15
October, 2026

A News 365Times Venture

15
Thursday
October, 2026

A News 365Times Venture

Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..

Date:

రాబోయే పండుగల సీజన్‌లో చక్కెర కృత్రిమ కొరతను నివారించి, వినియోగదారులకు అందుబాటు ధరల్లో చక్కెర లభించేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వచ్చి నవంబర్ 30 వరకు కొనసాగనున్నాయి. ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం.. చక్కెర వ్యాపారులు, డీలర్లు గరిష్టంగా 1,000 క్వింటాళ్ల నిల్వలను మాత్రమే కలిగి ఉండాలి. అలాగే తాము కొనుగోలు చేసిన సరుకును 15 రోజుల వ్యవధిలోనే మార్కెట్‌లో విక్రయించాల్సి ఉంటుంది.

అంతకుముందు ఆగస్టులో ఈ పరిమితి 4,000 క్వింటాళ్లు (30 రోజులు) కాగా, సెప్టెంబర్‌లో 2,000 క్వింటాళ్లకు తగ్గించారు. ఇప్పుడు దీనిని మరింత కఠినతరం చేస్తూ 1,000 క్వింటాళ్లకు కుదించారు. అయితే, భౌగోళిక రవాణా ఇబ్బందులు, సుదూర ప్రాంతాల సరఫరా అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోల్‌కతా, దాని పరిసర మెట్రో ప్రాంతాలతో పాటు అసోం రవాణా మార్గాలకు ఈ నిబంధనలో ప్రత్యేక మినహాయింపునిచ్చారు. అక్కడ వ్యాపారులు గరిష్టంగా 2,000 క్వింటాళ్ల వరకు సరుకును నిల్వ చేసుకునేందుకు కేంద్రం అనుమతించింది.

వ్యాపారులు భారీగా చక్కెరను నిల్వ చేసి సరుకు కొరత సృష్టించకుండా నిరోధించడం, మిల్లుల నుంచి మార్కెట్‌కు చక్కెర సరఫరా వేగవంతం చేయడం ఈ చర్య ప్రధాన ఉద్దేశం. దసరా, దీపావళి పండుగల వేళ తీపి పదార్థాల తయారీకి చక్కెర వినియోగం విపరీతంగా పెరుగుతుంది. ఇటీవల ఎక్స్-మిల్ ధరకు తోడు రిటైల్ మార్కెట్‌లో ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్న తరుణంలో, వ్యాపారులు ఈ ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తద్వారా పండుగల వేళ ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలని కేంద్రం భావిస్తోంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സി.ജെ.പിയുടെ ‘തിരംഗ മാര്‍ച്ച്’ ആഹ്വാനം: സെന്‍ട്രല്‍ പാര്‍ക്ക് വ്യാഴാഴ്ച അടഞ്ഞുകിടക്കുമെന്ന് മുനിസിപ്പല്‍ കൗണ്‍സില്‍

ന്യൂദല്‍ഹി: ഒക്ടോബര്‍ 16 വെള്ളിയാഴ്ച കൊണാട്ട് പ്ലേസിലെ സെന്‍ട്രല്‍ പാര്‍ക്കില്‍ സി.ജെ.പി...

'முதல்வர் விஜய்-ன் ஆந்திர பயணத்தில் விஷ்ணு ரெட்டிக்கு என்ன வேலை?'- துரைமுருகன் கேள்வி

முதலமைச்சர் விஜய்யின் ஆந்திரா பயணத்தில் ஆலோசகர் விஷ்ணு ரெட்டிக்கு என்ன...

കേന്ദ്രസര്‍ക്കാര്‍ ‘ദല്‍ഹിയെ ഇന്ത്യ-പാകിസ്ഥാന്‍ അതിര്‍ത്തിയായി മാറ്റി’; അഭിജീത് ദീപ്‌കെ

ദല്‍ഹി: എസ്.ഐ.ആര്‍ ക്രമക്കേടുകള്‍ ചൂണ്ടിക്കാട്ടി, മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാര്‍...

'தாமரை இலை மேல் தண்ணீர் போல…' – பட்டும் படாமல் SIR போராட்டத்தில் கலந்துகொண்ட தவெக?

சென்னை எழும்பூரில் இந்தியா கூட்டணி சார்பில் SIR க்கு எதிராகவும் தலைமைத்...