25
October, 2026

A News 365Times Venture

25
Sunday
October, 2026

A News 365Times Venture

DGP Harish Kumar Gupta: “హింసకు పాల్పడితే ఉపేక్షించేది లేదు”.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ హెచ్చరిక

Date:

AP DGP Harish Kumar Gupta: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల్లో అభ్యర్థులకు, ఓటర్లకు పూర్తి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎనిమిది జిల్లాల్లో ఎన్నికలకు సంబంధించి 14 ఘటనలు నమోదయ్యాయని వెల్లడించారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, ఇప్పటికే 17 మంది నిందితులను గుర్తించినట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నామినేషన్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించినట్లు డీజీపీ పేర్కొన్నారు. అభ్యర్థులను అడ్డుకున్నా, ఓటర్లను బెదిరించినా, గుంపులుగా వచ్చి హింసకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల ఆదేశాలను ధిక్కరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, ముఖ్యంగా నామినేషన్ కేంద్రాల ముట్టడి, రహదారుల దిగ్బంధం వంటి చర్యలపై ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. ఎన్నికల భద్రతపై అధికారులు పర్యవేక్షణ పెంచాలని, అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు.

ఎన్నికల ప్రచారానికి సంబంధించి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా స్పష్టం చేశారు. ర్యాలీలు, సభలు, మైక్‌ల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుంటాయని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పోలీసుల చర్యలు ఉంటాయని, రాజకీయ అనుబంధం ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకోరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల ఉల్లంఘన ముప్పు ఉంటేనే బైండోవర్ చర్యలు ఉంటాయని, అయితే బైండోవర్ చేసినంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హత రాదని స్పష్టం చేశారు. సీసీటీవీ, డ్రోన్, వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, హింస వెనుక ఉన్న నిర్వాహకులు, ప్రేరేపకులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులపై దాడులు చేసినా, అభ్యర్థులను బెదిరించినా లేదా ఆస్తులను ధ్వంసం చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టబద్ధమైన ఎన్నికల ప్రక్రియను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని పేర్కొంటూ, ఎన్నికల ప్రశాంత నిర్వహణకు అందరూ సహకరించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని ధిక్కరిస్తే ఎలాంటి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കേരളത്തില്‍ വര്‍ഗീയ വിദ്വേഷത്തിന് സ്ഥാനമില്ല: ഇന്‍ഫ്ലുവന്‍സറുടെ വര്‍ഗീയ പരാമര്‍ശത്തില്‍ മുഖ്യമന്ത്രി

തിരുവനന്തപുരം: വര്‍ഗീയ വിദ്വേഷത്തിന് കേരളത്തില്‍ സ്ഥാനമില്ലെന്നും കേരളം ഒറ്റക്കെട്ടായി അതിനെ നേരിടുമെന്നും...

"அங்குதான் அவரைச் சந்தித்தேன்; நினைவுகள் நிறைந்த உலகம்.."- ராஜீவ் காந்தியுடனான காதல் குறித்து சோனியா

மூத்த காங்கிரஸ் தலைவரும், நாடாளுமன்ற உறுப்பினருமான சோனியா காந்தி ‘Belonging: A...

മെഗാ ഡാം പ്രൊജക്ടിനെതിരെ പ്രതിഷേധം ശക്തമാകുന്നു: അരുണാചലില്‍ സമരക്കാര്‍ക്കുനേരെ പൊലീസ് അതിക്രമം

ഇറ്റാനഗര്‍: അരുണാചല്‍ പ്രദേശിലെ സിയാങ് ജില്ലയില്‍ പ്രഖ്യാപിച്ചിരിക്കുന്ന സിയാങ് അപ്പര്‍ മള്‍ട്ടിപര്‍പ്പസ്...

தனுஷ் ரசிகர்கள் சந்திப்புக் கூட்டம்: இடம் கொடுத்த CM விஜய்க்கு நெருக்கமான கல்லூரி? விவரம் என்ன?

நடிகர் தனுஷ் தமிழக அரசியலில் பேசுபொருளாகியிருக்கிறார். தவெக, அதிமுக, அமமுக எனப்...