26
October, 2026

A News 365Times Venture

26
Monday
October, 2026

A News 365Times Venture

IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!

Date:

IND W vs ZIM W: వడోదర వేదికగా జింబాబ్వే మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 121 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదట హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ అద్భుత శతకాలతో భారత్ 328 పరుగుల భారీ స్కోరు సాధించగా.. అనంతరం బౌలింగ్‌లో వైష్ణవి శర్మ, దీప్తి శర్మ చెలరేగడంతో జింబాబ్వే 48.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్మృతి మంధాన (0), షఫాలీ వర్మ (8) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో జట్టు 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో ప్రతీక రావల్ (61 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 67) చక్కటి ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకుంది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ (126 బంతుల్లో 15 ఫోర్లతో 121), దీప్తి శర్మ (86 బంతుల్లో 15 ఫోర్లతో 106 నాటౌట్) జింబాబ్వే బౌలర్లను ఉతికారేశారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు ఏకంగా 153 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. మహిళల వన్డేల్లో భారత్ తరఫున ఐదో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 328 పరుగులు చేసింది.

329 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు ఏ దశలోనూ స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్ మోడెస్టర్ ముపాచిక్వా (49), చినో ముగేరి-తిరిపానో (46), బిజా (34) కాసేపు పోరాడినా.. భారీ లక్ష్యాన్ని ఛేదించే వేగంతో ఆడలేకపోయారు. మిడిలార్డర్‌లో కెప్టెన్ జోసెఫిన్ న్కోమో (22), న్యాషా గ్వాంజురా (20) పరుగులు చేసినప్పటికీ భారత కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు నిలవలేకపోయారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన జింబాబ్వే చివరకు 207 పరుగుల వద్ద కుప్పకూలింది. భారత బౌలర్లలో యువ బౌలర్ వైష్ణవి శర్మ అద్భుత ప్రదర్శన చేసింది. 10 ఓవర్లలో కేవలం 39 పరుగులిచ్చి కీలకమైన 4 వికెట్లు పడగొట్టింది. శతకంతో చెలరేగిన దీప్తి శర్మ బౌలింగ్‌లోనూ 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పేసింది. సయాలీ సాత్ఘరే, జింతిమణి కలిత, శ్రీ చరణి తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ కలిసి మొత్తం 535 పరుగులు నమోదు చేయగా.. భారత్-జింబాబ్వే మహిళల వన్డే చరిత్రలోనే ఇది అత్యధిక మ్యాచ్ అగ్రిగేట్ రికార్డుగా నిలిచింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2 – 0 ఆధిక్యాన్ని సాధించడంతో ఒక మిగిలి ఉండగానే సిరీస్ ను గెలిచింది. చివరి, మూడో వన్డే 28న జరగనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ചേരാനല്ലൂർ വാഹനാപകടം: കാറുടമയായ ജഡ്ജിയെ കേസിൽ പ്രതിചേർത്തു; പൊലീസിനെതിരെ ഗുരുതര ആരോപണങ്ങളുമായി കുടുംബം

  തിരുവനന്തപുരം: ചേരാനല്ലൂരിൽ അമിതവേഗതയിലെത്തിയ ബെൻസ് കാറിടിച്ച് തട്ടുകട ഉടമയായ ജയബാലകൃഷ്ണൻ...

'ஐப்பசி பௌர்ணமி, சிவன் செண்டிமெண்ட், தாமரையோடு காமாட்சி விளக்கு!' – தனுஷ் மகளிரணி கூட்ட ஹைலைட்ஸ்!

நேற்று சென்னை செம்மஞ்சேரியில் தனது நற்பணி இயக்கத்தின் மகளிர் அணி நிர்வாகிகள்...

ബ്രസീല്‍ ചുവന്ന് തന്നെ, ലുല തുടരും: നാലാം തവണയും പ്രസിഡന്റ് സ്ഥാനത്തേക്ക്

റിയോ ഡി ജറീറോ: ബ്രസീല്‍ പ്രസിഡന്റ് തെരഞ്ഞെടുപ്പില്‍ ചരിത്ര വിജയം സ്വന്തമാക്കി...