15
March, 2026

A News 365Times Venture

15
Sunday
March, 2026

A News 365Times Venture

Viral: ఇండియా-పాక్ మధ్య కొన్ని రోజుల్లో మ్యాచ్.. గొడవ పడ్డ హర్భజన్, అక్తర్.. (వీడియో)

Date:

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాగా.. ఈ టోర్నమెంట్‌కు సంబంధించి క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ ఏ టీమ్స్ ఫైనల్‌కు వెళ్తాయో అంచనా వేస్తున్నారు. కాగా.. ఫిబ్రవరి 23న భారత్-పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ టోర్నీకి ముందు క్రికెట్ దిగ్గజాలు గొడవ పడటం కలకలం రేపుతోంది. ILT20 2025 ఫైనల్‌లో టీమిండియా మాజీ దిగ్గజం హర్భజన్ సింగ్, పాక్ మాజీ దిగ్గజం షోయబ్ అక్తర్‌ గొడవ పడ్డ వీడియో వైరల్ అవుతుంది.

Read Also: Student Kidnapped: కాకినాడలో బాలుడి కిడ్నాప్.. గాలిస్తున్న పోలీసులు!

అయితే ఈ గొడవ సీరియస్‌గా జరిగింది కాదు.. ఫన్నీగా జరిగింది. స్టేడియంలో ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు సరదాగా గొడవ పడుతుండటం ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. వైరల్ అవుతున్న వీడియోలో హర్భజన్ బ్యాట్‌తో, షోయబ్ బంతితో ఒకరినొకరు సరదాగా నెట్టుకుంటూ, సవాలు చేసుకుంటున్నారు. కాగా.. ఈ వీడియోను అక్తర్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశాడు. ‘ఛాంపియ‌న్స్ ట్రోఫీకి మేమిలా సిద్ధమ‌వుతున్నాం’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌ శైలిలో స్పందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ నెల 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదిక‌ల‌లో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భాగంగా భార‌త్‌, పాక్ మ‌ధ్య మ్యాచ్ ఫిబ్రవ‌రి 23న దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

 


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പൂനെയില്‍ പൊതുസ്ഥലത്ത് നോമ്പ് തുറക്കുന്നത് ചോദ്യം ചെയ്ത് യുവാക്കളെ ആക്രമിച്ചു; അഞ്ച് പേര്‍ക്ക് പരിക്ക്; 15 പേര്‍ പിടിയില്‍

പൂനെ: പൂനെ അക്‌സര്‍വാഡിയില്‍ കുളത്തിനരികെ നോമ്പ് തുറയ്ക്കായി ഒത്തുകൂടിയ മുസ്‌ലിം യുവാക്കളെ...

“உளவுத் துறையைக் கையாளப் போகும் முதல் பெண் டி.ஜி.பி”- அதிரடி மாற்றங்களைக் கையில் எடுத்த அரசு!

தமிழகத்தில் கடந்த சில நாட்களாக நடந்துவந்த குற்றசெயல்களும், அதை தொடர்ந்து...

Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..

కాలేయం మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవం. ఇది విషతుల్యాలను తొలగించడం,...