26
November, 2026

A News 365Times Venture

26
Thursday
November, 2026

A News 365Times Venture

Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!

Date:

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతున్న కోటి దీపోత్సవం–2026 పదకొండో రోజు వేడుకలు కార్తీక పౌర్ణమి పర్వదినాన అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తున్న కోటి దీపయజ్ఞంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవం, జ్వాలాతోరణ వేడుకలు భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ముంచెత్తాయి. ప్రముఖ పీఠాధిపతుల అనుగ్రహ భాషణాలు, ప్రవచనామృతం, విశేష పూజలు, వాహన సేవలతో ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది.

అరుణాచలేశ్వర స్వామి కల్యాణం.. బిల్వార్చన, వాహన సేవ వైభవం

కార్తీక పౌర్ణమి ప్రత్యేకతను చాటుతూ నిర్వహించిన శ్రీ అపీతకుచాంబికా అరుణాచలేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేదికపై నిర్వహించిన విశేష పూజల్లో తిరువణ్ణామలై అరుణాచలేశ్వరునికి బిల్వార్చన సహిత మహానీరాజనం సమర్పించారు. భక్తులు స్వయంగా శివలింగాలకు బిల్వార్చన నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కల్యాణోత్సవం అనంతరం స్వామివారి పల్లకి వాహన సేవతో పాటు స్వర్ణలింగోద్భవం, సప్తహారతులు,  అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు, దీపారాధన చేసుకునేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.  జ్వాలాతోరణం కార్యక్రమం  అంగరంగ వైభవంగా జ్వాలాతోరణం జరిగింది.

పీఠాధిపతి అనుగ్రహ భాషణం.. ప్రవచనామృతం

పదకొండో రోజు కార్యక్రమాల్లో భాగంగా మైసూరులోని అవధూత దత్తపీఠం పీఠాధిపతి పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేసి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేశారు. అనంతరం బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి తమ ప్రవచనామృతంతో కార్తీక పౌర్ణమి విశిష్టతను, ఆధ్యాత్మిక సందేశాలను భక్తులకు చక్కగా వివరించారు.

జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్ ఆధ్యాత్మిక ప్రసంగం

ఈ రోజు వేడుకలకు ముఖ్య అతిథిగా కుటుంబ సమేతంగా హాజరైన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్ ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. అరుణాచల ఈశ్వరుని కల్యాణాన్ని భక్తులు కన్నులారా వీక్షించడం గొప్ప పుణ్యమని ఆయన పేర్కొన్నారు. గత 15 ఏళ్లుగా జరుగుతున్న కోటి దీపోత్సవం కార్తీక పౌర్ణమి వేళ నిండు చంద్రుని సాక్షిగా జరగడం భగవంతుని ఆశీస్సులకు నిదర్శనమని చెప్పారు. త్రిపురాసుర సంహారం కథను ప్రస్తావిస్తూ చెడుపై మంచి ఎల్లప్పుడూ గెలుస్తుందని, సమాజంలో అందరూ సోదర భావంతో మెలగాలని సూచించారు. భారతదేశం పుణ్యభూమి అని, ఇక్కడ ప్రతి మూల వేద మంత్రాలు, దేవోచ్చారణలు వినిపిస్తాయని భక్తిభావంతో తెలిపారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు అధర్మం పెరిగినప్పుడు దైవం అవతరిస్తుందని, ఆ పరమాత్ముని రాక కోసం ఎదురుచూస్తూ మంచి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. చివరిగా భక్తులందరూ నిండు చంద్రుని దర్శించుకుని, హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో పుణ్యం పొందాలని కోరుతూ తన ప్రసంగాన్ని ముగించారు.

జస్టిస్ వాకిటి రామకృష్ణ రెడ్డి సందేశం..  

మరో ముఖ్య అతిథిగా కుటుంబ సమేతంగా విచ్చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వాకిటి రామకృష్ణ రెడ్డిని నిర్వాహకులు వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యతను వివరించారు. గత 15 సంవత్సరాలుగా భక్తి టీవీ యాజమాన్యం ఎంతో నిష్టగా, నిర్విరామంగా నిర్వహిస్తున్న ఈ మహాద్భుతమైన కార్యక్రమాన్ని అభినందించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టమని పేర్కొన్నారు. అరుణాచలేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని భక్తులతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించడం ఎంతో పుణ్యప్రదమని తెలిపారు. ఈ కార్యక్రమం ఇలాగే నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ, భగవంతుని ఆశీస్సులు దేశ ప్రజలందరికీ, ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణ ప్రజలకు ఉండాలని కోరుకున్నారు.

 

మరోవైపు కార్తీక పౌర్ణమి వేళ భక్తులు స్వామివారి అనుగ్రహం పొందాలని రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌టీపీఎల్) సాదరంగా ఆహ్వానించగా, ప్రతి ఏడాది, ప్రతి రోజు లాగే దీపారాధనకు అవసరమైన పూజా సామాగ్రి, ఇతర వస్తువులను నిర్వాహకులు ఉచితంగా అందజేశారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഫലസ്തീന്‍ തടവുകാരെ പീഡിപ്പിച്ച് കുറ്റസമ്മതം നടത്തുന്നു: ഇസ്രഈലിനെതിരെ ഗുരുതര ആരോപണവുമായി മനുഷ്യാവകാശ സംഘടന

  ടെല്‍ അവീവ്: ഫലസ്തീന്‍ തടവുകാരെ ക്രൂരമായ പീഡനങ്ങള്‍ക്ക് വിധേയരാക്കി കുറ്റസമ്മത...

கள்ளக்குறிச்சி தவெக எம்எல்ஏ வழக்கு: ஆளுநரை நேரில் சந்தித்தது ஏன்? – உதயநிதி ஸ்டாலின் விளக்கம்

கள்ளக்குறிச்சி விவகாரத்தில் தவெக எம்எல்ஏ அருள் விக்னேஷ் மீது நடவடிக்கை எடுக்க...

Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!

ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణల కలకలం సృష్టిస్తున్నాయి.. నిష్పక్షపాత విచారణ జరుపుతామన్న...

ഇസ്രഈലിനുള്ള സൈനിക സഹായം നിര്‍ത്തലാക്കുമെന്ന ട്രംപിന്റെ പ്രഖ്യാപനത്തെ തള്ളി യു.എസ് അംബാസഡര്‍

  ടെല്‍ അവീവ്: ഇസ്രഈലിനുള്ള അമേരിക്കയുടെ വാര്‍ഷിക സൈനിക സഹായം ഈ...