15
August, 2026

A News 365Times Venture

15
Saturday
August, 2026

A News 365Times Venture

Uttam Kumar Reddy : త్వరలో పంచాయతీ ఎన్నికలు.. ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్‌వి అనవసర విమర్శలు

Date:

Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్‌కు ప్రేమ్ సాగర్ రావు ప్రధాన స్థంభమని ప్రశంసించారు. ప్రజలకు అన్ని ప్రభుత్వ పథకాలు సమర్థంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే, పంచాయతీ ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని తెలిపారు.

కేబినెట్ విస్తరణపై మాట్లాడుతూ, ఇది గోప్యమైన అంశమని, ప్రస్తుతానికి దీనిపై ఎటువంటి సమాచారం ఇవ్వలేమని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ పథకాలపై అవాస్తవ ప్రచారం చేయడం సరైనది కాదని మండిపడ్డారు. నాలుగు కీలక పథకాల గురించి బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏవి ఆగే ప్రసక్తే లేదని, 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో నడిచే నాయకుడిగా ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు బీఆర్ఎస్ ప్రచారానికి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Delhi Elections: అభ్యర్థి కాళ్లు మొక్కిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే..!

ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటివరకు ఇంత మంచి పాలన చూడలేదని, రాష్ట్ర అభివృద్ధికి ఉద్దేశించిన పథకాలు వేగంగా అమలవుతున్నాయని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్వహించి స్థానిక పరిపాలనను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. తన రాజకీయ జీవితం విశ్వసనీయతతో నిండిపోయిందని, వరుసగా ఏడు సార్లు ప్రజల ఆదరణ పొందిన వ్యక్తినని గుర్తుచేశారు.

కేటీఆర్ అరెస్టుపై స్పందించేందుకు మంత్రి నిరాకరించారు. తన సొంత నియోజకవర్గమైన హుజుర్ నగర్‌లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభం కాకపోవడంపై ఇంజినీర్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పనులను ప్రారంభించాలని అధికారులకు ఫోన్‌లోనే ఆదేశాలు ఇచ్చారు. సమస్యలను గుర్తించి, పనులను మౌలికంగా ముందుకు తీసుకెళ్లాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సూర్యాపేట సీఈతో పాటు జిల్లా ఇరిగేషన్ అధికారులను హైదరాబాదుకు రావాలని ఆదేశించడంతో పాటు, రాష్ట్రంలోని అభివృద్ధి పనులపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. “నా సొంత నియోజకవర్గంలోనే పనులు ఇలా సాగితే, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంటుంది?” అంటూ మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

Squid Game 3: స్క్విడ్ గేమ్ 3 స్ట్రీమింగ్ డేట్ ప్రకటన.. ఎప్పుడంటే?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കോൺഗ്രസിന്റെ പ്രത്യയശാസ്ത്ര ശൂന്യതയിൽ സംഘപരിവാർ കസേരയിട്ട് ഇരിക്കുന്നു: എ.എ. റഹീം

  തിരുവനന്തപുരം: കോൺഗ്രസിന്റെ പ്രത്യയശാസ്ത്ര ശൂന്യതയാണ് എ.ഐ.സിസി ആസ്ഥാനത്ത് വന്ദേമാതരം പൂർണമായി...

சேலம்: 80 வது சுதந்திர தின விழாவின் கோலாகலமான கொண்டாட்டம்! | Photo Album

"பெண்களுக்கு எதிரான அவதூறுதான் பாஜக அரசியலின் அடிப்படை" - நயினார் பேச்சுக்கு...

ലുങ്കിവാല അധിക്ഷേപം: സ്വാതന്ത്ര്യദിനത്തില്‍ ലുങ്കിയുടുത്ത് പതാകയുയര്‍ത്തി വി.ടി ബല്‍റാം

പാലക്കാട്: സ്വാതന്ത്ര്യ ദിന ആഘോഷങ്ങള്‍ക്കിടെ ലുങ്കിയുടുത്ത് പതാകയുയര്‍ത്തി വി.ടി ബല്‍റാം എം.എല്‍എ....