30
October, 2026

A News 365Times Venture

30
Friday
October, 2026

A News 365Times Venture

School Holiday in AP: ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఏపీలో రేపు కూడా 9 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!

Date:

School Holiday in AP: అర్నబ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాలు రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికల దృష్ట్యా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో రేపు కూడా అంటే గురువారం రోజు కూడా పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. వర్షాలు, వరదల ముప్పు పొంచి ఉండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు..

గురువారం రోజు కూడా.. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పోలవరం జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అదేవిధంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవు వర్తించనుంది. ఇక, కృష్ణా, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోనూ రేపు విద్యాసంస్థలు పనిచేయవు. మొత్తం తొమ్మిది జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.. కాగా, అర్నబ్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.. ఓవైపు సహాయక చర్యలు కొనసాగిస్తూనే మరోవైపు పంట, ఇతర నష్టాల అంచనాల్లో నిమగ్నమయ్యారు అధికారులు..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇസ്രഈല്‍ തിരഞ്ഞെടുപ്പ് ഫലങ്ങള്‍ റദ്ദാക്കണമെന്ന് തീവ്ര വലതുപക്ഷ പാര്‍ട്ടി നേതാവ്

ടെല്‍ അവീവ്: ഇസ്രഈല്‍ തെരഞ്ഞെടുപ്പ് ഫലങ്ങള്‍ റദ്ദാക്കണമെന്നും വീണ്ടും തെരഞ്ഞെടുപ്പ് നടത്തണമെന്നും...

“பசும்பொன்னில் சசிகலாவைச் சந்திக்க திட்டமா?" – எடப்பாடி பழனிசாமி விளக்கம்!

அதிமுக பொதுச் செயலாளர் எடப்பாடி பழனிசாமி மதுரை விமான நிலையத்தில் செய்தியாளர்களைச்...

വാരണാസിയിലെ തോല്‍വിയെക്കുറിച്ച് മോദി മിണ്ടാത്തതെന്ത്? ബി.ജെ.പിയെ പരിഹസിച്ച് ജോണ്‍ ബ്രിട്ടാസ്

തിരുവനന്തപുരം: ബാലറ്റ് പേപ്പറില്‍ നടന്ന എം.എല്‍.സി. തെരഞ്ഞെടുപ്പിലെ വിജയത്തില്‍ ഊറ്റംകൊള്ളുന്ന പ്രധാനമന്ത്രി...

`மின்வெட்டால் மீனாட்சி அம்மனிடம் நிம்மதியாக பிரார்த்தனைகூட செய்ய முடியாது'- எடப்பாடி பழனிசாமி வேதனை

முத்துராமலிங்க தேவரின் குருபூஜையை முன்னிட்டு மதுரைக்கு வந்திருந்த முன்னாள் முதல்வர் எடப்பாடி...