16
June, 2025

A News 365Times Venture

16
Monday
June, 2025

A News 365Times Venture

Mulugu District: బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో “బడా నేత” బడే చొక్కారావు హతం..

Date:

బీజాపూర్‌లోని పుజారి -కంకేర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బడే చొక్కారావుతో పాటు 17 మంది మృతి చెందారు. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో లేఖ విడుదల చేశాడు. బడే చొక్కా రావు, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశాడు. బడే చొక్కా రావు అలియాస్ (దామోదర్, మల్లన్న) ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, కాల్వపల్లి గ్రామవాసి. ఇతను మిలిటరీ చీఫ్‌గా కూడా పనిచేశాడు. గతంలో భద్రతా దళాలను టార్గెట్ చేసి వారిపై కాల్పులు, ల్యాండ్ మైన్ పేల్చిన ఘటనలో కీలక పాత్ర పోషించాడు. చొక్కా రావు తల్లి బతుకమ్మ.

READ MORE: Mollywood : చాలా కాలం తర్వాత పోటీపడుతున్నఆ ఇద్దరు స్టార్ హీరోలు

గతంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించిన యాప నారాయణ అలియాస్ హరి భూషణ్ 2021లో కోవిడ్ బారిన పడి మరణించాడు. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. అయితే ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు మావోయిస్టు పార్టీ పలువురి పేర్లు పరిశీలించింది. ఈ క్రమంలో ఆజాద్ పేరు సైతం తెరపై వినిపించగా చివరకు చొక్కారావు పేరు ఖరారు చేశారు. తెలంగాణ జిల్లాల్లో మంచిపట్టున మడేచొక్కా రావ్ ఎటురు నాగారం.. ములుగు… మహబూబాబాద్ ప్రాంతాల్లో ఆక్టివ్ గా పని చేశాడు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బడే చొక్కా రావు నియామకంతో రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాల పునరుద్ధరణకు సహాయపడింది.ఈ నేపథ్యంలో అతడి హతం మావోయిస్టు పార్టీకి తీరని లోటుగా మారింది. దీంతో పార్టీ కార్యకలాపాలను సాగించడం అస్థవ్యస్తంగా మారుతుందని పలువురు భావిస్తున్నారు.

READ MORE: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ “హెల్త్ ఇన్సూరెన్స్”.. చికిత్సకు ఎంత డబ్బు ఇచ్చిందంటే..?

ఇదిలా ఉండగా.. నిన్న, సుక్మా-బీజాపూర్ సరిహద్దులో ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతాన్ని పరిశోధించడంలో సైనికులు పెద్ద విజయం సాధించారు. సుక్మా డీఆర్‌జీ సైనికులు నక్సలైట్ సొరంగం కనుగొన్నారు. సుక్మా బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న తుమ్రైల్, తాల్పేరు నది మధ్య నక్సలైట్ల డంప్‌ను డీఆర్‌జీ సుక్మా సైనికులు స్వాధీనం చేసుకున్నారు. నక్సలైట్లు ఆయుధాలు, పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన సామాగ్రిని సొరంగం నిర్మించి పారబోశారు. నక్సలైట్లు కొత్త టెక్నాలజీని అవలంబించడం ద్వారా సైనికులకు హానీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నక్సలైట్లు బాంబుల తయారీకి గాజు సీసాలు ఉపయోగిస్తున్నారు. సొరంగం నుంచి ఆయుధాల తయారీ యంత్రం, ఎలక్ట్రిక్ వైర్, బాటిల్ బాంబు, భారీ మొత్తంలో నక్సల్స్ డంప్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు.

READ MORE: Nelson : జైలర్ 2పై నెల్సన్ ఎక్స్‌పర్టేషన్స్ భారీగా పెంచేస్తున్నాడా..?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಬೆಂಗಳೂರು: ಜೂನ್ 19-20 ರಂದು 24 ಗಂಟೆಗಳ ಕಾಲ ಕಾವೇರಿ ನೀರು ಸರಬರಾಜಿನಲ್ಲಿ ವ್ಯತ್ಯಯ.!

ಬೆಂಗಳೂರು ಜೂ.೧೬, ೨೦೨೫ : ಕಾವೇರಿ ನೀರು ಸರಬರಾಜು ಯೋಜನೆಯ...

ഇറാന്റെ ആണവായുധ ഭീഷണിയെ ഇല്ലാതാക്കാന്‍ പോകുന്നു; അവകാശവാദവുമായി നെതന്യാഹു

ടെല്‍ അവീവ്: ഇറാന്റെ ആണവായുധ, ബാലിസ്റ്റിക് കേന്ദ്രങ്ങള്‍ ഇല്ലാതാക്കാന്‍ പോവുകയാണെന്ന അവകാശവാദവുമായി...