15
August, 2026

A News 365Times Venture

15
Saturday
August, 2026

A News 365Times Venture

Emergency: లండన్‌లో ‘ఎమర్జెన్సీ ‘కి అడ్డంకులు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ సీరియస్

Date:

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజీకయ జీవితం ఆధారంగా తెరక్కెక్కిన ఈ మూవీలో అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి కీలక పాత్ర పోషించారు. ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించారు. గతంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా.. పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 17న థియేటర్లలో విడుదలైంది.

READ MORE: MEA : ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ఖలిస్థాన్ ఉగ్రవాది హాజరు.. స్పందించిన భారత్

కాగా.. కంగనా రనౌత్ ఇటీవల విడుదలైన ‘ఎమర్జెన్సీ’కి లండన్‌లో భారీ వ్యతిరేకత ఎదురవుతోంది. ఇక్కడ కొందరు సినిమా చూస్తున్న ప్రేక్షకులను భయపెట్టి బెదిరించినట్లు సమాచారం. ఈ విషయంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరుల సమావేశంలో ఈ సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు.

READ MORE: Medchal Murder Case : మేడ్చల్‌లో యువతి హత్య.. వెలుగులో కీలక విషయాలు

ఈ చిత్రాన్ని అనేక థియేటర్లలో ప్రదర్శించకుండా అడ్డుకుంటున్నారన్న వార్తా నివేదికలు తమ దృష్టికి వచ్చాయన్నారు. భారత వ్యతిరేక మూకల నుంచి వచ్చే బెదిరింపులు, హింసాత్మక నిరసనల అంశాలను యూకే ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. ఈ సినిమాను ప్రదర్శించడంలో అడ్డంకులు కలిగించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. యూకే ప్రభుత్వం ఈ విషయంలో సరైన విధంగా స్పందిస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. భారత దౌత్య కార్యాలయం ద్వారా అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు వెల్లడించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ക്യാമ്പസില്‍ അമ്പലം പണിയണം; അങ്ങനെ കുറേ പണം കിട്ടും; ജെ.എന്‍.യു വി.സിയുടെ ‘മുട്ടന്‍’ ഐഡിയ

ന്യൂദല്‍ഹി: ജെ.എന്‍.യുവിലെ സാമ്പത്തിക പ്രതിസന്ധി പരിഹരിക്കാന്‍ ഒരു ‘ മുട്ടന്‍’ ഐഡിയ...

`தலைவர்களைக் கட்டிப்பிடிப்பதுதான் வெளிநாட்டுக் கொள்கையா?'- ராகுல் பேச்சு; பாஜக கண்டனம்!

பிரதமர் நரேந்திர மோடி தலைமையிலான மத்திய அரசின் வெளியுறவுத்துறை கொள்கையைக் விமர்சிக்கும்...

Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!

Shridhar Chillal: ఎడమచేతి వాటం.. మనలో చాలా తక్కువ మందికి మాత్రమే...