8
November, 2026

A News 365Times Venture

8
Sunday
November, 2026

A News 365Times Venture

Mitchell Santner: “వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. అందులో దాచడానికి ఏం లేదు”.. కివీస్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..

Date:

Mitchell Santner: వెల్లింగ్‌టన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఓటమి అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ స్పందిస్తూ.. టీమిండియా బౌలర్లను మనస్ఫూర్తిగా ప్రశంసించాడు. వెల్లింగ్‌టన్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని, అలాంటి పరిస్థితుల్లో భారత బౌలర్లు తమను దారుణంగా దెబ్బకొట్టారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బౌలింగ్ వల్లే మ్యాచ్ ఓడినట్లు అర్థం వచ్చేలా మాట్లాడాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ వేడుకలో సాంట్నర్ మాట్లాడుతూ.. “పిచ్ చాలా ట్రిక్కీగా ఉంది, అందులో దాచడానికి ఏమీ లేదు. ముఖ్యంగా ఇన్నింగ్స్ ప్రారంభంలో భారత బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేసి మాపై ఒత్తిడి పెంచారు. త్వరగా వికెట్లు కోల్పోవడం ఎప్పుడైనా ఇబ్బందే. అయితే మేము చేసిన పరుగులు తక్కువే అయినప్పటికీ, పిచ్‌పై సీమర్లకు సహకారం ఉండటంతో మా బౌలర్లు కూడా బాగానే పోరాడారు. వికెట్లు తీస్తూ భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాం” అని చెప్పుకొచ్చాడు. ఈ క్లిష్టమైన వికెట్‌పై కనీసం 160 నుంచి 180 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని సాంట్నర్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ యూనిట్‌గా మరికాస్త ఓపికగా ఆడాల్సిందని అన్నాడు. అలాగే మ్యాచ్ మధ్యలో తమ ఫాస్ట్ బౌలర్ బ్లేర్ టిక్నర్ (Blair Tickner) ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్ ఇస్తూ.. అతను ప్రస్తుతం హోటల్ రూమ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడని, త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. చివరగా, వాతావరణం కూడా ఒక కారణమైనప్పటికీ భారత బౌలర్లు పరిస్థితులను చక్కగా వాడుకొని తమను ఆలౌట్ చేశారని సాంట్నర్ ఒప్పుకున్నాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ పర్యటనలో భారత బౌలర్లు తమ విశ్వరూపాన్ని కొనసాగిస్తున్నారు. వరుసగా రెండో వన్డేలోనూ అనుకూలించిన పరిస్థితులను చక్కగా వాడుకుంటూ కీవీస్ బ్యాటర్లను తిప్పలు పెట్టేశారు. శనివారం వెల్లింగ్‌టన్ (Wellington)లో జరిగిన రెండో ఓడిఐ మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించినా, డక్‌వర్త్ లూయిస్ (DLS Method) ప్రకారం భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో టీమిండియా 2-0 తేడాతో ముందంజలో నిలిచింది. వర్షం కారణంగా మొదట.. మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. కీవీస్ జట్టు 41 ఓవర్లలో కేవలం 134 పరుగులకే ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ (Daryl Mitchell) 55 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) 31 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో ఎవరూ 11 పరుగులు కూడా దాటలేకపోయారు. భారత బౌలర్ల దెబ్బకు న్యూజిలాండ్ 53 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.

ఇండియన్ బౌలర్లలో గుర్‌నూర్ బ్రార్ (Gurnoor Brar) 4-30 కెరీర్ బెస్ట్ గణాంకాలతో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇతనికి తోడుగా అకిబ్ నబీ (Auqib Nabi) తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి రెండు వికెట్లు (2-31) పడగొట్టి ఓపెనర్లు విల్ యంగ్, టిమ్ సైఫర్ట్‌లను పెవిలియన్‌కు పంపాడు. గుర్‌నూర్ బ్రార్ తన 20వ ఓవర్‌లో ఒకేసారి టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్‌లను ఔట్ చేసి న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. అనంతరం 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఛేజింగ్ అంత సులువుగా సాగలేదు. న్యూజిలాండ్ పేసర్ జాకోబ్ డఫీ (Jacob Duffy) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ను గోల్డెన్ డక్‌గా, విరాట్ కోహ్లీని 7 పరుగులకే ఔట్ చేశాడు. ఆ తర్వాత కైల్ జేమీసన్ 30 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్‌ను పెవిలియన్ చేర్చడంతో భారత్ 86 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. భారత్ 26 ఓవర్లలో 113-7 తో ఉన్న సమయంలో మళ్లీ వర్షం ప్రారంభమై ఆట నిలిచిపోయింది. ఆ సమయానికి డక్‌వర్త్ లూయిస్ ప్రకార.. భారత్ 4 పరుగులతో విజయం సాధించింది. కేఎల్ రాహుల్ (KL Rahul) 26 పరుగులు, అకిబ్ నబీ 1 పరుగుతో క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

பெரியார் நூலக விவகாரம்: 'சர்ச்சையான புத்தகங்கள் தவெக ஆட்சியில் கொள்முதலானவை.!'- திமுக பரந்தாமன்

பெரியார் நூலகப் புத்தகக் கொள்முதல் முறைகேடு யார் ஆட்சியில் நடந்தது என்பது...

വൈദ്യുതി കരാര്‍: മറുപടി നല്‍കിയിട്ടും പ്രതിപക്ഷ നേതാവ് ആരോപണം വീണ്ടും ഉന്നയിക്കുന്നാണ് ദുരൂഹതയെന്ന് മുഖ്യമന്ത്രി

തിരുവനന്തപുരം: വൈദ്യുതി കരാറില്‍ ദുരൂഹതയുണ്ടെന്ന് പ്രതിപക്ഷ നേതാവ് പിണറായി വിജയന്റെ ആരോപണങ്ങളില്‍...

‘சண்டியர் என படம் எடுத்தால் கமல்ஹாசன் தமிழகத்தை விட்டே ஓட வேண்டியிருக்கும்’ – டாக்டர் கிருஷ்ணசாமி!

கோவை குனியமுத்தூரில் பகுதியில் புதிய தமிழகம் கட்சித் தலைவர் டாக்டர் கிருஷ்ணசாமி...

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఆ సీనియర్ జట్టు కెప్టెన్‌గా బుడ్డోడి నియామకం

యువ సంచలనం, బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని (Vaibhav Sooryavanshi) బీహార్ సీనియర్...