12
November, 2026

A News 365Times Venture

12
Thursday
November, 2026

A News 365Times Venture

IPL 2028: ఐపీఎల్ అభిమానులకు పండగే పండగా.. ఐపీఎల్‌లోకి రెండు కొత్త జట్లు..

Date:

భారత క్రికెట్ నియంత్రణ మౌలిక మండలి ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)ను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 2028 సీజన్ నుంచి మరో రెండు కొత్త జట్లను లీగ్‌లోకి తీసుకురావాలని చూస్తోంది. ఈ కొత్త జట్ల కోసం ప్రధానంగా పూణే, వడోదర నగరాల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదిత విస్తరణ 2028-2032 మీడియా హక్కుల కాలానికి సరిగ్గా సరిపోయేలా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి ఐపీఎల్ పట్ల ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చే ఒక్కో జట్టు విలువ ఒక బిలియన్ డాలర్లకు పైగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

గుజరాత్ రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా వడోదర పేరు పరిశీలనలోకి వచ్చింది. ఇప్పటికే గుజరాత్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఉంది. ఇక పూణే విషయానికి వస్తే.. గతంలో ఈ నగరం నుంచి ‘పూణే వారియర్స్ ఇండియా’, ‘రైజింగ్ పూణే సూపర్‌జెయింట్’ అనే రెండు జట్లు ఐపీఎల్‌లో ఆడాయి. అందువల్ల పూణేలో మంచి క్రీడా వాతావరణం ఉందనే అభిప్రాయం ఉంది. యూరప్, పశ్చిమాసియాకు చెందిన ప్రముఖ పెట్టుబడి సంస్థలు, భారత్‌లోని బడా వ్యాపార దిగ్గజాలు కొత్త జట్లలో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపుతున్నారు.

ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), రాజస్థాన్ రాయల్స్ జట్ల వాటాల విక్రయం భారీ ధరలకు జరిగింది. దీనివల్ల ఐపీఎల్ జట్ల విలువ విపరీతంగా పెరిగింది. చివరిసారిగా 2022లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఐపీఎల్‌లోకి వచ్చాయి. అయితే.. కొత్త జట్లను లీగ్‌లో చేర్చడం అనేది కేవలం పెట్టుబడులపైనే కాకుండా మ్యాచ్‌ల సంఖ్య, ప్రసారకర్తల ఆసక్తి, కీలక ఆటగాళ్ల లభ్యతపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నందున, రాబోయే రోజుల్లో దీనిపై ఒక పూర్తి స్పష్టత రానుంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ആര്‍.എസ്.എസുമായോ ബി.ജെ.പിയുമായോ തനിക്ക് ബന്ധമില്ല: സോണിയ ഗാന്ധിയുടെ ആരോപണത്തില്‍ പ്രതികരിച്ച് അണ്ണാ ഹസാരെ

ന്യൂദല്‍ഹി: 2012ല്‍ അഴിമതി വിരുദ്ധ സമരം ബി.ജെ.പിയും ആര്‍.എസ്.എസും ആസൂത്രണം ചെയ്തതാണെന്ന...

Aaryavir Sehwag: బ్యాటింగ్‌లో వీరవిహారం చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ప్రపంచంలో సరికొత్త రికార్డు..

యూఏఈతో జరిగిన అండర్-19 ఆసియా కప్‌ మ్యాచ్‌లో భారత యువ సంచలనం,...

എല്‍.പി.എസ്.ടി ഉദ്യോഗാര്‍ത്ഥികളുടെ സമരപ്പന്തല്‍ പുനര്‍ നിര്‍മിച്ച് ഡി.വൈ.എഫ്.ഐ; സമരം തുടരേണ്ടത് കേരളത്തിന്റെ ആവശ്യമെന്ന് ജയകൃഷ്ണന്‍

തിരുവനന്തപുരം: പൊലീസ് പൊളിച്ചുനീക്കിയ എല്‍.പി.എസ്.ടി ഉദ്യോഗര്‍ത്ഥികളുടെ സമരപ്പന്തല്‍ പുനര്‍ നിര്‍മിച്ച് ഡി.വൈ.എഫ്.ഐ....