21
August, 2026

A News 365Times Venture

21
Friday
August, 2026

A News 365Times Venture

Vijayawada Metro Project: స్పీడందుకున్న విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు..!

Date:

Vijayawada Metro Project: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రాజెక్ట్ తొలి దశలో భూసేకరణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మెట్రో నిర్మాణానికి అవసరమైన భూమి వివరాలను అధికారులు ఖరారు చేశారు. విజయవాడలో మెట్రో రైలును రెండు కారిడార్లుగా అభివృద్ధి చేస్తున్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వరకు 26 కిలోమీటర్లు. పీఎన్‌బీఎస్‌ నుంచి పెనమలూరు వరకు 12.5 కిలోమీటర్లు నిర్మాణం చేస్తున్నారు. ఈ కారిడార్ల నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల్లో కలిపి 91 ఎకరాల భూమిని సేకరించనున్నారు. మెట్రో స్టేషన్ల కోసం విజయవాడ నగరంలో ప్రధాన ప్రాంతాల్లో భూసేకరణ చేపడుతున్నారు. మొగల్రాజపురం, మాచవరం, పటమట, గుణదల, నిడమానూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. మెట్రో నిర్మాణానికి 4.12 ఎకరాల భూమి అవసరంగా గుర్తించారు. విజయవాడ నగరంలోని పలు రెవెన్యూ వార్డులు పరిధిలో భూసేకరణ జరుగనుంది. మొత్తం 34 మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో ఎన్టీఆర్ జిల్లాలో 20, కృష్ణా జిల్లాలో 14 స్టేషన్లు ఉండనున్నాయి..

Read Also: CS Shanthi Kumari: జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్..

గన్నవరం ఎయిర్‌పోర్ట్ సమీపంలో 3 కిలోమీటర్ల మేర భూగర్భ మెట్రో మార్గం రూపొందించనున్నారు. మెట్రో కోసం ప్రత్యేకంగా కోచ్ డిపో నిర్మించనుండగా, దీనికి 50 ఎకరాల భూమి అవసరం అవచ్చు అని అధికారులు అంచనా వేశారు. విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ. 11,009 కోట్లు వ్యయం చేయనుంది. భూసేకరణ కోసం మాత్రమే రూ.1,152 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఒక్కో మెట్రో స్టేషన్ నిర్మాణానికి సుమారు రూ. 25 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ మెట్రో ప్రారంభం అయితే.. నగరవాసులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యం లభించనుంది. ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు, నగర అభివృద్ధికి మెట్రో ఎంతో దోహదపడనుంది.మెట్రో ప్రాజెక్ట్ పనులు ప్రస్తుత వేగంతో కొనసాగితే, విజయవాడలో మెట్రో రైలు త్వరలోనే పట్టాలపై పరుగులు పెట్టనుంది అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ರೇಣುಕಾಸ್ವಾಮಿ ಕೊಲೆ ಕೇಸ್: ಸತ್ಯಸಂಗತಿ ನೂರಕ್ಕೆ ನೂರರಷ್ಟು ಬಹಿರಂಗಪಡಿಸುತ್ತೇನೆ ಎಂದು ಒಪ್ಪಿಕೊಂಡ ಆರೋಪಿ

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್.20,2026 (www.justkannada.in): ರೇಣುಕಾಸ್ವಾಮಿ ಕೊಲೆ ಪ್ರಕರಣಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಸತ್ಯವಾದ ಸಂಗತಿಯನ್ನ...

ലണ്ടനിൽ മുസ്‌ലിം ആക്ടിവിസ്റ്റിനെ നിരീക്ഷിക്കാൻ യു.എ.ഇ ഇസ്രഈലി പൗരന് ദശലക്ഷങ്ങൾ നൽകിയിരുന്നതായി റിപ്പോർട്ട്

ലണ്ടൻ: ബ്രിട്ടിഷ് മുസ്‌ലിം ആക്ടിവിസ്റ്റ് അനസ് അൽറ്റിക്രിറ്റിയെ നിരീക്ഷിക്കാൻ യു.എ.ഇ ദശലക്ഷക്കണക്കിന്...

"அமெரிக்காவின் கடன் நெருக்கடியை திசை திருப்பவே எங்கள் மீது பொருளாதார D-Day" – ஈரானின் ரியாக்‌ஷன்

ஈரானுக்குப் பொருளாதார ரீதியாக நெருக்கடி கொடுக்க நேற்று (ஆகஸ்ட் 19), ஈரானுக்கு...

Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిలాద్‌-ఉన్‌-నబి పండుగ సాధారణ సెలవు తేదీని సవరిస్తూ కీలక...