11
October, 2026

A News 365Times Venture

11
Sunday
October, 2026

A News 365Times Venture

Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు

Date:

నోబెల్ శాంతి బహుమతి విజేత నవీ పిళ్లైపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తీవ్ర విమర్శలు చేసింది. గాజాలో ఇజ్రాయెల్‌ మారణహోమానికి పాల్పడుతోందని ఆరోపించిన నవీ పిళ్లైను ‘యూదు వ్యతిరేక పక్షపాతి’గా అభివర్ణించింది. ఆమెపై ‘బిగాట్‌’, ‘అవినీతి ప్రాసిక్యూటర్‌’ అంటూ విమర్శలు గుప్పించింది.

నవీ పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు కార్యాలయం ఎక్స్‌ వేదికగా స్పందించింది. నోబెల్ బహుమతి కమిటీ తన నైతిక దిక్సూచిని కోల్పోయిందని విమర్శించింది. యూదులపై తప్పుడు ఆరోపణలను సృష్టించి ప్రచారం చేయడాన్నే తన వృత్తిగా మార్చుకున్న వ్యక్తికి అత్యున్నత గౌరవాన్ని అందించిందని ఆరోపించింది. నవీ పిళ్లై తన కెరీర్‌ మొత్తంలో ప్రపంచంలోని ఏకైక యూదు దేశమైన ఇజ్రాయెల్‌పై తప్పుడు ప్రచారం చేశారని, యూదులను దుష్టులుగా చిత్రీకరించే ప్రయత్నాలకు పాల్పడ్డారని నెతన్యాహు కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.

నవీ పిళ్లై ఆక్రమిత పాలస్తీనా భూభాగాలపై ఐక్యరాజ్యసమితి స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్‌కు నాయకత్వం వహించారు. గాజాలో ఇజ్రాయెల్‌ చర్యలపై ఈ కమిషన్ గత ఏడాది నివేదిక విడుదల చేసింది. అందులో ఇజ్రాయెల్‌ గాజాలో ‘జెనోసైడ్‌’ (మారణహోమం)కు పాల్పడుతోందని నిర్ధారించినట్లు పేర్కొంది. అయితే ఈ విచారణ కమిషన్ ఐక్యరాజ్యసమితి తరఫున అధికారికంగా మాట్లాడే సంస్థ కాదని గమనించాలి. గాజా యుద్ధంపై ఇజ్రాయెల్‌ చర్యలను విమర్శిస్తూ వచ్చిన ఈ నివేదికలు, ఆరోపణలను ఇజ్రాయెల్‌ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പൊലീസുകാര്‍ക്ക് മേല്‍ സെക്ഷന്‍ 333: ഹരിയാനയില്‍ പൊലീസുകാരെ പൂട്ടിയിട്ട് ഗ്രാമവാസികള്‍

ചണ്ഡിഗഡ്: വാറന്റ് ഇല്ലാതെ യുവാക്കളെ തടവിലാക്കാന്‍ വന്ന പോലീസുകാരെ ഹരിയാനയില്‍ പൂട്ടിയിട്ടതായി...

"டெல்லியைப் பார்த்தீர்களா…. மோடியின் கேம் ஓவர்!" – சென்னையில் ராகுல் காந்தி ஆவேசம்

இன்று சென்னை வந்திருந்த மக்களவை எதிர்க்கட்சித் தலைவரான ராகுல் காந்தி காங்கிரஸ்...

Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్‌లో హెచ్‌పి, డెల్, ఆసుస్,...

ജനാധിപത്യ നിഷേധത്തിനെതിരായ സമരത്തില്‍ പങ്കെടുക്കാനായതില്‍ സന്തോഷം; ഇതുകൊണ്ടൊന്നും പ്രക്ഷോഭം തളരില്ല: പൊലീസ് വിട്ടയച്ചതിന് പിന്നാലെ പിണറായി വിജയന്‍

  ന്യൂദല്‍ഹി: മുഖ്യതെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിന്റെ രാജി ആവശ്യപ്പെട്ടുകൊണ്ട് നടത്തിയ...