16
November, 2026

A News 365Times Venture

16
Monday
November, 2026

A News 365Times Venture

Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..

Date:

అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై చివరి ఓవర్‌లో అద్భుత విజయాన్ని అందించిన తర్వాత భారత యువ ఆటగాడు మొహిత్ ఉల్వా తన మనసులోని భావాలను పంచుకున్నాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఆ ఆఖరి ఓవర్‌లో తన మైండ్‌లో ఏం నడిచిందన్న ప్రశ్నకు అతడు బదులిస్తూ, ఆ సమయంలో తన మనసులో పెద్దగా ఆలోచనలేమీ లేవని, కేవలం తనపై తనకు ఉన్న నమ్మకం, భగవంతుడిపై విశ్వాసంతోనే క్రీజులో నిలబడ్డానని తెలిపాడు.

ఈ ఆసియా కప్ టోర్నీలో మ్యాచ్ కంటే ముందు వరకు తన ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదని మొహిత్ అంగీకరించాడు. తాను ప్రధానంగా బౌలర్‌నే అయినప్పటికీ, తనలో ఒక ఆల్-రౌండర్ ఉన్నాడని ఎప్పుడూ బలంగా నమ్మానని చెప్పాడు. అయితే ఆ విషయాన్ని నిరూపించుకోవడానికి ఇప్పటివరకు తనకు సరైన అవకాశాలు రాలేదని, కానీ అవకాశం వస్తే కచ్చితంగా చేయగలననే ఆత్మవిశ్వాసం తనలో ఎప్పుడూ ఉండేదని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో తనకు మనల్ మద్దతు ఎంతో అవసరమైందని, తనకంటే ముందుగా బ్యాటింగ్‌కు వెళ్లి అతడు సృష్టించిన మొమెంటం అద్భుతమని ప్రశంసించాడు. మనల్ సిద్ధం చేసిన ఆ వేదికపై తాను వెళ్లి పని పూర్తి చేయాల్సి వచ్చిందని వివరించాడు.

చివిరి బంతికి కావాల్సిన 3 పరుగుల గురించి మాట్లాడుతూ.. తాను కేవలం ఆ ఒక్క బంతి కోసమే ఎదురుచూశానని మొహిత్ వెల్లడించాడు. బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించగలననే నమ్మకం తనకు పూర్తిగా ఉందని, భగవంతుడిపై పూర్తి విశ్వాసంతో ఉన్నానని తెలిపాడు. ఈ రోజు తనదేనని, మ్యాచ్‌ను తానే ఫినిష్ చేస్తానని ముందే తెలుసని అన్నాడు. “నేను చేయగలను, నేను చేస్తాను, చివరి వరకు ఉండి పని పూర్తి చేస్తాను” అని ఎప్పుడూ తనకు తాను చెప్పుకుంటానని స్పష్టం చేశాడు.

ముఖ్యంగా చిగురుపాటి వెంకట తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడని మొహిత్ గుర్తు చేసుకున్నాడు. “నువ్వు చేయగలవు, వెళ్లి నీ సహజమైన ఆట ఆడు, నువ్వే మ్యాచ్‌ను ముగిస్తావు” అంటూ వెంకట తనను నిరంతరం ప్రోత్సహించాడని చెప్పాడు. చివరి బంతి వరకు క్రీజులో నిలబడితే తామిద్దరం కలిసి పని పూర్తి చేయగలమని వెంకట ఇచ్చిన నమ్మకం తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని, ఆఖరి బంతి వరకు క్రీజులో ఉంటే విజయం మనదేనన్న దృఢ సంకల్పంతో ఆడి జట్టును గెలిపించానని మొహిత్ ఉల్వా వివరించాడు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മാധ്യമ സ്വാതന്ത്ര്യത്തിന് മേലുള്ള കടന്നുകയറ്റം: ചെക്ക് റിപ്പബ്ലിക്കില്‍ സര്‍ക്കാരിനെതിരെ തെരുവിലിറങ്ങി നാല് ലക്ഷം പേര്‍

  പ്രാഗ്: പൊതുമേഖലാ മാധ്യമങ്ങളുടെ ധനസഹായ സംവിധാനം പൊളിച്ചെഴുതാനുള്ള സര്‍ക്കാര്‍ നീക്കത്തിനെതിരെ...

ദല്‍ഹി വായു നിലവാരം മോശം അവസ്ഥയിലേക്ക് മെച്ചപ്പെട്ടു; എയര്‍ പ്യൂരിഫയര്‍ വില്‍പയില്‍ വര്‍ധന

ന്യൂദല്‍ഹി: ദല്‍ഹിയിലെ വായു നിലവാരം (എയര്‍ ക്വാളിറ്റി ഇന്‍ഡക്‌സ്-എ.ക്യു.ഐ) ‘വളരെ മോശം’...

மேகதாது அணை: நாளை டெல்லி செல்லும் விஜய்; "காங்கிரஸ் தலைமையிடம் பேசுங்கள்" – பழனிசாமி வலியுறுத்தல்

மேகதாது அணை கட்டுவதற்கு கர்நாடகா அரசு எடுத்து வரும் முயற்சிகளைச் சுட்டிக்காட்டி...