23
October, 2026

A News 365Times Venture

23
Friday
October, 2026

A News 365Times Venture

IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!

Date:

IND-W vs ZIM-W: రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వే మహిళలతో జరిగిన మూడో టీ20లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 92 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

భారత్ భారీ స్కోరు చేయడంలో హర్మన్‌ప్రీత్ కౌర్, షఫాలి వర్మ కీలక పాత్ర పోషించారు. హర్మన్‌ప్రీత్ కేవలం 41 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 91 పరుగులు చేసింది. షఫాలి 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు సాధించింది. దీంతో భారత్ 216 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెలిస్ న్‌ధ్లోవు ఖాతా తెరవకుండానే తొలి బంతికే ఔటైంది. అయితే షార్నే మేయర్స్ 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేసి పోరాడింది. బెలవ్డ్ బిజా 44 పరుగులు చేసినప్పటికీ మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు.

భారత బౌలర్లలో నందని శర్మ చేసి 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి చెరో వికెట్ తీశారు. దీంతో జింబాబ్వే 124/7కే పరిమితమై 92 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో కొన్ని అరుదైన రికార్డులు కూడా నమోదయ్యాయి. జింబాబ్వే తరఫున కెలిస్ న్‌ధ్లోవు మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక డకౌట్ల రికార్డును 9 డకౌట్లతో నమోదు చేసింది. షార్నే మేయర్స్ ఒక ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు బాదడంతో జింబాబ్వే మహిళల తరఫున అత్యధిక సిక్సర్ల రికార్డును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కలిపి 339 పరుగులు చేయడం కూడా రికార్డుగా నిలిచింది. జింబాబ్వేపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ మూడు విజయాలు సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മൈസൂരു ദസറ; ദളിത് മന്ത്രിമാര്‍ പൂജ നടത്തുന്നത് തടഞ്ഞ് പൊലീസ്: വീഡിയോ, വിവാദം

ബെംഗളൂരൂ: മൈസൂരു ദസറ ആഘോഷങ്ങളില്‍ പങ്കെടുക്കുന്നതില്‍ നിന്ന് ദളിത് സമുദായത്തില്‍ നിന്നുള്ള...

விழுப்புரம்: செஞ்சி சிறுமி மாயமான விவகாரத்தில் பின்தங்கிய காவல்துறை; களமிறங்கிய சிபிசிஐடி போலீஸார்!

விழுப்புரம் மாவட்டம், செஞ்சி ஆலம்பூண்டி ஊராட்சிக்குட்பட்ட ஒரு கிராமத்தைச் சேர்ந்த 7...

SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!

SL vs ENG: రావల్పిండిలో జరిగిన పాకిస్థాన్ వన్డే ట్రై-సిరీస్ మూడో...

ഇസ്രഈല്‍ ബന്ധം: വിവരസുരക്ഷാ ആശങ്കകള്‍ ചൂണ്ടിക്കാട്ടി സര്‍ക്കാര്‍ ഉദ്യോഗസ്ഥര്‍ക്ക് നാവിഗേഷന്‍ ആപ്പ് ഉപയോഗിക്കുന്നതിന് വിലക്ക്

ക്വാലാലംപൂര്‍: ഇസ്രഈലുമായി ബന്ധമുള്ളതിനാല്‍ സുരക്ഷാ ആശങ്കകള്‍ ചൂണ്ടിക്കാട്ടി നാവിഗേഷന്‍ ആപ്പായ വേസ്(...