷനാക്കരുത്; എന്നോട് എസ്.ഐ.ആറില്‍ സംവാദത്തിന് വരാന്‍ പറയൂ: രാഹുല്‍ ഗാന്ധി

ന്യൂദല്‍ഹി: എസ്.ഐ.ആറിനെക്കുറിച്ച് താനുമായി ഒരു തുറന്ന സംവാദത്തിന് തയ്യാറാകാന്‍ പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര...

"பிரதமர்-உள்துறை அமைச்சர் கையும் களவுமாக பிடிபட்டுவிட்டார்கள்! மறைக்க என்னென்னவோ..!" – காங்கிரஸ்

சிறப்புத் தீவிரத் திருத்தத்திற்கான நடைமுறைகளைத் தேர்தல் ஆணையம் அடிக்கடி மாற்றுவதைச் சாடி,...

APPSC Group 1 Evaluation Scam: ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్‌.. ఈడీ మెరుపు దాడులు.. కీలక ఆధారాల సేకరణ

APPSC Group 1 Evaluation Scam: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్...

കുറ്റം ചെയ്യുന്നവര്‍ ജുവനൈല്‍ നിയമം മറയാക്കി രക്ഷപ്പെടുന്നു; നിയമത്തില്‍ ഭേദഗതി വേണമെന്ന ചിന്ത ഉയര്‍ന്നുവരുന്നു: ആഭ്യന്തര മന്ത്രി

തിരുവനന്തപുരം: 18 വയസ്സില്‍ താഴെയുള്ളവര്‍ ജുവനൈല്‍ നിയമത്തിന്റെ സൗകര്യം ഉപയോഗിച്ച് കുറ്റകൃത്യങ്ങള്...