29
September, 2026

A News 365Times Venture

29
Tuesday
September, 2026

A News 365Times Venture

Brahmarakshas : ప్రశాంత్ వర్మ ‘బ్రహ్మారాక్షస’ మళ్ళీ మారాడు?

Date:

హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్టుతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. చిన్న సినిమాతో 300కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకొని ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అతడి పేరు మార్మోగిపోయింది. దీంతో అతడితో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు యంగ్ హీరోలు. ఇదే ఫేమ్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి.. అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ హడావుడి చేశాడు. బాలీవుడ్ న‌టుడు ర‌ణ్ వీర్ సింగ్‌తో క‌లిసి ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు ప్ర‌శాంత్. కథా చర్చలు కూడా జరిగాయి. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత రిషబ్ శెట్టితో జై హనుమాన్ స్టార్ట్ చేశాడు. అలాగే తన సినిమాటిక్ యూనివర్శ్ లో భాగంగా మహాంకాళిని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు స్టోరీని అందిస్తున్నాడు ప్రశాంత్ వర్మ.

Malluwood: వరంగా మారుతున్న చిన్న బడ్జెట్ సినిమాలు

ఇదే కాకుండా అంతకు ముందే ఎనౌన్స్ చేసిన అధిర ఎంత వరకు వచ్చిందో అప్డేట్ లేదు. ఇవే కాకుండా నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్షజ్ఞతో డెబ్యూ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ బ్రహ్మా రాక్షస మాత్రం సెట్ కాలేదు. రణవీర్ సింగ్ నుండి క్విటైన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రభాస్ చెంతకు వచ్చిందన్న టాక్ వచ్చింది. కానీ బాహుబలి నుండి భళ్లాల దేవకు చేరిందని సమాచారం. టాలీవుడ్ హల్క్ రానాకు ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇన్నర్ టాక్. నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉండే బ్రహ్మా రాక్షసలో దగ్గుబాటి వారసుడు టైటిల్ రోల్ పోషించబోతున్నాడని తెలుస్తోంది. బాహుబలి, వెట్టయాన్ తర్వాత మరోసారి రానా ప్రతినాయకుడిగా ఆకట్టుకోబోతున్నాడన్న మాట.. మరీ ప్రశాంత్ వర్మ తాను అనుకున్న స్టోరీకి సరైన హీరో దొరికినట్లేనా..? అనేది చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ನೈಸ್ ದಾರಿ ತಪ್ಪುವುದಕ್ಕೆ  HDK ಅಂಡ್ ಫ್ಯಾಮಿಲಿ ಕಾರಣ-ಸಚಿವ ಚಲುವರಾಯಸ್ವಾಮಿ

ಬೆಂಗಳೂರು,ಸೆಪ್ಟಂಬರ್,29,2026 (www.justkannada.in): ನೈಸ್ ಯೋಜನೆ ಅಕ್ರಮ ವಿಚಾರವಾಗಿ ಸಿಎಂ ಡಿಕೆ...

മോദിയെ വിമർശിച്ചതിന് പിന്നാലെ നടപടി; കാർട്ടൂണിസ്റ്റ് സതീഷ് ആചാര്യയുടെ ഇൻസ്റ്റാഗ്രാം പേജ് ഇന്ത്യയിൽ ബ്ലോക്ക് ചെയ്തു

ന്യൂദൽഹി: പ്രമുഖ രാഷ്ട്രീയ കാർട്ടൂണിസ്റ്റ് സതീഷ് ആചാര്യയുടെ ഇൻസ്റ്റാഗ്രാം അക്കൗണ്ടിന് ഇന്ത്യയിൽ...

"நான் அவர்களை குறிப்பிடவில்லை, மோகன் குமாரமங்கலம் எனக்கு தோழர்.!"- சர்ச்சைக்கு ராஜ்மோகன் விளக்கம்

தேர்தல் ஆணையர் ஞானேஷ் குமார் தன்னிச்சையாக செயல்பட்டிருப்பதால் அவர் பதவி விலக...

Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..

తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన...