24
November, 2026

A News 365Times Venture

24
Tuesday
November, 2026

A News 365Times Venture

Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..

Date:

అమెరికా స్టాక్ మార్కెట్లలో సోమవారం భారీ ర్యాలీ కనిపించింది. చిప్‌మేకింగ్ దిగ్గజం ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ తిరిగి ఆ సంస్థ సీఈఓగా బాధ్యతలు చేపట్టడం మార్కెట్లలో కొత్త జోష్ నింపింది. అయితే, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా మార్కెట్లలో 3 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.270 లక్షల కోట్లు) సంపద పెరగలేదు. వాస్తవానికి, హువాంగ్ రాకతో ఒక్క ఎన్విడియా షేర్లు 27 నుంచి 30 శాతం మేర ఎగబాకి, ఆ కంపెనీ మార్కెట్ విలువ సుమారు 900 బిలియన్ డాలర్ల నుంచి 1 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.85 లక్షల కోట్లు) వరకు పెరిగింది. దీంతో ఎన్విడియా మొత్తం మార్కెట్ విలువ 3.025 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.

అసలేం జరిగింది..?
వ్యక్తిగత వివాదాల కారణంగా జెన్సన్ హువాంగ్ ఈ నెల 12న సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన నిష్క్రమణతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలై, గత తొమ్మిది రోజుల్లో ఎన్విడియా మార్కెట్ విలువ సుమారు 1 ట్రిలియన్ డాలర్ల మేర పడిపోయింది. అంతేకాకుండా, ఎస్ అండ్ పి 500, నాస్‌డాక్ సూచీలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సంస్థ ప్రయోజనాల దృష్ట్యా హువాంగ్‌ను తిరిగి అధ్యక్షుడిగా, సీఈఓగా నియమిస్తున్నట్లు ఎన్విడియా బోర్డు సోమవారం ప్రకటించింది.

మార్కెట్లపై ప్రభావం..
హువాంగ్ తిరిగి బాధ్యతలు చేపట్టారన్న వార్త వెలువడగానే అమెరికా ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో ఎన్విడియా షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. ఏఐ (AI) రంగంలో ఎన్విడియా కీలక పాత్ర పోషిస్తున్నందున, ఆ సంస్థ నాయకత్వంపై మళ్లీ నమ్మకం కుదరడం అమెరికా టెక్ స్టాక్స్‌కు ఊరటనిచ్చింది. అయితే, హువాంగ్‌పై ఉన్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కొనసాగుతుందని, జాతీయ భద్రత కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని కంపెనీ బోర్డు స్పష్టం చేసింది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

"கள்ளக்குறிச்சி தவெக MLA-வை உடனடியாகக் கைது செய்ய வேண்டும்" – காங்கிரஸ் எம்.பி. மாணிக்கம் தாகூர்

கள்ளக்குறிச்சி தவெக எம்.எல்.ஏ அருள் விக்னேஷ் மாவட்ட ஆட்சியருக்கு ஆபாசமாக மெசேஜ்...

നെതന്യാഹു സര്‍ക്കാര്‍ സ്വയം കുഴിച്ച കുഴിയില്‍ വീണു;ഗസ കേസില്‍ ഇസ്രഈലിന് തിരിച്ചടി ഉറപ്പെന്ന് ഇസ്രഈലി നിയമവിദഗ്ധന്‍

  ടെല്‍അവീവ്: റോഹിങ്ക്യന്‍ മുസ്‌ലിങ്ങള്‍ക്കതിരെ മ്യാന്‍മര്‍ വംശഹത്യ നടത്തിയെന്ന അന്താരാഷ്ട്ര നീതിന്യായ...

"ஆளுங்கட்சியின் பாலியல் பொறுக்கிகளை பாதுகாக்கத் தான் ஆட்சி நடத்துகிறாரா Dummy CM?"- உதயநிதி காட்டம்

கள்ளக்குறிச்சி தவெக எம்.எல்.ஏ அருள் விக்னேஷ் மாவட்ட ஆட்சியர் பத்மஜாவுக்கு ஆபாசமாக...

Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవీ నిర్వహిస్తున్న...