18
November, 2026

A News 365Times Venture

18
Wednesday
November, 2026

A News 365Times Venture

CM Chandrababu: కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు వర్చువల్ భేటీ.. తక్షణ సాయానికి విజ్ఞప్తి..

Date:

మురసు తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన కేంద్ర బృందం ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వర్చువల్‌గా సమావేశమైంది. రాష్ట్రానికి తక్షణ తుఫాన్ సాయం అవసరమని, కోస్తాంధ్రలో మౌలిక వసతుల బలోపేతానికి కేంద్రం సహకరించాలని సీఎం కోరారు. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం రెండు బృందాలుగా విడిపోయి బాపట్ల, పల్నాడు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని దాదాపు 60 ప్రాంతాల్లో పర్యటించింది. క్షేత్రస్థాయిలో తాము పరిశీలించిన అంశాలను కేంద్ర బృందం సీఎంకు వివరించింది.

తుఫాన్ నష్టం తీవ్రంగా ఉందని, తూర్పుగోదావరిలో 80 శాతం, ఏలూరు జిల్లాలో 90 శాతం వరకు వరి పంట దెబ్బతిన్నట్లు తెలిపింది. ఉద్యాన పంటల్లో మామిడి, బొప్పాయికి తీవ్ర నష్టం జరిగిందని, ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల గ్రామీణ రహదారులు, విద్యుత్ స్తంభాలు, కచ్చా ఇళ్లు దెబ్బతిన్నాయని పేర్కొంది. అయితే ప్రభుత్వం ముందుగానే కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం వల్ల నష్టం కొంత తగ్గిందని ప్రశంసించింది. ప్రత్తి రైతులకు బీమా లేకపోవడాన్ని గుర్తించామని, బాధితులకు నెలలో మూడుసార్లు రేషన్, సేంద్రియ రైతులకు అధిక పరిహారం, ఆదిమ గిరిజనులకు ప్రత్యేక సాయం అందించాలని సూచించింది.

రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రాథమిక అంచనాల ప్రకారం మురసు తుఫాన్‌తో మొత్తం రూ.2,484 కోట్ల నష్టం వాటిల్లింది. ఇందులో 1,43,617 హెక్టార్లలో పంటలు దెబ్బతిని 1.86 లక్షల మంది రైతులు రూ.875 కోట్ల మేర నష్టపోయారు. ఉద్యాన పంటల్లో రూ.337 కోట్లు, 1,385 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిని రూ.888 కోట్ల నష్టం సంభవించింది. అలాగే 369 సాగునీటి వనరులు, 16 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు, 1,448 ట్రాన్స్‌ఫార్మర్లు, 3,859 ఇళ్లు దెబ్బతిన్నాయి. అత్యవసర సహాయక చర్యలకు ప్రభుత్వం రూ.37 కోట్లు ఖర్చు చేసింది. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను వివరిస్తూ వీలైనంత త్వరగా కేంద్రానికి పూర్తిస్థాయి నివేదిక సమర్పించి ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్ర బృందాన్ని కోరారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

യു.പി: എസ്.ഐ.ആര്‍ കരടില്‍ 13.58 കോടി വോട്ടര്‍മാര്‍; വര്‍ധിച്ചത് 18.84 ലക്ഷംപേരെന്ന് തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷന്‍

ലഖ്നൗ: ഉത്തര്‍പ്രദേശില്‍ വോട്ടര്‍മാരുടെ എണ്ണത്തില്‍ വര്‍ധന. എസ്.എസ്.ആറിന്റെ (സ്‌പെഷ്യല്‍ സമ്മറി റിവിഷന്‍)...

SIR: `உ.பி-யில் 1.27 கோடி இந்து வாக்காளர்களின் பெயர்கள் நீக்கம்'- விளக்கம் கேட்ட யோகி ஆதித்யநாத்!

வாக்காளர் சிறப்பு தீவிர திருத்தத்திற்கு (SIR) பிறகு உத்தரப்பிரதேச மாநில...

Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..

న్యూజిలాండ్‌తో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్...

എന്‍വിദിയയുടെ തലപ്പത്തേക്ക് മടങ്ങി വരാന്‍ തയ്യാര്‍; നിക്ഷേപകര്‍ അടക്കമുള്ളവര്‍ അത് ആവശ്യപ്പെടുന്നതായി ഹുവാങ്

ന്യൂയോര്‍ക്ക്: എന്‍വിദിയയുടെ നേതൃസ്ഥാനത്തേക്ക് താന്‍ വീണ്ടും മടങ്ങി വരണമെന്ന് ജീവനക്കാരും നിക്ഷേപകരും...