4
March, 2026

A News 365Times Venture

4
Wednesday
March, 2026

A News 365Times Venture

Un Released Tamil Movies : ఈ స్టార్ హీరోల సినిమాలు ఇంకా ల్యాబ్ లోనే మగ్గుతున్నాయని తెలుసా..?

Date:

సంక్రాంతి రేసులో నుండి అజిత్ విదాముయర్చి తప్పుకోవడంతో.. సడెన్‌గా ఊడిపడింది విశాల్ యాక్ట్ చేసిన మదగజరాజా. పుష్కరకాలం క్రితం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ లీగల్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సమస్యలన్నీ సాల్వ్ కావడంతో పొంగల్‌కు వచ్చి హిట్టు టాక్ మూటగట్టేసుకుంది. ఇలాగే షూటింగ్ కంప్లీట్ చేసుకుని థియేట్లరలోకి ఎంట్రీ ఇవ్వని కోలీవుడ్ సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో చాలా మందికి తెలిసిన క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ధ్రువ నక్షత్రం.

Also Read : Kannappa : కన్నప్పలో శివుడిగా అక్షయ్ కుమార్.. ఫస్ట్ లుక్ చూసారా..?

2013లో సూర్యతో మొదలై 2015లో విక్రమ్ చేతికి వచ్చి 2017లో షూటింగ్ మొదలై 6 ఏళ్ల పాటు సెట్స్‌పై ఉన్న ఈ సినిమా చూడాల్సిన అన్ని కష్టాలను చూసింది. ఎట్టకేలకు 2023లో గుమ్మడి కాయ కొట్టేశాడు దర్శకుడు గౌతమ్ వాసు దేవ మీనన్. అదే ఏడాది నవంబర్‌లో మూవీని తీసుకురావాలనుకున్నాడు. కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ రిలీజ్‌‌కు నోచుకోకుండా చేశాయి. ఇప్పటికీ ధ్రువ నక్షత్రం రిలీజ్ కోసం డైరెక్టర్‌తో పాటు ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు.ఇక నాలుగు భాషల్లో షూటింగ్ జరుపుకున్న బాలీవుడ్ హిట్ మూవీ క్వీన్ రీమేక్‌ది కూడా సేమ్ సిచ్యుయేషన్. తమిళంలో పారిస్ పారిస్ పేరుతో తెరకెక్కిన సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని కూడా లీగల్, ఫైనాన్షియల్ ఇష్యూస్ థియేటర్లలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. ఇక వెంకట్ ప్రభు- జై కాంబోలో తెరకెక్కిన పార్టీ కూడా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ విడుదలకు మోక్షం దక్కట్లేదు.

Also Read :Tollywood : హిట్ డైరెక్టర్స్ ను రిపీట్ చేస్తున్న టాలీవుడ్ హీరోలు

విజయ్ సేతుపతి, విష్ణు విశాల్, ఐశ్వర్య రాజేష్ నటించిన ఇదమ్ పొరుల్ యేవల్ కూడా షూటింగ్ కంప్లీటై 10 ఏళ్లు అవుతున్నా ఇంకా ల్యాబ్‌లోనే మగ్గిపోతుంది. ఎందుకంటే ప్రేమంట తెలుగులో, తమిళంలో ఏక కాలంలో షూట్ చేశారు. తెలుగులో సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో తమిళ వర్షన్ యెన్ ఎండ్రాల్ కాదల్ ఎన్బెన్ ను రిలీజ్ చేసేందుకు సాహించలేదు మేకర్స్. ఈ జాబితాలో అరవింద్ స్వామి నరకసూరన్, సంతానం సర్వర్ సుందరం లాంటి ప్రాజెక్టులున్నాయి. ఇప్పుడు మదగజరాజా పాజిటివ్ వైబ్స్ చూసి ఇవి ఇష్యూస్ సాల్వ్ చేసుకుని థియేటర్లలోకి సినిమాలు దింపుతాయోమో చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

NBK111: బాలకృష్ణ-గోపీచంద్ మలినేనిమూవీలో.. మంచు హీరో సెన్సేషనల్ ఎంట్రీ!

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక...

‘Whistle Blower Policy’ ಜಾರಿ:  ಭ್ರಷ್ಟಾಚಾರದ ವಿರುದ್ಧ ದೂರು ನೀಡಲು ಮುಕ್ತ ಅವಕಾಶ

ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್,3,2026 (www.justkannada.in): ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನಾರೋಗ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ...

ഇറാന്റെ പ്രതിരോധവും നേതൃത്വവും എല്ലാം നശിച്ചു; സമയം വൈകിപ്പോയി, ഇനി ചര്‍ച്ചയില്ല: ട്രംപ്

വാഷിങ്ടണ്‍: പശ്ചിമേഷ്യയിലെ സംഘര്‍ഷത്തില്‍ ചര്‍ച്ചകള്‍ക്കുള്ള സമയം കഴിഞ്ഞുപോയെന്ന് യു.എസ് പ്രസിഡന്റ് ഡൊണാള്‍ഡ്...

Iran: மீண்டும் ஈரான் தலைமையைக் குறிவைத்த இஸ்ரேல்; போர் பதற்றம் அதிகரிக்கிறதா? என்ன நடந்தது?

ஏற்கெனவே ஈரானின் உச்சத் தலைவர் கமேனியைக் கொன்றுள்ளது அமெரிக்காவும், இஸ்ரேலும். இப்போது...