15
November, 2026

A News 365Times Venture

15
Sunday
November, 2026

A News 365Times Venture

AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.32.49 లక్షల కోట్ల మైలురాయి..

Date:

విశాఖపట్నం వేదికగా నిర్వహించిన సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ ముగింపు మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి, తాజా పెట్టుబడుల వివరాలను వెల్లడించారు. జూన్ 2024లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ సదస్సుకు ముందు వరకు రాష్ట్రానికి 714 ప్రాజెక్టుల ద్వారా రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు రాగా, వీటి ద్వారా 19.3 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. వీటిలో రూ.17.10 లక్షల కోట్ల విలువైన 526 ప్రాజెక్టులకు ఇప్పటికే భూ కేటాయింపులు మరియు ప్రోత్సాహకాలను ఆమోదించగా, ఇవి 12.9 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నాయి. అంతేకాకుండా, రూ.7.30 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులు నిర్మాణ దశలో లేదా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, వీటి ద్వారా 7.7 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం పేర్కొన్నారు.

తాజా సదస్సు విజయవంతం కావడానికి ముందు ఐదు విదేశాల్లో, దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో మొత్తం 11 పెట్టుబడి రోడ్‌షోలు నిర్వహించామన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా విశాఖలో ఏఐ-డేటా సెంటర్లు, కాకినాడలో సముద్ర ఆధారిత పరిశ్రమలు, అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ, అనంతపురంలో రక్షణ రంగం, తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ రంగాలపై ప్రాంతీయ సదస్సులు జరిగాయి. అక్టోబర్ 7 నుండి 26 వరకు జరిగిన ఈ ప్రాంతీయ సదస్సుల్లో రూ.86,522 కోట్ల విలువైన 194 ఒప్పందాలు కుదిరాయని, తద్వారా 1,47,951 ఉద్యోగాలు రానున్నాయని వివరించారు.

ఇక నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో జరిగిన ప్రధాన సీఐఐ సదస్సులో రూ.9,02,434 కోట్ల పెట్టుబడి విలువతో 109 కీలక ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా 2,00,358 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రాంతీయ సదస్సులు మరియు ప్రధాన సమ్మిట్ కలిపి మొత్తం 303 కొత్త ఒప్పందాల ద్వారా సుమారు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు, 3,48,309 ఉద్యోగాలు రాష్ట్రానికి దక్కాయని వెల్లడించారు. ముఖ్యంగా, పెనుకొండలోని కియా (KIA) ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండు లక్షల వాహనాల మేర పెంచేందుకు రూ.18,878 కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిందని, దీనివల్ల అదనంగా 12,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మొత్తంగా జూన్ 2024 నుండి ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల విలువ రూ.32.49 లక్షల కోట్ల మైలురాయిని చేరుకుందని ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഹുവാങിന് പകരം; എന്‍വിഡിയ സി.ഇ.ഒ സ്ഥാനത്തേക്ക് മൂന്ന് ഇസ്രഈലി സാങ്കേതിക വിദഗ്ധരും

ടെല്‍ അവീവ്: ജെന്‍സണ്‍ ഹുവാങിന് പകരം എന്‍വിഡിയയുടെ സി.ഇ.ഒ സ്ഥാനത്തേക്ക് സാധ്യതയ...

'குழி தோண்டி நீச்சல் குளத்தைச் சேதப்படுத்திட்டாங்க' – ஜெம் வீரமணி குடும்ப வக்கீல் குற்றச்சாட்டு

போக்சோ வழக்கில் கைதான ஜெம் வீரமணியின் ராயப்பேட்டை வீட்டில் சிறுமிகளின் உடல்...

മൂന്ന് വര്‍ഷത്തിന് ശേഷം ഒരു പാകിസ്ഥാന്‍ മന്ത്രി ഇന്ത്യയിലേക്ക്; മുസാദിക് മസൂദ് മാലിക് എസ്.സി.ഒ യോഗത്തിനെത്തും

ന്യൂദല്‍ഹി: ഈ മാസം ഇന്ത്യയില്‍ നടക്കുന്ന ഷാങ്ഹായ് കോപറേഷന്‍ ഓര്‍ഗനൈസേഷന്റെ (എസ്.സി.ഒ)...

'பெண்ணின் ரகசிய வாக்குமூலம்; 8 மணி நேர சோதனை; 3 குழிகள்'- ஜெம் வீரமணி வீடு சோதனை; பின்னணி என்ன?

போக்சோ வழக்கில் கைதுசெய்யப்பட்டு சிறையில் இருக்கும் ஜெம் வீரமணியின் ராயப்பேட்டை வீட்டில்...