17
November, 2026

A News 365Times Venture

17
Tuesday
November, 2026

A News 365Times Venture

Kishan Reddy : డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం

Date:

దేశ భవిష్యత్తుకు పెను సవాలుగా మారిన డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో ‘జైన్ జాగృతి సెంటర్’ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాండప్ కామెడీ , కాన్సెప్చువల్ షో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ​ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న మన దేశంలో మాదకద్రవ్యాలు యువశక్తిని నిర్వీర్యం చేస్తూ వారిని పక్కదారి పట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రమాదాన్ని గుర్తించిన ప్రధాని మోదీ డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించారని తెలిపారు. గతంలో ఆర్టికల్ 370, ‘సర్జికల్ స్ట్రైక్’.. తరహాలోనే ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకొని విజయవంతం చేసిన మోదీ గారు, ఇప్పుడు దేశం నుంచి డ్రగ్స్‌ను పూర్తిగా తరిమికొట్టే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ​ప్రధాని పిలుపు మేరకు, డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగంగా ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ నగరంలో ‘నషా ముక్త్ భారత్’ (Nasha Mukt Bharat) పేరిట మూడు రోజుల పాటు భారీ అవగాహన నడక (హైదరాబాద్ వాక్) నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం జరిగే ఈ బృహత్తర కార్యక్రమంలో యువత, నగర ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അജിത് പവാറിന്റെ മരണം; വിമാനം ഓപ്പറേറ്റ് ചെയ്ത കമ്പനിയുടെ ഉടമയെ ഫട്‌നാവിസ് സംരക്ഷിക്കുന്നു: രോഹിത് പവാര്‍

മുംബൈ: മഹാരാഷ്ട്ര മുന്‍ ഉപമുഖ്യമന്ത്രി അജിത് പവാര്‍ അപകടത്തില്‍ മരിക്കാനിടയായ വിമാനം...

சாட்ஜிபிடி மூலம் புத்தகங்கள்; ஒரே நாளில் ISBN பெற்ற நூல்கள், அதே நாளில் ஒப்புதல்! – FIR முழு விவரம்!

தமிழ்நாடு பொது நூலக இயக்ககம் மற்றும் கோவை பெரியார் அறிவுலகம் உள்ளிட்ட...

രാജ്യത്ത് ആദിവാസികള്‍ ആരുമില്ലെന്ന് ബി.ജെ.പി എം.എല്‍.എ; ബി.ജെ.പിയുടെ ആദിവാസി വിരുദ്ധത വെളിപ്പെട്ടെന്ന് കോണ്‍ഗ്രസ്

ഭോപ്പാല്‍: രാജ്യത്ത് ആദിവാസികള്‍ എന്ന് ആരുമില്ലെന്ന പരാമര്‍ശവുമായി മധ്യപ്രദേശിലെ ബി.ജെ.പി എം.എല്‍.എ...

சோனியா காந்தி நூல் வெளியீட்டு விழா: ராகுல் காந்தி அருகில் விஜய்; பின் வரிசையில் டி.கே.சிவக்குமார்!

காங்​கிரஸ் மூத்த தலை​வர் சோனியா காந்​தி​யின் வாழ்க்கை அனுபவங்​கள், ‘பிலாங்​கிங்: ஏ...