5
November, 2026

A News 365Times Venture

5
Thursday
November, 2026

A News 365Times Venture

ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!

Date:

ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా ప్రకటించిన పురుషుల క్రికెట్ ర్యాంకింగ్స్‌లో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టెస్టు బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రెండు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు.

నెం.1గా స్టార్క్

దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టులో మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో ఏకంగా 11 వికెట్లు పడగొట్టాడు. దీంతో 881 రేటింగ్ పాయింట్లతో టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. గత వారం నంబర్ వన్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో యాన్సెన్ 875 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన యాన్సెన్.. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో మాత్రం అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టెస్టు బౌలర్ల టాప్-10లో దక్షిణాఫ్రికాకు చెందిన సైమన్ హార్మర్, కగిసో రబాడా కూడా ఉన్నారు. కేప్‌టౌన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన హార్మర్ తొమ్మిది స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. రబాడా ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు.

బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లోనూ

దక్షిణాఫ్రికా ఆటగాళ్లు టెస్టు బ్యాటర్ల జాబితాలోనూ మెరుగైన ర్యాంకులు సాధించారు. ఏడెన్ మార్క్‌రమ్ ఒక స్థానం ఎగబాకి 11వ ర్యాంకుకు చేరుకోగా.. వియాన్ ముల్డర్ ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని 17వ స్థానంలో నిలిచాడు. ర్యాన్ రికెల్టన్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 23వ ర్యాంకును అందుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కామెరాన్ గ్రీన్, అలెక్స్ క్యారీ కూడా ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించారు.

శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్

టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రెండు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో అర్ధశతకం సాధించడం అతడికి కలిసొచ్చింది. ప్రస్తుతం అతడి ఖాతాలో 777 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. టాప్-10లో భారత్ నుంచి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కూడా ఉన్నారు. అభిషేక్ 889 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా., ఇషాన్ 862 పాయింట్లతో మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 341 పరుగులు చేసిన అతడు 13 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంకుకు చేరుకున్నాడు. టీ20 బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్, జాకబ్ డఫీ కూడా మెరుగైన స్థానాలు సాధించారు.

వన్డే ర్యాంకింగ్స్‌లో

పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన వన్డే ట్రై సిరీస్ తర్వాత వన్డే ర్యాంకింగ్స్‌లోనూ మార్పులు వచ్చాయి. పాకిస్థాన్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది బౌలర్ల జాబితాలో ఒక స్థానం మెరుగుపరుచుకుని ఐదో ర్యాంకుకు చేరుకున్నాడు. హారిస్ రౌఫ్ ఐదు స్థానాలు ఎగబాకి 24వ స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో సెంచరీ సాధించిన ఫఖర్ జమాన్ తొమ్మిది స్థానాలు మెరుగుపరుచుకుని 37వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఆరో స్థానానికి, శ్రీలంక ఆటగాడు పవన్ రత్నాయకే 16వ స్థానానికి ఎగబాకారు.ఈ లిస్ట్ లో టీమిండియా కెప్టెన్ 841 పాయింట్స్ తో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വോട്ടര്‍മാരെ വെട്ടുന്നത് ആനുകൂല്യങ്ങള്‍ നിഷേധിക്കാനുള്ള കേന്ദ്രത്തിന്റെ പദ്ധതിയുടെ ഭാഗം: കോണ്‍ഗ്രസ്

ന്യൂദല്‍ഹി: രാജ്യത്തെ ലക്ഷക്കണക്കിന് ജനങ്ങളെ രാഷ്ട്രീയ പ്രാതിനിധ്യത്തില്‍ നിന്നും ക്ഷേമ ആനുകൂല്യങ്ങളില്‍...

“நீங்கள் இருக்கும்போது எனக்கு நாட்டைப் பற்றி எந்தக் கவலையும் இல்லை" – பிரதமரிடம் பேசிய சரத் பவார்

தேசியவாத காங்கிரஸ் கட்சியின் தலைவரும் மூத்த அரசியல் தலைவருமான சரத் பவாருக்கு...

വിജയാഹ്‌ളാദ പ്രസംഗത്തിനിടെ സ്വവര്‍ഗ്ഗ പങ്കാളിയെ കെട്ടിപ്പിടിച്ച് വികാരഭരിതനായി ക്രിസ് പാപ്പാസ്; സെനറ്റിലെ ആദ്യ സ്വവര്‍ഗ്ഗാനുരാഗിയായി ചരിത്രനേട്ടം

ന്യൂ ഹാംഷെയര്‍: അമേരിക്കന്‍ സെനറ്റിലേക്ക് തെരഞ്ഞെടുക്കപ്പെടുന്ന ആദ്യ സ്വവര്‍ഗ്ഗാനുരാഗിയായ പുരുഷനെന്ന ചരിത്ര...

US Elections: சபாநாயகர் பதவியை நோக்கி ஹக்கீம் ஜெஃப்ரிஸ்… அமெரிக்க வரலாற்றில் புது மாற்றமா?

அமெரிக்கப் பிரதிநிதிகள் சபையில் ஜனநாயகக் கட்சி பெரும்பான்மையைப் பெற்றுள்ள நிலையில், அடுத்த...