5
November, 2026

A News 365Times Venture

5
Thursday
November, 2026

A News 365Times Venture

Bethupalli Lake Accident: మత్స్యకారులను కాపాడబోయి చెరువులో SDRF సిబ్బంది గల్లంతు

Date:

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు వద్ద తీవ్ర దిగ్భ్రాంతికర ప్రమాదం చోటుచేసుకుంది. చెరువులో చిక్కుకుపోయిన మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నారు. రక్షణ చర్యలు చేపడుతుండగా ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన రెండు బోట్లు అలుగు (మత్తడి) నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి.

మత్స్యకారుల రక్షణకు వెళ్లి..

స్థానిక సమాచారం ప్రకారం.. బేతుపల్లి చెరువు నీటి ప్రవాహంలో ఎనిమిది మంది మత్స్యకారులు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడానికి ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం వెంటనే రంగంలోకి దిగింది. నిరంతర శ్రమతో ముందుగా ముగ్గురు మత్స్యకారులను రెస్క్యూ టీమ్ సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చింది.

అలుగులో కొట్టుకుపోయిన రెండు బోట్లు

మిగిలిన ఐదుగురు మత్స్యకారులను కాపాడేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది మళ్లీ చెరువులోకి వెళ్లిన సమయంలో తీవ్రమైన నీటి ప్రవాహానికి అదుపుతప్పిన రెండు బోట్లు అలుగులో కొట్టుకుపోయాయి. ప్రమాద సమయానికి ఆ రెండు బోట్లలో కలిపి మొత్తం 11 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

మరో బోటుతో గాలింపు చర్యలు ముమ్మరం

అల్పపీడన ప్రభావంతో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో రెస్క్యూ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. నీటిలో కొట్టుకుపోయిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు మిగిలిన మత్స్యకారులను కాపాడేందుకు అధికారులు మరొక బోటు సహాయంతో గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు , వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానిక యంత్రాంగం , పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

നാട്ടിലേക്ക് മടങ്ങാൻ കുടിയേറ്റ തൊഴിലാളികളോട് ആഹ്വാനം; 125 ദിവസത്തെ തൊഴിലുറപ്പ് പ്രഖ്യാപിച്ച് സുവേന്ദു അധികാരി

കൊൽക്കത്ത: കേരളം ഉൾപ്പെടെയുള്ള ഇതര സംസ്ഥാനങ്ങളിൽ ജോലി ചെയ്യുന്ന തൊഴിലാളികൾ സ്വന്തം...

6am Special Show: "பொழுதுபோக்குக்கு முன்னுரிமை கொடுத்து எந்தச் சமூகம் வளர்ந்திருக்கிறது?" – சீமான்

தமிழ்நாட்டில் தியேட்டர்களில் காலை 6 மணி சிறப்புக் காட்சிகளுக்கு அனுமதி வழங்கி...

യു.എസ് തെരഞ്ഞെടുപ്പ് ഫലം; നെതന്യാഹുവിന്റെ അമേരിക്കയിലെ സ്വാധീനം കുറഞ്ഞത് ഗുരുതര പ്രത്യാഘാതങ്ങള്‍ സൃഷ്ടിക്കുമെന്ന് ഇസ്രഈല്‍ രാഷ്ട്രീയ നേതാക്കള്‍

ടെഹ്‌റാന്‍: യു.എസ് ഇടക്കാല തെരഞ്ഞെടുപ്പില്‍ ഡെമോക്രാറ്റിക് പാര്‍ട്ടിയുടെ വമ്പന്‍ വിജയത്തിന് പിന്നാലെ...

"தேர்தல் தோல்விக்கு ஈரான் போர் தான் காரணம்; இந்த 4 விஷயங்களை செய்தால் எல்லாம் சரியாகும்" – JD வான்ஸ்

அமெரிக்காவில் நேற்று முன்தினம் (நவம்பர் 3) நாடாளுமன்றத் தேர்தல் நடந்து முடிந்துள்ளது....