26
November, 2026

A News 365Times Venture

26
Thursday
November, 2026

A News 365Times Venture

Jensen Huang: ఎన్విడియా సీఈఓగా తిరిగి జెన్సన్ హువాంగ్ నియామకం..

Date:

Jensen Huang: ప్రపంచ ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియా (NVIDIA) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్‌ను తిరిగి అధ్యక్షుడు (President), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), బోర్డు డైరెక్టర్‌గా నియమించింది. ఈ నియామకం తక్షణమే అమలులోకి వచ్చినట్లు నవంబర్ 23న కంపెనీ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఎన్విడియా బోర్డు డైరెక్టర్లు ఏకగ్రీవంగా తీసుకున్నారు. హువాంగ్‌‌తో వరసగా చర్చలు, సమావేశాలు నిర్వహించిన తర్వాత ఆయన నిజాయితీగా వ్యవహరించిన తీరుపై, కంపెనీ నడిపించే సామర్థ్యంపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు సంస్థ వెల్లడించింది.

ఈ నిర్ణయం తీసుకునే క్రమంలో అమెరికా ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారుల అభిప్రాయాలు కూడా బోర్డు పరిగణలోకి తీసుకుంది. హువాంగ్ తిరిగి బాధ్యతలను చేపట్టడం వల్ల అమెరికా జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లదని బోర్డు విశ్వసించినట్లు తెలిపింది.

ఎన్విడియా బోర్డు ఛైర్మన్ హార్వే సి. జోన్స్ మాట్లాడుతూ.. కంపెనీని ముందుకు నడిపించేందుకు జెన్సన్ హువాంగ్ సరైన వ్యక్తి అని బోర్డు భావిస్తోందన్నారు. తిరిగి ఆయన బాధ్యతలు చేపట్టడం షేర్ హోల్డర్లు, ఉద్యోగులు, భాగస్వాములు, వినియోగదారుల ప్రయోజనాలకు అనుకూలమని అన్నారు. హువాంగ్ నేతృత్వంలో మళ్లీ పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని అన్నారు. తాత్కాలిక సీఈఓగా వ్యవహరించిన కోలెట్ క్రెస్ సేవల్ని కూడా బోర్డు ప్రశంసించింది. ఇకపై ఆమె ఎన్విడియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ (CFO)గా కొనసాగనున్నారు. హార్వే జోన్స్ బోర్డు ఛైర్మన్‌గా కొనసాగుతారు.

అక్రమ సంబంధం ఆరోపణలు, అలిస్ హువాంగ్‌తో సంబంధం కారణంగా జెన్సన్ హువాంగ్ చిక్కుల్లో పడ్డారు. అలిస్ హువాంగ్ చైనాకు ఎన్విడియా చిప్‌లను అక్రమంగా రవాణా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన వివాహేతర సంబంధాల కారణంగా జెన్సన్ హువాంగ్ ఎన్విడియా అధ్యక్షుడు, సీఈఓ, బోర్డు సభ్యుడి పదవులకు నవంబర్ 12న రాజీనామా చేశారు. ఆ తర్వాత 11 రోజులకే తిరిగి సీఈఓగా నియమితులయ్యారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

രാമായണ സിനിമയിലെ രംഗങ്ങള്‍ നീക്കം ചെയ്യണം; 50 ശതമാനം ലാഭം രാമക്ഷേത്രത്തിന് നല്‍കണമെന്ന് ഹരജി

റാഞ്ചി: രാമായണം എന്ന സിനിമയിലെ ചില രംഗങ്ങള്‍ നീക്കം ചെയ്യണമെന്നും, അവ...

OTR: టీడీపీ గెలిచినా నేతల్లో అసంతృప్తి.. నంద్యాలలో ఏం జరుగుతోంది?

OTR: ఒకరికి ముగ్గురు నాయకులు…. బలవంతులు, ప్రభావితం చేసే శక్తి ఉన్నవాళ్ళు....

ഇന്ത്യ അടക്കമുള്ള രാജ്യങ്ങള്‍ക്കെതിരെ യു.എസിന്റെ പുതിയ തീരുവകള്‍

വാഷിങ്ടണ്‍: ഇന്ത്യ അടക്കമുള്ള രാജ്യങ്ങളില്‍ നിന്നുള്ള ഉല്‍പന്നങ്ങള്‍ക്ക് യു.എസ് പുതിയ തീരുവകള്‍...