20
April, 2026

A News 365Times Venture

20
Monday
April, 2026

A News 365Times Venture

REDMAGIC 10 Air: గేమర్ల కోసం ప్రత్యేకంగా త్వరలో విడుదలకు సిద్ధం కానున్న రెడ్‌మ్యాజిక్ 10 ఎయిర్ స్మార్ట్‌ఫోన్

Date:

REDMAGIC 10 Air: రెడ్‌మ్యాజిక్ 10 సిరీస్‌లోని కొత్త స్మార్ట్‌ఫోన్ REDMAGIC 10 Air చైనా మార్కెట్‌లో ఏప్రిల్ 16న అధికారికంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించగా, తాజాగా ఈ ఫోన్‌కి సంబంధించిన డిజైన్‌ను మూడు ఆకర్షణీయమైన కలర్స్‌లో విడుదల చేసింది. ఇవి షాడో బ్లాక్, ఫ్రోస్ట్ బ్లేడ్ వైట్, ఫ్లేమ్ ఆరంజ్ రంగుల్లో ఉంటాయని రెడ్‌మ్యాజిక్ వెల్లడించింది. ఈ ఫోన్ సంబంధించి రెడ్‌మ్యాజిక్ CEO నీ ఫీ మాట్లాడుతూ.. ఈ ఫోన్ పొడవుగా, బలంగా ఉండే విధంగా డిజైన్ చేయబడిందని.. దీనిని ఒకసారి చేతిలో పట్టుకుంటే వదలటం కష్టమని తెలిపారు. ఈ ఫోన్‌ ను యువ గేమర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Also Read: Ronald Rose : ఏపీకి కాదు… రోనాల్డ్ తెలంగాణలోనే..! సీనియర్ ఐఏఎస్ అధికారికి ఊరట..

ఇక ఈ ఫోన్ సంబంధించిన లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల Full HD+ BOE OLED స్క్రీన్ ఉండనుందని సమాచారం. దీని రిఫ్రెష్ రేట్ 120Hz వరకు ఉండనుంది. అలాగే, ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఉండనుంది. అలాగే ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, ఇంకా 16MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ ఫోన్ పరిమాణం 164.3 x 76.6 x 7.85mm, బరువు 205 గ్రాములు మాత్రమే ఉంటాయని లీకులు చెబుతున్నాయి. ఇది 6000mAh భారీ బ్యాటరీ కలిగి ఉన్నా కూడా.. మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యల్ప బరువు, అత్యల్ప మందం గల గేమింగ్ ఫోన్లలో ఒకటిగా నిలవనుందని అంచనా. అలాగే ఈ మొబైల్ కు 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. మొత్తంగా ఈ రెడ్‌మ్యాజిక్ 10 ఎయిర్ అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ గేమింగ్ సామర్థ్యాలతో యూత్‌కు నచ్చేలా ఉండబోతోంది. పూర్తి వివరాలు ఫోన్ అధికారికంగా విడుదలయ్యే ఏప్రిల్ 16న తెలిసే అవకాశముంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ചായ വിളമ്പിയതിന് ക്രൂരത; പീഡനത്തിനിരയായ കുടുംബത്തിന് സഹായവുമായി അഖിലേഷ് യാദവ്

ലഖ്‌നൗ: തനിക്ക് ചായ വിളമ്പിയതിന് പിന്നാലെ ഭരണകൂടം പിന്തുടർന്ന് ആക്രമിച്ച ശേഷ്മാൻ...

"தமிழ்நாட்டிற்குள் முகமூடி அணிந்து நுழைய பார்க்கிறது பா.ஜ.க மற்றும் ஆர்.எஸ்.எஸ்" – ராகுல் காந்தி

திருச்சி மாவட்டத்தில் உள்ள 9 சட்டமன்ற தொகுதிகளில் போட்டியிடும் மதச்சார்பற்ற முற்போக்குக்...

Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ

కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అద్భుతమైన స్పెల్ వేసి, రాజస్థాన్ రాయల్స్‌ను...